ఒక్కో ఒంటితీరు

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్


పాల గ్లాసుతో గదిలో అడుగుపెట్టిన అపర్ణని చూశాక , ఆ బ్రహ్మని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు రామారావు .అపర్ణ తల్లితండ్రులని అపర బ్రహ్మలుగా మనసులోనే మెచ్చేసుకున్నాడు . మెల్లగా , సిగ్గుతో అడుగులో అడుగు వేస్తూ పందిరి మంచం చేరుకున్నది అపర్ణ , పూల పరిమళాలు , పరిసర వాతావరణం అటు వైపే ఆకర్షించగా . పాలగ్లాసు ఆ పందిరిమంచం పక్కనే వున్న టీ పాయ్ పై వుంచింది .
మౌనం మహమ్మారిలా  వ్యాపిస్తుందేమోనన్న   అనుమానంతో , రామారావే చొరవ చేసుకొని , "   అన్నింటా మీ లేడీసే ఫష్ట్ అయినా , శోభనం గదిలో జంట్స్ ఫష్ట్ , అదే బెష్ట్ "   అన్నాడు .
అపర్ణ నుంచి సమాధానమేమీ రాకపోయేసరికి "   మీ వూరి వాళ్ళందరికి బుధ్ధి లేకపోయిందోయ్, నిన్ను అప్పలమ్మ అని పిలవటానికి , అపర్ణ అని కూడా కాదు నిన్ను పిలవవలసింది , అప్సరస అని పిలవాలోయ్ . "   

" అప్సరస అని ఊరంతా పిలిచి , నాలోని రసాన్ని వారందరూ ఆస్వాదిస్తే , మీకేమి మిగిలేది కాదండి . అందుకే నేనూ ఆ అందాన్ని యింతకాలం భద్రంగా దాచి వుంచా . మీ కొరకేనండి . మొన్న 3 నిద్రలలోనే యిచ్చేయాలనుకున్నాను . కాని వీలుకుదరలేదు . ఆ తర్వాత తెలిసింది ఆ 3 నిద్రలలో యివ్వగూడదట . ముహూర్తం కావాలని ఆపింది మా నీలూ "   అని జరిగిందంతా వివరించింది .

"   అంత యిది అయిపోయావా అపర్నా , సారీ నిన్ను డిజప్పాయింట్ చేసినందుకు . "

" సారీ దేనికండి . నేనే , సినిమాలు చూసి ఆ పరిజ్ఞానంతో  పెళ్ళి కాగానే ఫష్ట్ నైట్ అనుకున్నా . అది నా పొరపాటు . అందువల్లే పొందలేకపోయాను . " 

" అయితే సారీలు , శారీలు మనిరువురి నడుమ వుండకూడదు . మరిక ఆలస్యం దేనికి ? "

"   ఐతే ఒక్క షరతండి . "

" మొగుడు పెళ్ళాల నడుమ షరతులుండకూడదు , షర్బతులు మాత్రమే వుండాలి ."

 "   మరే , మరే నకు చిరంజీవి అంటే మహ చెడ్డ యిష్టమండి . "

" ఐతే మరీ మంచిది . నాకూ చిరంజీవి అంటే అమిత యిష్టం . అస్సలు చిరంజీవి అంటే సిరంజి అన్నమాట . సిరంజి అంటే యింజక్షణ్ తెలుసుగా . "

"   అబ్బ ఎంత అడ్ర్ష్టమాండి . మన యిరువురిది ఒకే అభిరుచి . మీరు నా మాట కాదనరు , మీ మాట నేను కాదనను . ఇక మన దాంపత్యానికి ఎదురు లేదు . అసలు దంపతులలో కూడా ఒకే హీరో మీద అభిమానం వున్న వాళ్ళే వుంటే , ఏ లోటూ వుండదు కదండి . "

" నిజమే . గడియారం చూడు పెద్ద ముల్లు , చిన్న ముల్లు కలసిపోతున్నాయి . అంటే మనం యిక ఆలస్యం చేయకూడదు . దాంపత్యానికి పధ్యం పెట్టి , సంసారంలోని సారాన్ని జుఱ్ఱుకొందాం . "

"   అలాగే నండి . నాదో చిన్న కోరిక ."

