పోర్టబుల్ మొగుడు

                                                                                                                               కధా రచన : శర్మ జీ ఎస్

కాలింగ్ బెల్ మ్రోగగానే డోర్ ఓపెన్ చేసి " హలో శైలజ గారూ వెల్ కం . ఇప్పుడేనా రావటం , మీకొఱకే వెయిట్ చేస్తున్నాను , కమిన్ " అంటూ దారి యిచ్చి , శైలజ లోపలకు అడుగిడగానే డోర్ లాక్ చేసి లోపలకు నడిచాడు మధు .
బ్రీఫ్ కేసు టేబుల్  పై వుంచి "   డియర్ ట్రెయిన్ ఆలస్యమవటంతో ప్రయాణం యిబ్బందికరంగా జరిగింది . మొదట కాలకృత్యాలు "   బాత్ రూం కి దారి తీసింది శైలజ .
అర్ధగంట గడిచాక కాఫీ తాగారిరువురూ , మెడలోని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది .
సూత్రం చూసిన మధు సూత్రం తెగిన గాలిపటంలా అటు , యిటు కంగారుగా ఊగిసలాడుతున్నాడు . "   ఏమిటది ? మంగళసూత్రమా ? అదీ నీ మెడలోనా ? "   అడిగాడు .

"   అవును , మంగళసూత్రమే , అలా కంగారు పడతారెందుకు ? "    అన్నది తాపీగా శైలజ .

"   కంగారుపడనవసరం లేదని తెలికగా చెప్పేస్తారు . నెను కట్టవలసిన మంగళసూత్రం నాక్కాబోయే అమ్మాయి మెడలో ఎవరో కట్టినట్లు కళ్ళకు కనపడ్తుంటే కంగారు కాక యింకేముంటుంది ? "

"   ఈ మాత్రం దానికే యిలా అయిపోతే ఎలా ? ఇల్లు వదలి బైటకు వస్తున్నా కదా . ఎవరైనా పోకిరీలు వెంటబడ్తారేమోనని , ఆ సూత్రం వాళ్ళకంట బడాలని నాకు నేనే వేసుకున్నాను . " "

"   మీరే వేసుకున్నారా ? హమ్మయ్య బతికించారు . నా అవకాశాన్ని నాకు వుంచారుగా . "

"   అలా ట్రెయిన్ దిగి వస్తున్నానా , ఓ పోకిరి వెంటబడ్డాడు . ఈ తాళిజాకెట్ లోంచి బైటకు తీసి కళ్ళకద్దుకున్నా , అంతే పరారయి పోయాడు . ఇదే నన్ను సురక్షితంగా నన్ను మీ వద్దకు చేర్చింది "   అన్నది .

"    మంచిపనే జరిగింది . ఇక్కడ పోకిరీలు లేరుగా . ఇంకా మెడలో ఎందుకా సూత్రం , తీసి దాచుకోండి . వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకుందురు . "

"   ఫరవాలేదు డియర్ , వుండనీయండి . "

" ఉహు , ముందు దాన్ని తీసేయండి . "

"   తీయను . "

"   దేనికని ? "

" మీరు చెప్పినట్లు తీసేశాననుకోండి . మిమ్మల్ని , నన్ను యిలా ఒకే రూం లో సడెన్ గా పోలీసులు చూశారనుకోండి , అనుమానించి , యిదేదో ఆ బాపతు అని ముద్దర వేసి , మనిరువురిని చెరొక గదిలో పడవేస్తే , మనం సరదాగా గడపాలన్నది ఏమౌతుందో ఆలోచించారా ? మన సరదాలకి ఈ తాళి అడ్డమేమీ కాదు . ఓ వేళ యిపుడు పోలీసులొచ్చినా , మనం భార్యాభర్తలమనుకొని మన జోలికి రారు . ఈ తాళిని అలాగే వుండనీయండి . "

"   మీరు చెప్పినది బాగానే వున్నది . కని అది మీ మెడలో వుండటం వలన , మీరు పెళ్ళైనవారు , పరాయి స్త్రీ అన్న భావన నన్ను మీ విషయంలో ఫ్రీగా మూవ్ కానీయటం లేదు . "

"   అదా సంగతి . అయినా అందులో ఏమున్నది ? మన(సు)లో వుండాలి . మీరంతగా చెప్తుంటే కాదంటానా " 
మంగళసూత్రాల్ని తీసి తలగడ క్రింద దాచింది .

"   శైలజా యిప్పుడు నిన్ను చూస్తుంటే నూటికి నూరుపాళ్ళు కుమారివి , నాదానివే నన్న భావన బలపడింది . కమాన్ గివ్ ఏ క్లోజప్ . చాలా విషయాలు మాట్లాడుకోవాలి "   అంటూ ముందుకు మూవ్ అయి ఎన్నో కొత్త విషయాలకి మూమెంట్ యిచ్చి అతని అకౌంటులో పేమెంట్ చేశాడు . అతని చొరవకి , ఆమె ఉరవడి జత కాగా , వారిరువురి అవయవాలకు అలజడి కల్గింది .

ప్రయాణపు అలసట తీరాలంటే మజిలీ ( విరామం ) చాలా అవసరం . ఆ విరామంలో ఎన్నో విషయాలు , ఆ పిమ్మట మరల పయనం . ఇదే అనాదిగా వస్తున్న వైనం .

"   తొందరపడకు డియర్ . మొదట మా ఇంటిలోవాళ్ళని ఒప్పించాలి . ఆ తర్వాతే మ్యారేజ్ . అందాకా యిలా మ్యానేజ్ చేసుకుందాం "   అన్నది .

మరల పయనం ప్రారంభం , తనువుల చాలనంలో మధు కాళ్ళు గీసుకున్నాయి . శైలజకు యింతకుమునుపే మ్యారేజ్ అయిందన్న నిర్ణయానికొచ్చి ఏమీ తెలియనివానిలా " నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ? " అడిగాడు .

"   ఇంకా అనుమానమా . నీ కొరకు నా మానాన్ని ఎంతో అభిమానంగా యిచ్చుకున్నాను , పుచ్చుకున్నావు . నాలుగైదు మార్లు కాళ్ళు తారుమారైనాయి . ఇప్పుడు అడుగుతున్నావేమిటిలా ? " అన్నది .

"   అహ పెళ్ళైనవాళ్ళు ప్రేమిస్తారా ? "   అమాయకంగా అడిగాడు .

"   ప్రేమించటానికి అందరూ అర్హులే "   అన్నది .

పొజిషన్ మార్చి "   నీకు పెళ్ళైంది కదూ "   అని అడిగాడు .

"   అయినందువలన నీకొచ్చిన తంటా ఏమిటంటా ? ఏ విషయంలో నైనా అభ్యంతరం చెప్పానా ? ఆనందానికి కొరవ చేశానా ? పెళ్ళీ చేసుకునేది ఈ ఆనందం కొరకేగా . నేనెప్పుడూ రెడీయే . ఇంకా అనుమానమెందుకు ? ప్రొసీడ్ , నాలో టెన్షన్ రేపక అటెన్షణ్లో వుండి ఆ టెన్షన్ని బైటకు నెట్టేసెయ్ "   అన్నది .

తటాలున లేచి "   నా బెట్టర్ హాఫ్ ని నేనే ముచ్చటగా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా . నాకు కన్య కావాలి , శ్రీమతి కాదు "   అన్నాడు .

"   ఇంతదాకా కన్యగా అనుభవించావు , ఆనందం పొందావు . ఇప్పుడు శ్రీమతి అని తెలియగానే ఆ ఆనందం కొరవయిందా ? ఇంతలో అంత మార్పు కనపడిందా ? డియర్ ఇంతవరకు వచ్చాక దాచవలసిన అవసరం లేదు . నెను శ్రీమతి శైలజా  మనోహర్  ని . నా భర్తకి దుబాయ్ లో ఉద్యోగం . ఏ సంవత్సరానికో , సంవత్సరన్నరకో ఇండియా వచ్చి , తను ఇన్నాళ్ళూ సంపాదించి , దాచినదంతా నాకిచ్చి వెళ్తుంటారు . మా పెళ్ళై 3 సంవత్సరాలలో , ఆయన నన్ను భార్యగా వాడుకున్నది మొత్తం మీద ఓ 4 సార్లు . వాళ్ళ నాన్న మాట ఆయనకు వేదమట . వయసులో వున్నప్పుడు బాగా సంపాదించి , వయసు అయిం తర్వాత  కాలు   మీద కాలు వేసుకొని సుఖపడాలట . సంపాదనే ముఖ్యమని , ఇంకా ఎవరైనా ఎక్కువ జీతనంటే , ఇంకా పైకి కూడా వెళ్ళాలనుకుంటున్నానని ఈ మధ్యనే తెలియచేశారు . అసలు వయసు అయింతర్వాత  కాలు  మీద కాలు వేసుకుని సుఖపడటానికి ఓపికా వుండదు , ఉత్సాహమూ వుండదు అని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కంటిన్యూ అవుతున్నారు . ఆ ఎడారులలోకి నే వెళ్ళలేను . నాకూ ప్రేమించబడాలని వుంటుంది . అందుకే ఈ కలం స్నేహాన్ని ఎన్నుకున్నా . పదిమందితో పరిచయం  ,పరవశానికి దోహదం . నౌ ఐ యాం వెరీ హ్యాపీ & వెరీ బిజీ . ఇదిగో బ్రీఫ్ కెస్ , వలసినంత పుచ్చుకో , అలసినంతవరకూ యిచ్చుకో "   అన్నది .

