ఆన్ సైట్

                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్
                              
                                                          ( మాలికలోని పెండెం గారి చిత్రానికి నా చిరు కవితా స్పందన )ఓ సాఫ్ట్ వేర్ గాళ్  బాడీ కాలిపోతోంది 
ఆఫీసు నుంచి ఆసుపత్రికి వెళ్ళింది 
వైద్యురాలిని సంప్రదించింది
టెస్టులకి ల్యాబరేటరీలు తిరిగింది ,
రిపోర్టులలో అనారోగ్య దాఖలాలు లేనే లేవు
అయినా , పేషంట్ పల్స్ రేటు డౌన్ అవుతోంది 
చూసిన వైద్యురాలు ఆశ్చర్యానికి లోనయింది .
ప్రత్యేక వైద్య బృందాన్ని పిలిపించింది , పరిశీలిస్తోంది

ఇంతలో ఆన్ సైట్ కాల్ వచ్చింది 
ఆ సాఫ్ట్ వేర్ గాళ్ సదరు పేషంట్ 
చక చకా ల్యాప్ టాప్ ఆన్ చేసింది 
నీరసంగా వున్నా హుషారుగా పని చేస్తోంది
ఆన్ సైట్ అఫ్ సైట్ అవగానే షట్ డౌన్ చేసింది
మఱల మునుపటిలాగే పల్స్ డౌన్ అయిపోయింది
యాంటీ బయోటిక్ మందులకు యాక్షన్ / రియాక్షన్ లేదు
అయినా హుషారు లేదు , చలనం లేదు .

మఱల ఆన్ సైట్ కాల్ , ల్యాప్ టాప్ ఆన్ చేసింది  
 హుషారే ధ్యేయంగా  పనిచేసింది
ఆన్ సైట్ కాల్ పూర్తవగానే ల్యాప్ టాప్ షట్ డౌన్ 
సాఫ్ట్ వేర్ గాళ్ పల్స్  బెడ్ మీద కౌంట్ డౌన్
చలనం లేక సంచలనం కలిగిస్తున్నది 

అంతదాకా రోగనిర్ధారణ చేయ(లే)ని 
ఆ ప్రత్యేక బృందం ఓ నిర్ధారణకొచ్చింది
వాళ్ళ ల్యాప్ టాప్ ఓపెన్ చేసింది
ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఫ్లిక్కర్లలో లాగ్ ఆన్ అయింది
ఇయర్ ఫోన్ ఆ పేషంటు నరాలకి తగిలించింది 
మెల్లగా కదలికలు ఆరంభమైనాయి
పడిపోయిన పల్సు రేటు పైపైకి వురుకుతోంది
పడుకున్న పేషంట్ లేచి కూర్చుంది 
పేషంట్ ఫుల్ గా రీఛార్జ్ అయింది 

ఫేస్ బుక్ , ట్విట్టర్ , యూ ట్యూబ్ , ఫ్లిక్కర్లను 
వీక్షిస్తూ విహారలోకాల్లో పయనిస్తోంది
వేరే ఏ మందులూ  పనిచేయ(లే)వని ఫైనల్ చేసేసింది .
ఈ(విడ) రోగానికిదే ట్రీట్ మెంట్ అన్నది 
ఇది లేటెస్ట్ కొత్త రోగం అదే ఆన్ సైట్ ఫీవర్ .

 *****

10 comments:

 1. హ హ హ .. బాగుంది మాస్టారు మీ ఆన్ సైట్ ఫీవర్ కవిత . ఆధునిక యుగంలో మనుషులు సాఫ్ట్ వేర్ యంత్రాల్లా మారుతున్న సమయంలో భవిష్యత్తులో ఇలాంటి రోగాలను కూడా చూడాల్సి వస్తుందేమో ...

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగుకి స్వాగతమండి . మరి జనాభా పెరుగుతున్న ఈ తరుణంలో రకరకాల రీతులను ఉపయోగిస్తున్నాము గనుక ఎలాంటి రోగాలైనా రావచ్చండి .

   Delete
 2. వ్యంగ్య కవిత అనిపించినా చాలా అర్ధముంది. చక్కగా ఇప్పటి కాల పరిస్థితులను చెప్పారు.

  ReplyDelete
 3. శర్మ గారి ఆన్ సైట్ కవితలో ఒక అమ్మాయి ఆన్ లైన్ edict అయినవైనాన్ని అత్యాధునికంగా ఎక్కడా tempo చెడకుండా అభివ్యక్తీకరించారు!

  ReplyDelete
 4. నేను ఇలాగే అయిపోతానేమో :-)

  ReplyDelete
  Replies
  1. మనమూ ఇలా అయిపోతామేమో అంటే బాగుంటుంది కదూ !

   Delete