" ఊ .... త్వరగా చెప్పు . "

"   చిరంజీవి పాటలు వింటూ ప్రారంభిస్తే మాంచి స్పీడు అందుకోగలమని .... " 

" అమ్మదొంగా , నీ పేరు వెనుక , అంతకత , నీలో యింత రసికత దాగి వున్నాయన్నమాట . అందరూ అప్పలమ్మ , అప్పలమ్మ అని పిలుస్తుంటే , ఏ తిక్కలమ్మో , తిప్పలమ్మో అనుకున్నానే గాని ఇంత సరసవీణవని అనుకోలేదు . నిజ్జంగా నీవే నాకు సరైన జోడీవి "   అంటూ కేసెట్ ఆన్ చేశాడు .

సంగీత ఝరి ప్రారంభం , సంసార ధుని సంరంభం .అందాన్ని , ఆనందాన్ని మాటలతో చెప్పలేక , చెప్పుకున్న వైనంలో సాగింది వారి పయనం .
టేప్ రికార్డర్ వేడెక్కింది , వీరిరువురి వేడి చల్లారింది . అంతవరకు శ్రమించిన ఆ యిరువురూ కొంతసమయం విశ్రమించారు .
ఆ సమయంలో రికార్డరు చల్లబడింది . మరల వీరిరువురిలో తాపం మొదలైంది . చల్లబడిన రికార్డర్ వేడి పాటలు వినిపిస్తుంటే , వేడెక్కినస్ శరీరాలు చల్లపడాలని తహతహ చెందుతున్నాయి . ఇక్కడే సృష్టి విచిత్రం , అక్కడే దృష్టి తన్మయత్వం .
ఇలా రేయనక , పగలనక శ్రమిస్తూనే వున్నారు , విశ్రమిస్తున్నారు . అలా రామారావు అపర్ణల మూడు రాత్రులు , మూడు పగళ్ళు కూడా సెగలతో గడిచిపోయాయి . నిద్రాదేవి నిరీక్షించి , నిరీక్షించి క్షీణతకు లోనై వారికి దూరంగా వెడలిపోయింది .


                                                                                          ******

రామారావుది  రిప్రజెంటిటివ్ ఉద్యోగం  . అంటే ప్రజంట్ గా యిల్లు వదలి క్యాంపులకు వెళ్ళటమే . అలా క్యాంపుల నుంచి తిరిగి యింటికి చేరుకొనే సమయానికి , అపర్ణని  నియమాలతోనో , నోములతోనో , రామారావుకి దూరంగా వుంచుతున్నది తల్లి సరస్వతమ్మ .
క్యాంపుల నడుమ లంఖణం చేయక తప్పదు . ఇలా తను ఇంటి వద్ద నున్న సమయంలో కూడా లంఖణం చేయవలసి రావటం గురించే కలత చెందుతున్నాడు . 
సిగరెట్ అలవాటు కానంతవరకు రెండు పెదవులు అన్యోన్యంగా ఆలు, మగలులా కలిసే వుంటాయి . తీరా అలవాటు అయిన తర్వాత , ఆ రెండు పెదవులు వెంపర్లాడుతుంటాయి ఆ సిగరెట్ కొరకు . 
ఇలాగే  'ఆ' సుఖం కూడా అసలు పొందనంతవరకు ఏ బాధా వుండదు . ఒక్కసారి 'ఆ' సుఖం పొందితే , రెండవసారి , మూడవసారి , యిలా , యిలా సంఖ్యను పెంచుతూ ముందుకు సాగిపోతుంది . లెక్కించగల అవకాశాలుంటే వెనుకాడవలసిన పని లేదు . ఆ అవకాశాలు లేకుంటే , రాకుంటే ,మనసు మరే పని చేయనివ్వక , మధనపెట్టి చిరాకు కల్గిస్తుంది .
మన రామారావు ఈ కోవలోనివాడే . ఈ కారణాలు మనసుకి రణాలు కల్గిస్తాయి , వయసుకి రుణాలుగా మిగులుతాయి . నూతన దంపతులకు దారుణాలుగా పరిగణించబడ్తాయి .
శోభనం ముగిసిన తర్వాత మరల ఇంతవరకు 'ఆ ' సుఖం పొందలేదు . ఆ శోభనం కలలా మిగిలిపోయింది . అపర్ణకు కూడా అవస్థగానే వున్నది . కాకుంటే సరస్వతమ్మకు చెప్పుకోలేక తన అవయవాలకే సర్ది చెప్పుకొంటోంది .
ఎపుడైనా మామూలు రోజులలో రామారావు క్యాంపు నుండి ఇంటికి వస్తే , ఇంటి చాకిరీ చేసి , అపర్ణ పడకగది చేరబోయే సమయానికి సరస్వతమ్మ "   అబ్బాయి తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి విశ్రాంతి తీసుకొంటున్నాడు . ఇంత రాత్రి వేళ వాడిని యిబ్బంది పెట్టకు , ఇటు రా , నా పక్కనే పడుకో " తన పక్కనే పడక చూపించేది . ఇలా ఎప్పుడూ లంఖణం చేయవలసి వస్తుందన్న కోపంతో , మనసులోనే అనుకొన్నదిలా " ఈమె అత్తగారు కాదు లంఖిణి "   అని .
రామారావులో విసుగు విరామం లేకుండా కొనసాగుతూనే వున్నది .
 
