లేదా జాడ ఓ గురజాడ ?

                                                                
                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్


ఓ గురజాడ మహాశయా ,
మీకు ,

జయంతులు ,
వర్ధంతులు ,
సభలు పెట్టి ,
మీ వాళ్ళకు ,
సన్మానాలు ,
ముమ్మరంగా ,
చేసేవారే గాని ,
మీ అడుగుజాడలలో ,
నడిచే వారే కనపడరే ,
మీరు కోరుకున్న ,
చాటమన్న ,
మన దేశ ఘనతను ,
చాటే వారే లేరు ,
దాటేసేవారు తప్ప .


ఈ మన దేశంలో ,
వేళ్ళూనుకుపోయిన ,

కుళ్ళుని , కుతంత్రాల్ని ,
అన్యాయాల్ని ,
అరాచకాల్ని ,
అంతం చేసి ,
అంతులేని ఆనందంతో ,
చాటి చెప్పాలని ,
విశ్వ ప్రయత్నం చేసి ,
విఫలమైపోయా పలుమార్లు ,
మీరు కోరుకున్న ,
ఆ రోజు కొఱకు ,
ఎదురుతెన్నులు కాయటం తప్ప ,
మరింకేమీ చేయలేకపోతున్నా .


మీరున్న ఆనాటి పరిస్థితులు ,
ఈనాడు లేనే లేవు ,

అనుమానాలు , అవమానాలు ,
సమ పాళ్ళలో అధికమయ్యాయి ,
అశరీరులుగా ఉండి , కనపడకుండా ,
చూస్తూనే ఉన్నారనుకుంటున్నా  ,

అర్ధం చేసుకొంటున్నారనుకొంటూ ,
మన్నించమంటున్నా ,
ఇక ఆ ప్రయత్నం వాయిదా వేస్తున్నా 

 *******

3 comments:

  1. ఉన్నాడండి గుఱజాడ! అదే మన అడుగుజాడ!! వాయిదా వేయద్దు స్వామీ ప్రయత్నం చేస్తూనే ఉందామ్!!!

    ReplyDelete
  2. మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete