వాళ్ళలా మనమిలా


                                                                                                                               కధా రచన : శర్మ జీ ఎస్

"   ఏమండీ పిల్లలు మాటకు మాట చెప్తున్నారండి . గట్టిగా చెప్పినా వినటం లేదు , ఓ దెబ్బ వేద్దామా అంటే , మీరే వద్దన్నారుగా "   అన్నది .

"   అవును వద్దన్నాను . నువ్వో దెబ్బ వేస్తే , వాడు 911 కి కాల్ చేసి వాణ్ణి తన్నామని చెప్పాడంటే  , వెంటనే కాప్స్ మన ఇంటిముందు ప్రత్యక్షమౌతారు . ఆ తర్వాత ఎవరైతే కొట్టారో వాళ్ళని జైల్లో పెట్టేస్తారు . అఱిచి గీ పెట్టుకున్నా , వదిలిపెట్టరు , మర్చిపోయావా , నార్వే యువ దంపతుల ఉదంతం .ఆల్ మోస్ట్ ఖూనీతో సమానమైన నేరం అది . "

" చెఱసాల పాలౌతామని పిల్లల్ని విచ్చలవిడిగా పెంచకూడదు కదా ! "

"  విచ్చలవిడిగా వదిలేయమనలేదు . నెమ్మదిగా చెప్పు ."

నెమ్మదిగా చెప్పినా ప్రయోజనం లేకపోతోంది . చెప్పినపుడు వింటూనే వున్నారు . ఆ తర్వాత వాళ్ళ పంధా వాళ్ళదే . మాటలతో యిక లాభం లేదు ,దెబ్బ వేయాల్సిందేనండి ."

లాభం లేకపోయినా ఫరవాలేదు , దెబ్బ మాత్రం వేయకు , వేశావంటే మన గూబ గుయ్ మంటుంది ."

"   ఇలా 4 ఏళ్ళ నుంచి ఇలానే చెప్తున్నారు , ఇక నా వల్ల కావటం లేదు ."

"   ఇంకా కొంచెం ఓపిక పట్టు , ఇండియాకి వెళ్తాంగా , ఈ వారా , ఆవారా అప్పుడు పట్దాం వాళ్ళ పని ."

"  వెళ్తాం , వెళ్తామ్ ఇండియా అంటూనే వున్నారు , ఈ లోగా మన పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతూనే వున్నారు , అయినా మనం మాత్రం ఇండియాకి వెళ్ళలేకపోతున్నాం . "

" ఏ సంవత్సరాని కా సంవత్సరం ఆఫీసు ప్రాజెక్టులతో వీలుకుదరటం లేదు . అలా వరుసగా వస్తున్నాయి ఆ ప్రాజెక్టులు . "

"  ప్రాజెక్టులు ఎపుడూ వస్తూనే వుంటాయండి ."

"   అలా అనకు , ఆ ప్రాజెక్టులు లేక చాలామంది ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోయారు . ఆ ప్రాజెక్టులు అలా వస్తున్నాయి కాబట్టే , మనం ఇండియాలో 4 యిళ్ళు కొనుక్కోగలిగాం , మరచిపోయావా ? "

"  మరచిపోలేదండి , మీరే మరచిపోయారు , అవి యిళ్ళు కాదు , అపార్ట్ మెంట్ల లోని ఫ్లాట్లు మాత్రమే . అందులో ఇండివిడ్యువల్ యిల్లు ఒకటైనా లేదు ,అది గమనించారా ? "

"   గమనించానే , అందుకే కదా ఈ సారి ఈ భారీ ప్రాజెక్ట్ ని తీసుకొన్నది ."

"   భారీ ప్రాజెక్ట్ గురించి కాదు , భార్య ప్రాజెక్ట్ గురించి ఆలోచించండి ముందు ."

"   ఏమిటో అది ? "

"  పిల్లలు మన చెప్పు చేతలలో పెరగాలండి , ఇమ్కా కొన్నాళ్ళిక్కడే , యిలాగే ఉంటుంటే , మనకు దక్కరండి అన్నది ."

"   ఒక్క 9 నెలలు ఓపిక పట్టు , డెలివరీ అయిపోతుంది ."