                                                                                              ******             

మంచాన్నంటి పెట్టుకొని చాకిరీ చేసి అప్పలమ్మ అప్పసంగా అందుబాటులో వుండటం , మంచాన పడ్డాను అన్న దిగులు కూడా మరచిపోయేది సరస్వతమ్మ . వెనుకకి ఎవరో చెప్పారుట , ' అన్నీ అనువుగా వున్నచోటుకే అందుతుంటే రోగం కూడా మహాభోగమని  . '
రామారావు చిరాకు పడ్తున్నాడు అని తెలుసుకున్న సరస్వతమ్మ "   చిరాకు పడకురా చిట్టి తండ్రి , అమ్మాయి నా దగ్గరే వుండి , నాక్కావలసినవన్నీ చూస్తూనే వున్నదిగా . త్వరగా తగ్గిపోతుందిలేరా 4 / 5 రోజులలో "   అన్నది , ఈ చిరకు అంతా తన ఆరోగ్యం గురించేననుకొని .
వాస్తవానికి ఆ చిరాకంతా , అమ్మ గురించి కాదు , అపర్ణగురించే . ఎందుకంటే , రాక రాక మాంచి అవకాశం వచ్చింది అమ్మ మంచాన పడటం . ఈ అవకాశాన్ని చక్కగా వుపయోగించుకోవలసింది పోయి అమ్మ మంచాన్నే అంటిపెట్టుకొని , తను ఎంతకీ తన మంచం చేరదేమిటా ? అని .
ఈ కస్సు బుస్సులన్నిటికీ కారణం ఆ కసరత్తేనని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అపర్ణకి . తనకూ బాధగా వున్నా , అణచుకుంటూ , రామారావు అవస్థ చూసి నవ్వుకుంటూ వూరుకొంటుంది .

"    అపర్ణా నా డ్రెస్ సూట్కేస్ లో సర్దటానికి సమయమేమైనా చిక్కుతుందా "    కోపంతో కూడిన అవహేళనగా అడిగాడు .

"   అబ్బాయ్ నిన్ననే కదరా క్యాంపు నుంచి వచ్చింది . 4 రోజులదాకా మళ్ళీ క్యాంపు లేదన్నావు . మళ్ళీ అపుడే క్యాంపా "   అన్నది సరస్వతమ్మ .

" అర్జంటుగా టెలిగ్రాం వచ్చింది , వెళ్ళాలి . అయినా ఈ 4 రోజులు యిక్కడుండి ఏం చేయాలి ? ఈ అవస్థ కన్నా ఆ క్యాంపుకెళ్ళటమే మిన్న "   చిరాకుగా బదులిచ్చాడు .

