జీవుడు దేవుడా ?

                                                                                                                      కవితా రచన : శర్మ జీ ఎస్

పసి వయసున మిసిమి కాంతులు ,
పడుచుదనంతో వయసు సొగసులు ,
నట్ట నడుమన బంధాల అనుబంధాలు ,
దాగుడుమూతల దోబూచులాటలు  ,
ముదిమిన చిదిమిపోవు ప్రాణాలు ,
ఈ క్షణాన్ని ఎదురుచూడని మానవులు ,
జీవుడు దేవుడంటారు ,

జీవుడు దేవుడా ? అయ్యేదెప్పుడు ?
నిజానికి జీవుడు ఎన్నటికీ దేవుడు కాలేడు ?

ఆ దేవుడినే ,
ఈ జీవుడు తన (అతి ) తెలివితో
కొత్త కొత్తగ పుట్టిస్తుంటాడు ,
పెంచుకుంటుంటాడు ,
అనుగుణంగా మలుచుకొంటాడు .

ఏ ఎదుగూ బొదుగూ లేనిదే ,
ఆ దేవుని గమనం , 
అడుగడుగున ఎదుగుతూ ,
అనుక్షణం ఒదుగుతూ ,


సాగేదే ఈ జీవుని పయన వైనం ,

ఎవరెన్ని అన్నా , 
ఎవరెలా ప్రవర్తించినా ,
ఆ దేవుడు మాత్రం ,
తన పని తాను , 
చేసుకుపోతుంటాడు ,
వన్ వే ట్రాఫిక్ లా ,

ఏ నాటికైనా ,
వెళ్ళిపోయే వాళ్ళమే కదా !
మరి
ఎవరి కొరకీ  వంచన ?
ఎందులకీ  తర్జన భర్జన .

    ******      

4 comments:

 1. చాలా బాగా రాశారు సార్.

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగుకి స్వాగతం . కృతజ్నతలు .

   Delete
 2. అహం బ్రహ్మస్మి! తెలుసుకోలేకే విచారం!!

  ReplyDelete