"    9 నెలలా ?ఇప్పటికి ఈ యిద్దర్ని పెంచేసరికి నా ఊపిరి పోతోంది , మీరు యిలా ప్రాజెక్ట్ ల మీద ప్రాజెక్ట్ లు తీసుకొని బాగా సంపాదిస్తాను , వాళ్ళ పోషణకే యిబ్బంది వుండదన్న భరోసా యిచ్చినా , కని పెంచే ఓపిక మాత్రం నాకు లేదండి . అదే ఇండియాలో  అంటారా , ఓ వేళ మీ కోరిక తీరుద్దామని ఒప్పుకున్నా పిల్లల్ని పెంచే విషయంలో , మాట వినకున్నా , నాలుగు దెబ్బలు వేసైనా పెంచగలను . ఇక్కడ అలా కాదని మీరే చెప్తూ మళ్ళీ 9 నెలలకి డెలివరీ అవుతుంది అంటే ఎలాగండి ? ఇంకా నా వల్ల కాదు ,ఆ అవసరం యిప్పుడు లేదు , మనమిద్దరంమనకిద్దరు చాలు " .

"   మళ్ళీ నేనేమీ పిల్లల్ని కనమనలేదే . నా భారీ ప్రాజెక్ట్ అప్పటికి పూర్తవుతుంది ."

"   మళ్ళీ వెంటనే మరొక ప్రాజెక్ట్ రెడీగా వుంచుతారుగా , మీ నిజాయితీకి మెచ్చి ."

"   రెడీగా వచ్చినాతీసుకోనులే , తిరస్కరిస్తాలే ."

"  తిరస్కరిస్తే పర్మనెంటుగా వెళ్ళిపొమ్మంటారేమో ? "

"  వెళ్ళిపొమ్మనాలనేగా  అలా అనేది " 

"  మళ్ళీ ఎపుడైనా రావాలనుకొంటే , వచ్చేటట్లుగా మనకు అవకాశం వుండాలంది . ఒకమారు ఇండియాకి వెళ్ళి 6 మాసాలు వుండి , పిల్లలను తిట్టో , కొట్టో , నయానో , భయానో దారికి తెచ్చుకొందాం . ఆతర్వాత మళ్ళీ వద్దాం .
ఇండియా తీసుకు వెళ్ళి ఏర్ పోర్ట్ బయట మొదలుపెట్టి మరల ఎదురుచెప్పకుండా ఉండేటంతవరకు బాదుదాం . వాళ్ళే దారికి వస్తారు ."

"    అలాగే చితకబాదుతాం , మళ్ళీ అమెరికాకొచ్చాక తోక ఝాడిస్తే ? "

"   అలా తోక ఝాడిస్తుంటే ఈ మారు పర్మనెంటుగా ఇండియాకి వెళ్ళిపోద్దాం . ఈ డాలర్లు వద్దు , ఆ బుధ్ధులు వద్దు . మన ఇండియా మనకెంతో ముద్దండి . "

"   అలా అనకే , ఎక్కడ వుండే వసతులు అక్కడ వున్నాయి . ఇక్కడ అంటే ఈ అమెరికాలో , దొంగ భయం లెడు , దోమల దెబ్బ లేదు , బంధువులతాకిడీ లేదు , రాబందుల్లా తిష్ట వేసేవాళ్ళు లేరు , అత్త మామల పోరు లేదు , ఆడబిడ్డల ఆరళ్ళు లేవు ,అయినవాళ్ళే లేరు , సూతకాలు పడ్తున్నారా అని పరిక్షించే వాళ్ళు లేరు , ఇలా పలు రకాలుగా సుఖపెట్టే అవకాశాలు ఎక్కువగా వున్నాయి . ఇల్లు చిమ్మే పని లేదు , ముగ్గులు వేసే పనిలేదు , ఏం కావాలంటే అది  తెచ్చుకొనే పని తప్ప , దానికి మరే ప్రిపరేషన్ చేయాల్సిన పని లేదు . వీటన్నింటిని వదులుకొని ఇండియాకి వెళ్దామంటావా ? "

