అంతరమా ? అంతర్యామా ?


                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్

దేవుడు ,
దేవుడు ,
ఇదే మాట ,
ఏ నోట విన్నా ,
భక్తో , భయమో , 
సరిగా తెలియకున్నా ,
దేవుడున్నాడంటుంటారు ,
సర్వాంతర్యామి అంటుంటారు ,
లేనిచోటు లేనే లేదంటారు ,

విగ్రహాలకు రక రకాల అభిషేకాలు ,
ఫొటోలకు  పూజలు చేస్తుంటారు ,
తీర్ధ ప్రసాదాలు పంచేస్తుంటారు ,
కాశీ ,  ప్రయాగ లంటుంటారు ,
పూరీ , శృంగేరీ లంటుంటారు  ,
కంచి , కాళహస్తి లంటుంటారు ,
బదరీనాథ్ , కేదారనాథులంటుంటారు ,
కన్యాకుమారి , రామేశ్వరాలు అంటుంటారు ,
శబరి మల అయ్యప్పంటుంటారు ,
తిరుత్తణి కుమారస్వామి అంటుంటారు ,
హిమాలయాలు ఈశ్వరుడంటుంటారు ,
సాగరాలు శ్రీ మహావిష్ణువంటుంటారు ,
తిరుమల తిరుపతి వెంకన్న అంటుంటారు ,
తీర్ధయాత్రలంటూ తిరుగుతూనే ఉంటారు
ఇంకా ఇంకా తిరగాలంటూనే ఉంటుంటారు ,

దేవుణ్ణి చూశారా అని అడిగితే ,

అంత తేలికగా కనపడ్తాడా అంటారు ,

మరి తీర్ధయాత్రలెందుకంటే ,

పుణ్యాన్ని సంపాదించుకోవటానికంటుంటారు ,

పుణ్యం దేనికంటే ,

మౌనాన్ని ప్రదర్శిస్తారు ,
అంతర్లీనంగా అంతవరకు చేసిన  ,
పాపాల ప్రక్షాళనకే  . 

ఆ దేవుడి కోసం ,
ఎక్కడెక్కడికో వెళ్తుంటారు ,
వెతకటం మాన (లే )రు ,
వెతుకుతూనే వుంటారు ,

నమ్మినట్లే వుంటారు , కాని నమ్మరు ,
ఆ వంచన పంచన 
తమ ఆత్మనే వంచించుకుంటుంటారు , 

ఉన్నాడో , లేడో మాట అటుంచండి ,
ఉన్నాడని నమ్ముతున్నట్లు కనపడుతూ ,
నమ్మకుండా జీవితమంతా జీవిస్తుంటారు ,
ఎవరికోసమో  ? ఎందుకోసమో  ?
ఈ ఆత్మవంచన ,

సర్వాంతర్యామే కదా ! 
మరి ,
ఇంటిలోని పూజా మందిరంలో లేడా ?
సందేహంతోనే కావచ్చు ఈ దేహాన్ని , 
ఎక్కడెక్కడికో అప్పులు చేసి  తిప్పేస్తుంటారు  

అందుకే ,
ఉన్నదానితో తృప్తి చెందాలంట ,

ఉంటున్నచోటనే చూసుకోవాలంటా .

 ******

2 comments:

  1. అంతస్థ మాత్మాన మజం‌ న దృష్ట్వా
    భ్రమంతి మూఢాః గిరిగహ్వరేషు.

    ReplyDelete
  2. అహం బ్రహ్మ తెలుసుంటే సమస్య లేదు. భగవాన్ రమణులు నాన్ యార్? చిన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోమన్నారు.

    ReplyDelete