శ్రధ్ధాశ్రమం

  
కవితా రచన : శర్మ జీ ఎస్
నను కన్న తల్లితండ్రులారా ,
మీరేమో పెద్దవాళ్ళయ్యారాయె ,
మా యిరువురకు ఉద్యోగాలాయె ,
పిల్లలకు స్కూళ్ళు , ట్యూషన్లాయె ,
మీకు తెలియనిదేమీ లేదాయె
ఇంతదాకా ,
మీకేమీ చేయలేకపోయాను ,
మీ చేతనే చేయించుకొన్నాను ,
అలసి , సొలసి వున్నారు ,
విశ్రమించండి యికనైనా ,
అచట , ఆ  వృధ్ధాశ్రమంలో ,
ఏ లోటూ కలగకుండా ,
బాగా చూసుకొంటారు ,
మేమొచ్చి మీ బాగోగులు  చూస్తుంటాం ,
సకల సదుపాయాచటనే ఉన్నాయి ,
వీకెండ్స్ వస్తుంటాం , 
వీకెన్ కాకుండా చూసుకొంటాం ,
పండుగలకు మనింటికి వద్దురు ,
నలుగురితో నవ్వులో పాలు పంచుకొందురు ,
సరదాగా , సంతోషంగా గడుపుదురు ,
మాసానికో మారు మీతో నడుస్తాం ,
ఎవరినైనా చూడాలనుకుంటే చెప్దురు ,
వాళ్ళని నేనే మీ  వద్దకు పంపుతాం  ,
మేం మీ చెంత లేకున్నా ,
ఏ చేటు మీ చెంత చేరకుండా ,
తగు జాగ్రత్తలు తీసుకున్నాం ,
అండగ మేం మీకున్నామండి ,
మీరేమి ఖంగారు పడకండి ,
ఖర్చు గురించి అసలాలోచించకండి ,
మీరు హాయిగా , స్వేఛ్ఛను పొందండి ,
అందించండి మాకు , 
మీ అనంతకోటి ఆశీర్వచనాలు  .

అన్నింటా శ్రధ్ధ తీసుకున్నాక ,
కొండంత భరోసా మీరిచ్చాక ,
అంత శ్రధ్ధగా వాళ్ళు చూసుకొంటామంటుంటే ,
అమితానందంగా అక్కడకి వెళ్ళి ఉంటాం ,
అవసరమైనప్పుడు కాల్ చేస్తాం ,
ఆనందంగా వుంటాం , 
చూపులకదివృధ్ధాశ్రమం ,
మాలాంటి వయో వృధ్ధులకది ,
అత్యంత శ్రధ్ధతో చూసుకొనే శ్రధ్ధాశ్రమం .

********

8 comments:

 1. అలా ఐతే కానిదేముంది?

  ReplyDelete
  Replies
  1. ఇలాగుండాలని ఆశించటంలో తప్పు లేదు .

   Delete
 2. Vruddhasramalu sraddhasramalu ga unte acharaneeyame!

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగుకి స్వాగతమండి . ఇలాగుండాలని ఆశించటంలో తప్పు లేదు .

   Delete
 3. ఆర్ధిక స్వావలంబన లేకుండా తమకేమీ మిగుల్చుకోకుండా ఉన్నదంతా పిల్లలకు దోచిపెట్టితే,స్థిరాస్తులన్నీ ముందే అతిప్రేమతో వాళ్లకు రాసిచ్చేస్తే చివరకు చేరుకునేది వ్రుద్దాశ్రమాలకే!శర్మగారి వృద్ధాశ్రమం క్షమించాలి శ్రద్ధాశ్రమం పటనయోగ్యంగా ఆలోచనాత్మకంగా ఉంది!

  ReplyDelete
  Replies
  1. వృధ్ధాశ్రమాలు వృధా ఆశ్రమాలు కాకూడదని , శ్రధ్ధాశ్రమాలు కావాలని నా యోచన .నేను ఇండియా చేరుకున్నానండి .మీరెప్పుడొస్తున్నారు .

   Delete
 4. వృధ్ధాశ్రమాలు శ్రధ్ధాశ్రమాలు అయితే మంచిదే ,కానీ, మిమ్మల్ని చూడటానికి మా ఉద్యోగాలు అడ్డు,వీకెండ్స్కి, నెలకోసారి వస్తాం,అని ఈ విధంగా పిల్లలు అంటే ఆ తలితండ్రుల పరిస్తితి ఏమిటి,అవే మాటలు పిల్లల చిన్నప్పుడు మిమ్మల్ని కేర్ సెంటర్స్ లో , హస్చల్స్ లో పెడతాము మా జాబ్సుకి మీరు అడ్డు అని తలితండ్రులు బావిస్తే పిల్లలు ఎదిగే వీలుందా..ఎంతో డబ్బు ఖర్చుపెట్టి శ్రధ్దగా చూసుకునే ఆశ్రమాలు వున్నా,తమ పిల్లల ఎదుగుదలని ,వారి పిల్లల ముద్దు మురిపాలని చూస్తూ దగ్గరగా వుండాలనుకుంటారు పేరెంట్స్,..వృధ్ధాశ్రమాల్లో వున్నవారిని చూస్తే,వాళ్ళ కళ్ళల్లో కదలాడే సన్నని కన్నీటి తెర చెప్పకనే చెప్తుంది బ్రతుకు ఎంత భారమో..పెద్ద వయసులోనే కావాలి పిల్లల ఆసరా, ఆదరణ,అది కరువయ్యే పరిస్తితి ఏ తలితండ్రులకీ రాకూడదు,..పిల్లలు రానీయకూడదు...

  ReplyDelete
  Replies
  1. ఆ ఉద్యోగాలే లేకుంటే ఈ మాత్రం చూసే అవకాశం కూడా రాకపోవచ్చు . వాస్తవానికి ఉద్యోగఏ సద్యోగం .
   మనసు ఒక్కటే చాలదు మంచివారవటానికి . మనీ కూడా తప్పక అవసరం అన్నది పెద్దలూ అర్ధం చేసుకోక తప్పదు .
   ఇలా చూసినా జీవితాలు చక్కగా వెళ్తున్నట్లే .
   పిల్లల్ని కేర్ సెంటర్లలో , హాస్టల్స్ లో చేర్పిస్తున్నా అదీ మనీతో కూడుకున్నదేగా . ఈ ప్రపంచంలో ఎం చేయాలన్నా మనీ అవసరం ఎంతైనా ఉన్నది . తప్పదు మరి .

   Delete