"  వెళ్ళక ఏం చేస్తానండి , ఇవన్నీ నా పిల్లల పెంపకానికి అడ్డు అవుతున్నప్పుడు . తిట్టకూడదు , కొట్టకూడదు , కోప్పడకూడదా ? ఇదిటండీ పిల్లల్ని పెంచే విధానం ? "

"   ఇదేనే అమెరికా విధానం . అలా పెరిగిన వీళ్ళందరూ బాగా లేరా , ఈ అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూడా ఒకనాడు అలా పెరిగినవాడే . ప్రెసిడెంట్ కాలేదా ? "

"   అమెరికాలో పెరిగే అందరూ అలాగే పెరుగుతున్నారు , గొప్పగా ఉంటున్నారు . "

"  ఎన్నైనా చెప్పండి , మనం అమెరికా వాళ్ళం కాదండి , ఇండియా వాళ్ళమే . ఆప్యాయతలను , అనురాగాలను పంచుతూ , మంచి నడవడిని పెంపొందించుతూ , పెంచాల్సిందే . ఓ వేళ మాత వినకుంటే , తన్ని దారికి తెచ్చుకోవాలి గాని , యిలా అచ్చోసిన ఆబోతుల్లా పెరగనీయకూడదండి  ."

"   వాస్తవానికి వాళ్ళది ఆబోతుల సంస్కారం కాదు , అసలు సిసలు సంస్కారం వాళ్ళ సంస్కృతి ప్రకారం .కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ."

"  ఎవరితో వుండాలనుకుంటే వారితో వుండిపోవటమా ? ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు విడిపోవటం , ఎవరు కావాలనుకుంటే వాళ్ళతో వుండటమా ? ఇదేనా అసలు సిసలు సంస్కృతి ? దీన్నేమంటారో తెలుసా మన ఇండియాలో ? వ్యభిచారమంటారు ."

"  అది మన ఆచారం . ఇది వీళ్ళ ఆచారం . అలా వాళ్ళ జీవిత భాగశ్వాములు మారుతుండటం వలన ఆ వచ్చే వాళ్ళు అంతవరకు వున్న చిన్నపిల్లలని ఆప్యాయంగా చూస్తారో , లేదోనని , ఆ చిన్నపిల్లలు స్వేఛ్ఛావాయువులు పీల్చుకొని హాయిగా , ఆనందంగా , వాళ్ళకు కావలసినట్లు వాళ్ళు పెరగాలన్న సదుద్దేశంతో అలాంటి నియమాల శాసనం రూపుదిద్దుకొన్నది ."

"   ఓ అలాగా , అలా ఎలా పడితే అలా జీవితాన్ని సాగిమ్చటమే పొరపాటు , దానిని కప్పి పుచ్చుకోవటానికి ఇలాంటి సర్దుబాటా ? "

"  అలా దేనికనుకొంటున్నావ్ ? ఇక్కడ ఆద మగ తేడా సృష్టి కొరకు తప్ప మిగిలిన ఎచ్చోటా లేదు . ఇరువురూ సమానులే . అన్ని రంగాలలో సమ ఉజ్జీలుగా వున్నారు . బస్సులు నడుపుతారు , ట్రక్స్ నడుపుతారు . ఫ్లెయిట్స్ నడుపుతారు , ఇలా ప్రతి రంగంలో వాళ్ళున్నారు . ఒకరినొకరు గౌరవించుకొంటారు . ఒకరొకరు కలిసి జీవిస్తారు నచ్చినంతకాలం , నచ్చకుంటే పక్కకు తప్పుకొంటారు . ఎవరి స్వేఛ్ఛకు ఎవరూ అడ్డు రారు . భార్య కదా ! భర్త పిలవగానే అడుగులకు మడుగులొత్తాలి అనేమీ లేదు తనకిష్టమైతే తను అంగీకరించవచ్చు , లేకుంటే , తనకా మూడ్ యిప్పుడు లేదంటుంది . ఎవరూ , ఆఖరికి భర్త కూడా బలవంతం పెట్టటానికి లేదు . ఇవన్నీ వాళ్ళ సంస్క్రుతిలో భాగాలే ."

"  ఏమోనండి , ఎన్నైనా చెప్పండి , నాకు ఇండియానే బాగుంది . మీరు భర్తగా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే , నేను చక్కగా సంసారం చేసుకొంటూ , మన పిల్లలకి సరైన నడవడి నేర్పుతూ , అలా హ్యాపీగా గడపాలని ఉందండి నాకు ."

"   అలా ఇండియాలో నీకు కావాలంటె , ఈ సంపాదన అక్కడ రాదుకదా! "

" అందుకొరకే కదండి , అయినవాళ్ళను, మాత్Rభూమిని వదలి యింతదూరం వచ్చింది . కాకుంటే బాగా సంపాదించుకొని , మరల ఇండియాకి వెళ్ళిపోదాంన్డి , నాకిక్కడ వుండటం యిష్టం లేదండి ." 

"  నాకు మాత్రం యిష్టమనుకున్నావా ? అసలు అమెరికా రావటమే యిష్టం లేనివాణ్ణి , తప్పనిసరి వచ్చాను . వచ్చింతర్వాత , వీళ్ళ పధ్ధతులు చూసిన తర్వాత మాత్రం నాకిక్కడే వుండిపోవాలనిపిస్తోంది . ఆఫీసులో అవకాశాలు అలాగే వస్తున్నాయి . "

"  అవకాశాలు వచ్చాయని వుండిపోకండి . "

"   ఎంతసేపటికీ మన ఇండియా పోదాం అంటావే గాని , ఒక్కసారి ఆలోచించి చ్హూడు . మన ఇండియాలో 75 నుంచి 80 శాతమ్ దంపతులు ఆత్మవంచన చేసుకొంటూ , తప్పని సరి అయి కలసి వుంటున్నారట . ఈ మధ్య మన వార్తాపత్రికల విలేఖరులు సర్వే చేసి వెల్లడించారుట . "

"  దాన్ని ఆత్మవంచన అని దేనికనుకొంటున్నారు , ఒకరి నొకరు అర్ధం చేసుకొంటున్నారు అనుకోవచ్చుగదా ! జష్ట్ ఇదో రకం అడ్జష్ట్మెంట్ కదా ! "

"  అలా చెప్పుకొనటం క్లాసికల్ టచప్ తప్ప వేరే ఏమీ కాదు . ఎదుటివారి స్వేఛ్ఛకు ఎవరూ భంగం కలగనీయరు .
మిమ్మల్ని చూస్తుంటే , మీరు కూడా ఎవరినైనా చూసుకొని , నాకు విడాకులిచ్చేటట్లున్నారే . "

"  అపుడపుడు అనిపిస్తుంటుంది , కాని అది జరగని పనే . ఎందుకంటే నా జీన్స్ మూలాలు ఇండియాలో వున్నాయి . ఎన్ని ఎంతమంది చెప్తుణ్ణా , గొర్రెల్ల తలూపుతానే గాని , అటు వైపు మాత్రం మళ్ళను . అన్నీ వింటాం , అన్నింటినీ మెచ్చుకొంటాం . ఇది మన ఇండిఅన్ సంస్కృతి . నేను నేనుగానే వుంటా ."

"  మీరు నాకు మా బాగా నచ్చారు ."

"   ఇప్పుడు నచ్చటమేమిటి , అపుడే నచ్చావని చెప్పి పెళ్ళి చేసుకొన్నావుగా  ."

"  మళ్ళీ ఇప్పుడూ నచ్చారని . చూడండి , మనకెంతమంది ఎన్ని చెప్పినా , ఎన్ని నిదర్శనాలు చూపించినా , మన తత్వం మనం మార్చుకోకూడదు . ఇండియాకి ఎపుడెళ్దామంటారు ."

"   సంపాదించినది చాలు , ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటావ్ ."

"   మన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగి , వాళ్ళ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు .ఇక్కడి అమెరికన్స్ కి ఇది కరెక్ట్ . వాళ్ళు అలా , మనం ఇలా ( ఇండియానిటీ )."


                                                                               ** స ** మా ** ప్తం **

No comments:

Post a Comment