"    అమ్మాయ్ అబ్బాయి సూట్ కేస్ సర్ది తీసుకురా . నా కాళ్ళన్ని లాగేస్తున్నాయి , కాస్త కాళ్ళు పడ్దువు గాని ."

"   అలాగేనండి అత్తయ్యగారు "   లోపలకి వెళ్ళింది .

"   అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో ."

" నువ్వేమీ దిగులుపడకురా , కోడలుపిల్ల చక్కగా చూసుకొంటుందిగా . ఇంక ఆరోగ్యం అదే చేకూరుతుందిలే . "
అపర్ణ హాల్లోనే పచార్లు చేస్తున్నది .

"   సర్దటం పూర్తయినదా అమ్మాయిగారు , బయట పచార్లు చేస్తున్నారు పనిలేని వాళ్ళలా . "

"   నేను దూరంగా వున్నానండి , సగం సర్దాను , మిగతావి మీరే సర్దుకోండి . "

"   దూరంగా వున్నవా ? దగ్గరుండి మాత్రం ఏం ఉధ్ధ్రించావు ? అయినా ఈ మధ్య నేనన్నా , నా పని అన్నా లెక్క లేకుండా పోయింది , గమనిస్తూనే వున్నాను . "

"   నువ్వుండరా , అమ్మాయి నెలేనా ? "   అడిగింది సరస్వతమ్మ .

"   లేదండీ అత్తయ్యగారు , నీళ్ళు పోసుకొని 15 రోజులే అయింది . అపుడే వచ్చి పడిందండి , ఏదో కొంప మునిగిపోయినట్లు . "

"   నిజమేనే కోడలు పిల్లా , ఏదైనా అర్జంటు పని వున్నపుడు , నాకు కూడా యిలాగే ముందు వచ్చి పడేవి . పెళ్ళీళ్ళకెళ్తే అక్కడా యిదే వరస , నా పరువు తీసేవనుకో . అయినా ఏం చేస్తాం , మన చేతిలో లేవుగా . "

"   అమ్మా అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం కదా . నేనా క్యాంపుకెళ్ళాలి అర్జంటుగా . మరి నిన్నెవరు చూస్తారే " అన్నాడు దిగులుగా .

మనసులో మాత్రం ఆనందపడిపోతున్నాడు రామారావు . మా యిద్దరినీ విడదీసి ఆనందపడి పోతావుటే లంఖిణి , బాగా కుదిరించాడులే ఆ భగవంతుడు నీ రోగం అని .

" అత్తయ్యగారు , మీకభ్యంతరం లేకపోతే , తలనిండా స్నానం చేసి లోపలకి వచ్చి , మీకు సేవ చేసుకొంటాను " మాట జవదాటని జవరాలులా .

' పిచ్చిదానా ఈ 3 రోజులైనా చాకిరీ లేకుండా సుఖపడక , మళ్ళీ లోపలకి వస్తానంటావేమిటే ' అని మనసులోనే అనుకున్నాడు రామారావు .

" అల్లాంటివి వద్దమ్మాయి , మనకు నిఖరంగా తెలిసినప్పుడు , దూరంగా వుండటమే మంచిది , మన సంప్రదాయం కూడాను . "

' నీ ముఖానికి సంప్రదాయం కూడానా ? ' ఎకసక్కెంగా మనసులోనే అనుకున్నాడు రామారావు .