అంత తేలికగా వదిలే కేసు కాదని గ్రహించి , మరోమారు ఆనందపరచి "   వసతి కుదిరినప్పుడు లెటర్స్ వ్రాస్తుంటా , వచ్చి కలుసుకో , వుంటా "   అంటూ ఆ గండం నుంచి బయటపడ్డాడు .

                                                                                                 ******

ఈ మారు గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని , కలం స్నేహితురాలుగా కన్యను వధువుగా ఎంచుకుని కన్య రాక కొరకు హోటల్ అనుపమలో నిరీక్షిస్తున్నాడు మధు . కాలింగ్ బెల్ మోగగానే డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నున్న 
ఆమెని చూసి "   ఓ మీరా రండి . కన్య రాలేదేం , ఎపుడొస్తుంది ? "

ఆమె లోపలకి వస్తూ "  మధు గారు మీరేనా ? " అన్నది .

"    నేనే మధుని , ఆ కుర్చీలో కూర్చోండి , మిమ్మల్ని చూస్తుంటే అర్ధమైపోతున్నది . అచ్చం కన్య పోలికలే మీవి . సారీ కన్యకు అచ్చం మీ పోలికలే . ఇన్ని లెటర్లు వ్రాసింది . కాని తను మీ పోలికల్లో వుంటుందని ఏ నాడూ వ్రాయలేదు . రేపు కన్య కూడా పెద్దదైతే అచ్చం మీలాగే వుంటుందని  స్పష్టంగా తెలుస్తోంది . సరే అన్ని విషయాలు కన్య సమక్షంలోనే మాట్లాడాలనుకొన్నా . షార్ప్ 9 కి రమ్మన్నా కన్యను . కోంచెం సమయం యిరువురం జంటగా కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని . అన్నింటిలో ఒక్కటి కావాలని , మ్యారేజ్ విషయం మీతొ మాట్లాడాలని ఎంతగా చెప్పానో ఆంటీ , యింతవరకు రాలేదు , చూశారా ? "   అన్నాడు .

ఆమె అతనిని చూసి నవ్వుతుండటం గమనించాడు .

"    అంటే మీ కాలానిక్ మా కాలానికి ఎంతో మార్పు వచ్చిందాంటీ . ఇదే లేటెస్ట్ మోడల్ . 10 గంటలవుతున్నది . ఎపుడొస్తుందో ? ఏమో ? ఎక్కడికెళ్ళిందో ? ముందు మీరొచ్చేశారే . అవునులెండి మీకున్న ఇంట్రస్టు మీ అమ్మాయికెలా వుంటుంది ? అమ్మాయి భవిష్యత్తు మీకు చాలా ముఖ్యం . మీ అమ్మాయికాలోచన ఎక్కడుంటుంది ? అందినవాడెక్కడకీ పోలేడులే అన్న ధీమా తప్ప తొందర ఎందుకు వుంటుంది ? మాటలలో మరచే పోయాను , కాఫీ తెస్తాను "   లోపలకి వెళ్ళాడు .

ఇంత తొందరపాటు మనిషితో సంభాషణ ఎలా ప్రారంభించాలా ? అని ఆలోచిస్తున్నది ఆమె .

కాఫీ అందించి "   మీరు తీసుకోండి ,కన్య గురించి ఆలోచించకండి , మళ్ళీ ఆర్డరిస్తాగా "   అంటూ అటూ , యిటూ పచార్లు చేస్తున్నాడు .

"  మిస్టర్ మధూ "   ఆమె పిలుపు విని హడావుడిగా వచ్చిన మధు 

"    ఏమిటి ఆంటీ కన్యనెక్కడికైనా పంపించారా ? చూడండి టైం , రూం ఎలా వృధా అయిపొతున్నాయో , అనుకున్న ప్రకారం 9 గంటలకే వచ్చి వుంటే , ఈ సరికి చాలా పనులు పూర్తయ్యేవి . ఇంతకీ కన్య ఎపుడొస్తుందంటారు ? లేక అసలు రాదంటారా ? "   తన సందేహాన్ని వెలిబుచ్చాడు మధు .

ఆమె అతని అవస్థ చూసి కళ్ళు తుడుచుకుంటూ "   ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు . కంగారు పడకండి " ఓదార్పుగా మాట్లాడబోయింది .

అది విన్న మధులో అనేక అనుమానాలు చోటు చేసుకోగా "    కన్యకేమైంది ఆంటీ ? ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ? ఎన్ని కలలు కన్నానో ? నేను కోరుకున్న లక్షణాలన్ని మూర్తీభవించిన కన్నెపిల్ల నా కన్య . పెళ్ళి చేసుకోవాలనుకున్నాను . అయ్యో భగవంతుడా ! ఎంతపని జరిగింది ? "   అంటూ రోదిస్తున్నాడు .

"   నిజంగాపెళ్ళి  చేసుకుంటారా ? "   అనుమానంగా అడిగింది .

"   నన్ననుమానిస్తున్నారా ఆంటీ , అమ్మా , నాన్నలు చూసిన సంబంధాలు కాదని , కన్యనే సెలెక్ట్ చేసుకున్నవాణ్ణి , అనుమానించకండి . "

"   అన్నమాట మీద నిలబడగలరా ? "

"   ఇప్పుడు కాళ్ళ మీద నిలబడ్డాను , కన్యను కలుసుకొన్నాక మాట మీద నిలబడ్తాను . "

" సరే నిన్ను నమ్ముతున్నాను , నట్టేట ముంచకూడదు సుమా ! "

"   నట్టేట ముంచటం మా యింట్లో , ఒంట్లో లేదు . మునగటమే మా వంశాచారమట . మా ముత్తాత అమ్మాయి అందంగా వుందని కట్నం ఎదురిచ్చి మరీ చేసుకున్నాడట . తీరా కట్టుకున్నాక తెలిసింది గుణం మంచిది కాదని . మా తాత ఈ అనుభవంతో అందగత్తెలను కాదని అందవికారిని చేసుకొన్నాడుట . ఎంత పిలిచినా పలికేది కాదట . మూగదనుకున్నాడుట . ఆ తర్వాత తెలిసింది , మామూలు చెముడు కాదు బ్రహ్మచెముడని . ఇప్పటికైనా నమ్ముతారా ? మేము ముంచే వాళ్ళమా ? మునిగే వాళ్ళమా ? "

"   మీ గురించి , మీ వంశం గురించి బాగా అర్ధమైంది . మంచిఅదృష్టవంతురాలిని నేను . నేనే నీ కన్యని డియర్ " అనటంతో అంతవరకు నిలబడ్డ మధు కూలబడ్డాడు . జఘ్ లోని నీళ్ళు ముఖం మీద చిలకరించింది . తెప్పరిల్లుకొని కళ్ళూ తెరుస్తూ " హా ! నీవా నా కన్యవు ? నా బెటర్ హాఫ్వి నువ్వా ? "   అంటూ మరలా స్పృహ కోల్పోయాడు .

మెల్లగా భుజం పట్టుకుని బెడ్ మీదకి చేర్చింది . ఉపశమనంగా మరల నీళ్ళు చల్లింది . కొంత సమయానికి తేరుకుని చూస్తుంటే "   డియర్ మధూ , నేను మొదటే చెప్పాను . ఇంకా నీకు నమ్మకం కుదరకుంటే , యివిగో నీవు నాకు వ్రాసిన ప్రేమలేఖలు "   అంటూ బ్రీఫ్ కేస్ లోంచి నేలమీద కుమ్మరించింది .

బెడ్ మీద నుంచి మెల్లగా లెచి కూర్చొని "   ఇంకా నమ్మకం కుదరకపోవటమేమిటి ? నా రోగమే కుదిరింది . అవును మరి సంవత్సరం క్రితం వచ్చిన  మ్యాగజైన్స్ లో పెన్ ఫ్రెండ్ షిప్ కాలంలో ఆ ఫొటో ..... "   అనుమానంగా అడిగాడు .

"   అదా నాకు పది మందితో స్నేహం చేయాలని చిన్ననాటి నుంచి ఉబలాటంగా వుండేది . ఆర్ధిక పరిస్థితులు అనుమతించలేదు . ఇంత కాలానికి నా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించి ఆ వలయం నుంచి బయటపడ్డాను . ఇప్పటి ఫొటొ ప్రచురిస్తే నాతో ఎవరు స్నేహం చేస్తారు . అందుకే ఆ ఫొటొ ప్రచురించాను . "

"   మరి వయసు 20 సంవత్సరాలు అని వ్రాశావుగా . "

" అవును , ఆ ఫొటో టైముకి నాకు 20 సంవత్సరాలే . నేనూహించినట్లుగ నాతో స్నేహం చేయటానికెవరూ ముందుకు రాలేదు . అలా నిరుత్సాహపడ్తున్న తరుణంలో , మీ లెటర్ వచ్చి ఆనందాన్ని నింపింది . మీరూ చొరవ తీసుకుని నాలో అడుగంటిన ఆశల్ని వెలికి తీసుకొచ్చారు . ఇంత కాలానికి నా జీవితానికో తోడు దొరికినందుకు ఎంతగానో  మురిసిపోయా . పెళ్ళి చేసుకుందామని వ్రాస్తే , పెళ్ళి అయినంతగా ఆనందించా . రూం కి రమ్మంటే ఫస్ట్ నైట్ గా భావించా . ఇక ఏం చేసుకుంటావో చేసుకో డియర్ . ఈ కన్య మీ స్వంతం , నీట ముంచినా , పాల ముంచినా మీదే భారం . "

"   భారం కాదు ఆంటీ ఘోరం . నన్ను వదలి వేరెవరినైనా చూసుకో . "

"   ఇన్నాళ్ళూ మీ ప్రేమలో పాలు పంచుకొని , యిప్పుడు మరొకర్ని పంచుకోమంతే ఎలా డియర్ ? బాగా ఆలోచించంది . "

"   నా బొంద . నా మిఖానికి ఆలోచించటం కూడానా ? ఏది మంచో ? ఏది చెడో ? ఎవరు కన్నెపిల్లో ? ఎవరు ముసలివాళ్ళో తెలుసుకోలేని వాణ్ణి . ఇలాంటి నన్ను చేసుకొని నువ్వేం సుఖపడ్తావ్ ? పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకొని మనసును కష్టపెట్టుకోకు . నష్టాల పాల్జేయకు . వెంటనే వెళ్ళి హాయిగ నీ శేష జీవితాన్ని అనాధల సేవలో గడిపేటందుకు కృషి చేయి . పెళ్ళి గురించి లేనిపోని ఆశలు పెంచుకోకు . అది నీలాంటి , నాలాంటి వాళ్ళకి అచ్చి వచ్చేది కాదులే . "

"   మిమ్మల్ని చూడగానే నాకు పోర్టబుల్ మొగుడనిపించారు . సూటబుల్ కానంటె అంతా ట్రబులేగా . నేను మీకంటే పెద్ద అని సంకోచిస్తున్నట్లున్నారు . శ్రీరాముడికంటే సీత పెద్దది కాదా ? పెళ్ళి చేసుకోలేదా ? చేసుకొని జగద్విఖ్యాతి కాలేదా ? ఆలోచించండి . "

"   వాళ్ళకీ మనకు పోలికలేంటి ? వాళ్ళు కారణజన్ములు , మనం మానవజన్ములం . అనవసరంగా మనసు పాడు చేసుకోక వెళ్ళిపోండి ఆంటీ . "

"   సరే , చేసుకోకపోతే పోయారు , కనీసం ఉత్తరాలైనా వ్రాస్తుండండి . ఆ ఆనందంతోనైనా ఈ శేషజీవితాన్ని గడిపేస్తాను  "   అన్నది .

"   ఎందుకు వ్రాయను ? అలవాటు పడ్డ చేయి కదా ! అంత తేలికగా బుధ్ధి వస్తే ఎలా ? "

"   నన్ను మర్చిపోరు కదూ మధూ డియర్ . "

"   మర్చిపోవటమా ? అసంభవం , కన్నవారినైనా మర్చిపొవచ్చేమో గాని , ఈ కన్యనెలా మర్చిపోతాను , కలం స్నెహాన్నెలా మర్చిపోగలను ? "

అమిత ఆనందంతో , తన సరంజామాతో కన్య అనబడే ఆంటీ బయటకు నడిచింది .

' బ్రతుకు జీవుడా ' అనుకుంటూ  రూం వెకేట్ చేసి యింటికి తిరుగుముఖం పట్టాడు మధు . ' పెద్దలమాట చద్ది మూట ' అనుకొంటూ .

                                                                                ** స ** మా ** ప్తం **    

                                   ( ఈ "   పోర్టబుల్ మొగుడు "   కధ 12/12/1995  అన్వేషణలో ప్రచురించబడినది )

1 comment: