కాళరాత్రి

                                                                                                                     కవితా రచన : శర్మ జీ ఎస్ 

గభీర నిశీధంలో
గావుకేక
నా మానసంలో
పొలికేకలా
వినిపించింది
చెవులు నిక్కబొడుచుకున్నాయ్
మనసంతా ప్రశ్నలమయం
ఎక్కడిదా గావుకేక ?
ఎవరిదా గావుకేక ?
గుడ్లగూబల అరుపులతో
కీచురాళ్ళ రవళులతో
ఆ అంద బంధుర ఆకసం
ఉరుములు ఉరుముతుంటే
ఆ వెఱపు మెఱుపుల మెఱుపులతో
దారి వెదకుతూ అరుపు వచ్చినవైపు
అంగలేశాను
కాలికేదో మెత్తగ తగిలింది
మరుక్షణం వెనుకంగ వేశాను
మఱల మరో మెఱపు మెరిసింది
ధృక్కులు సారించా అటువైపు
ఓ నవ యవ్వన సుందరి
శవంగా అగపడింది
తనువేమో యవ్వనపు పొంగుల్లో
పొంగి పొఱలుతుంటే
ఎద ఏమో రక్తం చిందులు త్రొక్కి
చిందర వందర అయి పాఱుతోంది
ఏ కామాంధుని కామదాహానికి
నడుం వంచక అడ్డుకట్ట వేసిందో
ఏ కిరాతకుల అరాచకానికి
తిరస్కరించిందో
అసలు కారణం
ఆ "   కాళరాత్రి "   కే ఎఱుక

          ******

2 comments:

  1. నిత్యం అవే కనపడుతున్నాయండి

    ReplyDelete
    Replies
    1. అందుకే కదండి అందరికి తెలియచేసే ప్రయత్నం ( ఎవరైనా మిస్సయుంటే ).

      Delete