"   అమ్మా మరి నే వెళ్ళాలి , నీ పరిస్థితి ఏమిటి ? "

" ఏమున్నదిరా , పడ్తూ , లేస్తూ అలాగే చేసుకుంటాను , తప్పదుగా మరి . "

' అలాగా ! తప్పనిసరైతే లేచి చేసుకొంటావన్నమాట . అవకాశం వుంటే అడ్డంగా పడుకొంటావన్నమాట . ఇక తెలిసిందిగా . నన్ను క్యాంపు నుంచి రాని నీ పని పడ్తాను ' అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు . "   అమ్మా మరి దానికి కూడా చేసిపెడ్తావా ? "

"   ఫరవాలేదమ్మాయ్ , నేను అలాగే చేసుకుంటా గాని , నువ్వు మీ బాబాయి గారింటికి వెళ్ళు . 4 వ రోజున నీళ్ళు పోసుకున్న వెంటనే వచ్చేయ్ . బాగా అలవాటు అయినావు , నే ఒంటరిగా వుండలేను . "

' యిన్నాళ్ళు ఒక్కమారు కూడా వాళ్ళ బాబాయింటికి వెళ్ళనీయకుండా , యిపుడు వెళ్ళమంటావా ఢాకిని .
 నన్ను , దాన్ని పిచ్చివాళ్ళుగా జమకట్టి ఏడ్పిస్తున్నావా మహాతల్లి . నీకలవాటైనదా . పెళ్ళి చేసుకున్నది నా కొఱకా ? నీ కొఱకా ? పైగా ఒంటరిగా వుండలేక పోతున్నావా ? ఒంటరిగా వుండలేక పోతుంది మేమిద్దరమే , మమ్మల్ని ఏదిపిస్తున్నావు గదుటె , అనుభవిస్తావు , ఇంతకింతకీ అనుభవిస్తావు ' అని లోలోపల తిట్టుకొంటూ కోపాన్ని అణగదొక్కుకొన్నాడు రామారావు .

"   అబ్బాయ్ దాన్ని వాళ్ళ బాబాయి వాళ్ళీంటి వద్ద దించి వెళ్ళరా . "

"   ఇప్పటికే ఆలస్యమైంది , ఇంకా యిది కూడానా . "

"   అవునురా , దానిని ఒక్కదానిని ఎలా పంపుతాము . అందునా కొత్త పెళ్ళికూతురాయె , పెళ్ళై నాలుగు నెలలు కూడా నిండలేదు . "

' ఓహో ఇప్పుడు పెళ్ళికూతురిలా కనపడ్తుందా లంఖిణీ . ఇన్నాళ్ళూ నీ మనస్సు , కళ్ళు ఎక్కడికి పోయాయే ' అని ఎగసిపడ్తున్న మనసుని లోలోనే నొక్కి పట్టుకున్నాడు .

"   సరే  నే వెళ్ళి సూట్ కేస్ సర్దుకుంటా "   లోపలకి వెళ్ళబోయాడు .

"    ఏమండీ ఆ చేత్తోనే , ఆ సూట్ కేస్ లోనే నా శారీస్ ,మ్యాచింగ్ జాకెట్లు , ఆ జాకెట్లకి అందాలు తెచ్చే బ్రా లు సర్ది తీసుకురాండి . "

' చివరకి వీటితో నన్ను సరిపెట్టుకోమంటావా చిత్రాంగి ' కొర కొరా చూశాడు అపర్ణని .

"   నాతో పాటు ఇంటివరకు వస్తారుగా , అక్కడ యిచ్చేద్దురు . "

"   ఆ పని చేయరా , ఇంకా ఏమిటి ఆలస్యం ? త్వరగా బయలుదేరు , అరగంట క్రితమే అర్జంటుగా వెళ్ళాలన్నావుగా . "

' లా(గి)పాయింట్లు నీ అవసరానికి భలే తీస్తావు ' అని మనసులోనే కసిని కసిగా నిఒక్కేసుకొన్నాడు .

"   అమ్మాయ్ , బస్సు ఎక్కేటప్పుడు , దిగేటప్పుడు తాకకుండా దూరంగా వుండు ."

" అలాగేనండి అత్తయ్యగారు , ఆ వంటింటి గూట్లో కారప్పొడి వున్నది చూసి వేసుకోండి . "

"   సరేనమ్మాయి వెళ్ళీరా . 4 వ రోజు త్వరగా నీళ్ళు పొసుకుని వచ్చేయ్ . "

                                                                                                      ( తరువాయి రేపటి టపాలో చూడగలరు  )

1 comment:

  1. మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete