పగలే వెన్నెల

                                                                                                                              కధా రచన : శర్మ జీ ఎస్ఈ పెళ్ళైన రెండేళ్ళనుంచి పిల్లలు పుట్టకుండా జాగ్రత్తపడ్తున్నాం కాబట్టి , చాలీ చాలని జీతమైనా ఏవో  కొన్ని సంతోషాలనైనా  అనుభవించగలిగాం . ఇక పిల్లలు పుట్టటం మొదలైందంటే , యీయనకొచ్చే  చాలీ చాలని జీతం ఏ మూలకి వస్తుంది . ఈయన గారు పనిచేసే ఓనరుగారు కోట్లకు పడగెత్తున్నారు  . ఆ దంపతులు వయసులో చిన్న వాళ్ళే . ఆయన ఈ మధ్యనే వ్యాపార విషయాల సంబంధంగా , విదేశాలకెళ్ళారనే ఆయన మొన్న చెప్పారుగా. ఈయన గారి  తో అడుగడుగుకీ మొబైల్లో వదిలిపెట్టకుండా మాట్లాడటం , అర్ధరాత్రనక , అపరాత్రనక , బంగళాకి రమ్మనటం ఆమె నిత్యకృత్యం  అయిపోయింది .  ఇంత యిదిగా కష్టపడ్తున్న ఆయనకి జీతం కూడా పెంచితే బాగుంటుంది కదా ! ఇదే విషయం ఆయనతో అంటే , మా బాస్ నడగాలంటారు . వర్క్ ఈమె గారు చేయించు కుంటున్నారు , జీతం ఆయనగారు చూస్తారుట . నమ్మేస్తారు యీ మగవాళ్ళు . 
ఏ మగాడైనా ఆడదాని మాట విని తీరాల్సిందే . ఈమె గారు చెప్తే ఆయన ఏమన్నా కాదంటాడా ? ఆ విషయం మా ఆడాళ్ళకే తెలుస్తుంది . ఈయన్ని ఆమెకి తగిలిస్తే , ఆ పరిచయం మీద ఆమే ఈయన డే అండ్ నైట్స్ కష్టపడ్తారని వాళ్ళాయనతో చెప్తుంది .ఈయనతో ఈ రోజు మాట్లాడి నయానో , భయానో ఒప్పిద్దాము . ఆ పై జీవితమంతా హాయిగా ఎంచక్కా ఎంజాయ్ చేసేయచ్చు అనుకొంటూ ,  టీ వీ చూస్తున్న తను అలాగే ఆ పడక మిదనే  నిద్రాదేవి ఒడికి చేరింది సారిక . 
తన  కొచ్చిన ఈ ఆలోచనని  సారధితొ  పంచుకొని భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవాలనుకున్నది  పడక చేరిన సారిక "  ఏమండీ , మిమ్మల్నేనండి , కొంచెం ఆలోచించండి "   అన్నది . 

"  ఏమాలోచించమంటావే ? "   ఆర్ధం కాక అడిగాడు సారధి .

"  నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం నింగి వైపు పయనిస్తుంటే ,  మీకొచ్చే ఆ  జీతం  మనకేమీ సరిపోదండి . "

"  సరిపోకేం , బాగానే సరిపోతున్నాయిగా ?

"  ఏమి సరిపోవటమండి , ఎక్కడికక్కడ మనసు చంపుకొని జీవితం వెళ్ళబుచ్చుతున్నాను ? జీవితమంటే , నోటికీ , చేతికీ అడ్డం లేకుండటమే కాదు "  భాధను వ్యక్తం చేస్తున్నది  సారిక  .

"మరింకేమిటి ? "  ఆమాయకంగా తనకు తెలియనిది తెలుసుకుందామనుకున్నట్లుగా  .

"  ఓ ఏ సి , ఓ ఎల్ ఈ డి టీ వి , ఓ కారు నిత్యావసర వస్తువులయిన ఈ రోజుల్లో, మనదీ ఓ జీవితమేనా అండి ? "   నిరుత్సాహ , నిస్పృహలను నిట్టూరుస్తూ సారిక  .

"  ఆవి లేకపోతే జీవితం కాదటే ! అందరూ వాటితోనే జీవిస్తున్నారా ? కొంచెం ఆలొచించవే నా ముద్దుగుమ్మా " సారధి .

"  అందరి సంగతి నాకనవసరం ఒకరితో పోలికలొద్దు నా దృష్తిలో అదే ఆనందమయ జీవితం  ."   

"  ఒప్పుకున్నానే  ? వాటికి  తొందరేమున్నదే ? నిదానంగా  ఒకటొకటి కొనుక్కుందాము లేవే ? "   సర్ది చెప్పజూశాడు  .

"  ఒకటొకటి కొనే లోపు ,  ఒకళ్ళనొకళ్ళని కంటుంటాం . అక్కడేమి కంట్రోల్ ఉండదుగా . సంసారంలో ఏదైనా కొనగలిగినా, దాచగలిగినా సంతానాన్ని కనక ముందే .  ఆసంతానాన్ని కన్న తర్వాత , మెలమెల్లగా, ఆ చిరంజీవుల ఖర్చులు అత్యవసరమై కూర్చుంటై . అపుడు ఈ జీతాలు సరిపోవండి . "   

"  దానిగురించి దిగులుపడకే , జీతాలెపుడూ  ఇలాగే ఉండవు , పెరుగుతాయి "  తనకు తెలిసినది చెప్పాడు సారధి .


"  పెరగవని నేననను , పెరుగుతాయి , నేనంగీకరిస్తాను మహా పెరిగితే  500 / 1000 . మార్కెట్లో కూడా అన్ని వస్తువుల ధరలు అంతకంటె ఎక్కువగానే  పెరుగుగుతుంటాయి . ఏ మూలకొస్తాయి ఈ పెరిగిన జీతాలు చెప్పండి ."

"  అయితే ఓ పని చేద్దాం. ఈ క్షణం నుంచే  కొన్ని ఖర్చులు తగ్గించుకొందాం " తన స్వానుభవం చెప్పాడు .

"  మీకు చేతనయింది అదొక్కటేగా , అంతకంటే ఆదాయం పెంచుకొందాం అనలేరా . "

"   అనలేకేం మాటేగా అనగలను, కాని అదెలా సాధ్యం ? "

"  ఏదైనా చేయగలిగితే , వయసులోనే . ఆనక ఏమీ చేయలేం , ఒక్క ఆలోచన తప్పితే. ఆచరణ లేని ఆలోచనల వల్ల సాధించేదేమీ లేదు . " 

"  అందుకని ఏం చేద్దామంటావ్ ? "

"   ఏమండీ , ఏమండీ , మఱే , మఱే , మీ ఓనర్ గారి అమ్మాయి ఎపుడూ మీతో ఫొన్లో మాట్లాడుతుంటూనే ఉంటుందిగా . ఏం మాట్లాడుతుంటుంది ? "

"   ఏముంటుందే ? ఏవో ఆఫీసు విషయాలు ."

"   అంతంత సేపు ఉంటాయా ? " 


"   ఉంటుంటాయే. అసలు ఎపుడూ ఆయనే మాట్లాడుతుండేవాడు . ఇపుడు ఆయన విదేశాలకు వెళ్ళటం వలన, ఈ ఆఫీసు విషయాలన్నీ ఆమెకే అప్పగించారు . అందువలనఆమెతో తరచు మాట్లాడవలసి వస్తోంది . నేనే కాదు మా ఆఫీసులో స్టాఫ్ అంతా మాట్లాడుతూనే వుంటారు . "

"  మాట్లాడవచ్చండి . అర్ధరాత్రనక , అపరాత్రనక మీలాగే అందరూ వెళ్తుంటారా ? "

"  వాళ్ళ వాళ్ళ బాధ్యతలను బట్టి వెళ్ళవల్సి వస్తుంటుంది . " 

"  మొన్న మీ ఓనర్ గారి భార్యని ఆమె పుట్టిన రోజు విందులో చూశాను . చిన్నదే , చాలా అందంగా ఉన్నది కదండి . అడుగడుగునా మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నది . మీతో బాగా క్లోజుగా  ఉంటుంది గదండి . "

"  చిన్నదే , అందంగానే వుంటుంది . "

"   ఏమండీ , మిమ్మల్నేనండి " అంటూ చేతి వేలు కొనగోటితో అతన్ని గోముగా గీటుతున్నది. 

"   ఏమిటే ? ఏం కావాలి ? "

బదులు చెప్పక అలా మృదువుగా  గీటుతూనే ఉన్నది.

"   ఏమిటే మళ్ళీనా ? " 

"  మళ్ళీ ఏమిటండి , మళ్ళీ మళ్ళీ కావాలన్నా మీరేమి కాదనరు .  అదెపుడూ నాకందుబాటులోనే వుంటుంది  .దానికి నేను మిమ్మల్నడగాల్సిన పనే లేదు. తాళి  కట్టిననాడే ఆ సర్వహక్కులు నాకొచ్చేశాయ్. నాకు అది కాదండి కావాల్సింది . " 

"  మరేమిటి ? "

"  బాగా మనీ సంపాదించాలండి . "

"  బాగా డబ్బులు సంపాదించటానికి మనము వ్యాపారస్తులం కాదు . ఉద్యోగస్థులమే . 

"  ఎంత సర్వీస్ పుట్ అప్ చేసినా ' గొఱ్రెకి ( ఎంత ఎదిగినా ) బెత్తెడే తోక ' అన్న మాదిరి యీ ఉద్యోగాలు . అందుకే మనమే ఆలోచించుకోవాలండి . "

"  ఇంకేమిటో చెప్పవే ? "

"   హమ్మయ్య  , నేనో సలహా చెబుతాను కోపం తెచ్చుకోకుండా  వినండి .  ఓ క్షణం కళ్ళు మూసుకొంటే చాలు . "

"   అంటే నీ ఉద్దేశం ? "

"    సదుద్దేశమేనండి . "

"    నీవేం చేసినా , కోపం తెచ్చుకోకుండా ఆ క్షణంలో , ఓ క్షణం కళ్ళు మూసుకోవాలా ? పైగా నీది సదుద్దేశమా ? "

"    నిజంగా సదుద్దేశమే . ఆ క్షణంలో నేను మీ భార్యను కాదనుకోండి . నేనూ , మీరు నా వారు కాదనుకొంటా .సింపుల్ మానం పెట్టుబడి , ధనం రాబడి . ఆనక లైఫ్ ఎగబడి ఉమ్మడిగా ఎంచక్కా ఎంజాయ్ చేసేయచ్చు . "


"    ఛీ ఛీ ఛీ ధనం కొరకు మానాన్ని పణంగా పెట్టటమా ?  నేనంగీకరించను  . "

"    నేనందుకు యిష్టపడుతున్నానండి " విప్పారిన ముఖంతో సారిక .

"   గడవకుంటే పస్తులు పడుకొంటా గాని , అస్తుల్ని ఇంకొకరికి అప్పచెప్పటమా ?  పెళ్ళానికి పరాయి పంచలో పడక వేయటమా ? "   


"    అయ్యయ్యో అపార్ధం చేసుకున్నట్లున్నారు . నాక్కాదండి, ఆ పడక మీకేనండి . "      
    
"    అంటే ? "   అర్ధం కానట్లుగా అడిగాడు .

"    మీ ఓనరుగారి భార్య మీకు బాగా క్లోజ్ గదా ? "

"     అయితే  ? "  అన్నాడు అసహనంగా.

"      మీరంటే ఇష్టపడ్తుందని మీరర్ధం చేసుకోవాలి . "

"      ఆమె మా ఫాక్టరీకి ఓనర్ . నేను ఆమె దయాధర్మాల మీద పనిచేసి బ్రతికే ఓ సామాన్య అకౌంటెంట్ ని .నాకు  తెలిసిన ఓపెన్ సీక్రెట్సే .ఇపుడామెకు మీ  అవసరం ఉంది ."   

"     నీతో చెప్పిందా ? "

"    నోటితో చెప్తేనే అర్ధం చేసుకుండేది మీ మగవాళ్ళు . మా ఆడవాళ్ళు చర్యలతో చెప్పేస్తారు . అది మగవాడు తెలుసుకొని మసులుకోవాలి . మిమ్మల్ని పదే పదే అర్ధరాత్రి , అపరాత్రి ఆ సమయంలో పిలుస్తుందంటే , మీరే గ్రహించుకోవాలి . "   

"     అలాంటి తప్పుడు అలోచనలు నీ మనసులోనికి రానీయకు . " 

 " తప్పుడు ఆలోచనలు కావండి. ఆడదాన్ని కాబట్టి ,ఆమె పరిస్థితిని మనకనుగుణంగా మలుచుకుందామంటున్నా . "

 "   అంటే ? "

"     కనుక మీరు కొంచెం చొరవ చూపించారంటే , మన భవిష్యత్తుకే కొరవా వుండదు . "

"     అంటే నీ ఉద్దేశం ? " ఆర్ధం కానట్టు సారధి .

"     ఏముందండి .  ఆ క్షణంలో నేను మీ భార్యను కాదనుకోండి , నేనూ మీరు నా వారు  కాదనుకుంటా . శ్రద్ధగా ఆలకించండి . సంసారంలోని మీ సత్తా నాకు బాగా తెలుసు . ఆ పరాయి పంచలో మీ పంచను సడలించమంటున్నా .  ఓ క్షణం కళ్ళు మూసుకొంటె చాలు సారిక . "

"     ఛీ ఛీ ఛీ నన్నేమనుకొంటున్నావ్ ? నేనలాంటివాణ్ణీ కాదు . లైఫ్ పార్ట్నరువి కదా అని "  సదా నీ సేవలో "  కట్టుబడి ఉంటాను అన్నందుకు ఇంతటి శిక్షా ? పతియే ప్రత్యక్షదైవమని భావించే భారతదేశంలోని భారతనారివైన నువ్వే యిలా ఆలోచిస్తున్నావా ? "

"     పతి ధర్మాలేమిటో మీకు తెలుసా ? పత్నిని సంతోషపెట్టటం , అంటే , ఆ సంతోషమొక్కటే కాదు   .తక్కిన సంతోషాలను కూడా అందించినపుడు , నిజ్జంగా ఆ పతి ప్రత్యక్షదైవమే . అందుకు భిన్నంగా నడుచుకొంటే ఆ పతే పరోక్ష దెయ్యమని గ్రహించండి . "

"   ఇదేమి  బాగా లేదే . నా మాట శ్రద్ధగా వినవే , ఆ కలయికకు ఓ ప్రత్యేకత  ఉన్నదే ? అర్ధం చేసుకోవే . "

"   ఆ కలయికకు ఓ ప్రత్యేకత ఉన్నదని అర్ధం చేసుకోబట్టే యిలా డిసైడయ్యా . "

"   ఆ కలయికను  యిలా వ్యాపారం చేయకే . "

"    వ్యాపారం నేను చేసేదేమిటి ? ' భార్యాభర్తలు ' అంటేనే జీవిత భాగస్వాములు  , ' లైఫ్ పార్ట్నర్స్ ' అని మీరు వినలేదా ! సంసారం అంటేనే సరదాల వ్యాపారం  ఇందులో మనం  యిరువురూ భాగస్థులే. ఒకరికొకరు పెట్టుబడి . అర్ధం చేసుకోండి  . "

"    నా మనసు అంగీకరించటం లేదు . " 

"    మీ మనసు అంగీకరించితే మాత్రం , నేనొప్పుకుంటానా ఏమిటి ? "

"    మరి అంత మంచి ఆడబుధ్ధి గలదానివి అలాగే వుండిపో .  నాకీ శ్రమా తగ్గుతుంది , నీకా రోజూ అందుతుంటుంది . "


"    నాకెపుడూ అందుబాటులోనే ఉంటుంది గనుక , ప్రతి నెలా ఆ మూడు , నాలుగు రోజులు మీరీ పనిలో ఉండండి . అపుడు నాకందించలేదనే బాధ మీకు ఉండదు . అలా మన మనసులకి సర్దిచెప్పుకొన్నామంటే , ఆ తర్వాత రాత్రింబవళ్ళు మనం ఎంజాయ్ చెయ్యచ్చు . అది కూడా మనకు పుట్టబోయే పిల్లల భవితని గురించి మనీ కావాలి  కాబట్టి మిమ్మల్ని షేర్ చెయ్యమంటున్నా ."    

"   నువ్వెన్నైనా చెప్పు . నా వల్ల కాదు . "

"   అలా కాదంటే ఎలా ? చెప్పినట్లు చెయ్యాల్సిందే . అవకాశం లేక చాలామంది  మగవాళ్ళు మంచి భర్తలనిపించుకుంటారు . చాటుమాటున వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే  ఉంటారు .  మీరేం మొగాళ్ళండి బాబూ .  అగ్నిసాక్షిగా కట్టుకున్న నేనే మిమ్మల్ని పురమాయిస్తుంటే , నన్ను గదమాయిస్తారేమిటి ? తప్పదు ఈ రోజునుంచి ఆ దిశగా అడుగులు వేయండి . ఆ అడుగులు పడకగది వైపు . అర్ధమైందాండి ? ఆమె నా దృష్టితోనే చూడండి . ఆమెని మృదువుగా హాండిల్ చేయండి . ఏ మాత్రం తేడా వచ్చినా అసలు ( ఉద్యోగాని ) కే ఎసరు వస్తుంది . జాగ్రత్త సుమా ! "

"   నీకేమైనా మతి చలించిందా ? డబ్బు వ్యామోహం వదులుకోవే . హాయిగా నిశ్చింతగా జీవిద్దాం . "  ఇంక మాటతో ప్రయోజనం లేదని చేయి పైకెత్తాడు సారధి .

"   ముందా చేయి దించండి. మీవాళ్ళు డిమాండ్ చేసినంత కట్నం ఇచ్చి కొనుక్కున్నా మిమ్మల్ని. అమ్ముడుపోయిన వస్తువుకి యజమానిని ఎదిరించే హక్కు ఉండదు , తలవంచుకునే లుక్కు తప్ప , తెలుసుకొని మసలండి సారిక ."   

"    నన్ను కొనుక్కున్నావా ? నువ్వు నా యజమానివా ? నేను నీ భర్తను కానా ? "  ఆశ్ఛర్యంగా, అమాయకంగా . 

"    మీరు నిజ్జంగా ముమ్మాటికీ నేను అగ్నిసాక్షిగా కట్టుకున్న భర్తే . అందులో అణుమాత్రం సందేహం లేదు . భర్త అంటే భరించేవాడని , భర్తీ చేసేవాడని . ఏదైనా వస్తువు దాని వాడకం చూసుకొంటాం కదా.ఇదీ అంతే .  పుష్కలంగా డబ్బు సంపాదించ ( లే ) నపుడు, మీ చేత ఎలా సంపాదించుకోవాలో  ఆలోచించటం తప్పేమి కాదండి భర్త గారు . 
ఆమెని మృదువుగా హాండిల్ చేయండి . ఏ మాత్రం తేడా వచ్చినా అసలు ( ఉద్యోగాని ) కే ఎసరు వస్తుంది . జాగ్రత్త సుమా ! ఓ వేళ మీరనుకోవచ్చు . రఫ్ గా హాండిల్ చేసి ఉద్యోగానికే ఎసరు తెస్తే , దీని పని అయిపోతుందని . అలా ఏమీ అనుకోకండి . నాకొచ్చిన యిబ్బందేమీ లేదు . అపుడు మిమ్మల్ని నేనొదిలేస్తాను . మిమ్మల్నెవ్వరూ చేసుకోరు , వుంచుకోనుగూడా వుంచుకోరు . నేను మగాణ్ణి అని మీకు మాత్రమే తెలుసు. మార్కెట్లో మాత్రం  మీరు భార్య వదిలేసిన భర్తగా లెక్క కట్టబడినవాళ్ళు . పెళ్ళై రెండేళ్ళైనా ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు , అంటే వాళ్ళ పిల్లనివ్వటానికి ( ఆ మగలక్షణాలు లేవేమో అని సంశయించి ) ఏ ఒక్కరూ ముందుకు రారు . కనుక మా ఆడాల్ల పవరేంటో తెలుసుకుని మసలండి .మీరు మాకంటే పేద్ద చదువులు చదవకపోయినా ,  మాకంటే పేద్ద ఉద్యోగాల్లో లేకపోయినా, మేం మీరు అడిగినంత కట్నం యిచ్చి,మిమ్మల్ని పెళ్ళి చేసుకొనుక్కుంటున్నామంటే ఎందుకనుకుంటున్నారు ? ఈ పాశుపతాస్త్రంతోనే మఱచిపోకండి . 
మా ఆడవాళ్ళు నోరు తెఱచి చెప్తే చాలు మీ మగవాళ్ళంతా , కోర్టు లోని జడ్జ్ తో సహా అందరూ నమ్మేస్తారు . మీ మగవాళ్ళు ఎంత అఱిచి , గీ పెట్టుకున్నా , ఏ ఒక్కరూ  నమ్మరు . అంతెందుకు సాటి మీ మగజాతే మిమ్మల్ని నమ్మదు . మోసగాడిగా , దోషిగా , నయవంచకుడిగా చూస్తారు . కనుక నా మాట వినండి . అలా నడచుకోండి . మనం బాగుపడ్తామండి . "

"    ఇన్ని పాశుపతాస్త్రాలు నీ చేతిలో వుండగా , ఇంక సరే అనక , కాదని ఎలా అంటాను . "

"   హమ్మయ్య ఆమెను ఎలా హాండిల్ చేయాలో  నే చెప్తాను . అలా మీరు బుధ్ధిగా నడచుకోండి . ఇంక మన జీవితానికే ఢోకా లేదు.  "   

సెల్ రింగ్ మోగగానే , టైం చూసింది సారిక  11 గంటలు కావస్తోంది . ఈ టైంలో ఆమే అని సెల్లో చూసి కన్ ఫర్మ్ చేసుకొని . ఏమండీ మీ మేడం ,  మిమ్మల్ని అర్జంటుగా రమ్మంటుందేమో , వెళ్ళి ఆ ప్రయత్నాల దిశగా పావులు కదపండి  సెల్ సారధికిచ్చింది . "

సెల్ అందుకుని "  నమస్తే మేడం , ఏమిటి అర్జంటుగా డిస్కస్ చేయాలా ? అలాగే మేడం . వెంటనే బయలుదేరి వస్తున్నా. నన్నిక్కడే వుండమంటారా ! "

"     కార్ పంపిస్తున్నారా ! రెడీగా ఉంటాను మేడం . "

ఈ మాటలు వినగానే , సారిక ముఖం విప్పారింది . " ఏమండీ వెదకబోయిన తీగ కాలికే తగిలినట్లు , ఆమే మన ఇంటికే మీకొరకు కారు పంపుతున్నదంటే , ఆలోచించకండి . సమయం చూసుకుని దూసుకుపోండి . సందర్భాను సారంగా నడుచుకోండి . మన లక్ష్యం మరిచిపోకండి . దానితో పాటు  ఆ పాశుపతాస్త్రాలని మరువకండి . "

"    ఎపుడూ అమె కాల్ చేసినా నిర్భయంగా వెళ్ళేవాడిని . కాని ఈ రోజు కారు పంపిస్తున్నా , ఏదో జంకు నాలో తిష్ట వేసుకు కూర్చున్నదే . "

"   ఇప్పటిదాకా మీరు ఆమెను యజమానిగా భావించటం వలన నిర్భయంగా వెళ్ళేవాళ్ళు . ఇపుడు మీ సరసన ఊహించుకోమన్నా కదా, అందుకే అయ్యుంటుంది . ఏం భయపడకండి . చాటుమాటున , కట్టుకున్న భార్యకు  తెలియకుండా చేసే రంకుకి జంకాలి గాని , కట్టుకున్న శ్రీమతి అనుమతితో , ఆమెను అలా సంతోషపెడ్తూ , నన్ను ఆనందపరచమంటున్నా . "

ఇంతలో కారు డ్రివర్ లోపలకు వచ్చి "  సార్ , మేడం ఆప్కో జల్దీ లేకే ఆనేకేలియె బోలా " . 

ఆ మాటలు వింటున్న సారిక చాలా హాపీగా ఫీలవుతోంది .

సారధి మాత్రం మేడం యికనుంచి ఇలా రాత్రుళ్ళు నన్ను పిలవకండి అని చెప్పాలనుకుని మనసులోనే డిసైడయ్యాడు . కారెక్కి వెళ్ళిపోయాడు .

సారిక సంతోషంగా "  బై "  చెప్తూ ఫ్లైయింగ్ కిస్ లిచ్చింది .

2 గంటలకు వచ్చిన సారధిని చూసి , సాదరంగా ఆహ్వానించింది పడక మీదకు . సారధి సారిక ప్రక్కనే పడుకుని తన మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంటుంటే , "  బాగా అలసిపోయినట్లున్నారు , కాసేపాగండి నేను మీ పక్కనుండేదాన్నేగా ? "

"    ఏమి అలసి పోలేదులేవే .ఇంతదాకా ఆఫీసు పనులతో నిద్రాభంగమైంది .మళ్ళీ లేపకే "  అంటూ నిద్రలోకి జారిపోయాడు .

రోజూ కారు వస్తూనే ఉన్నది . తను వివరంగా చెప్పి పంపిస్తూనే ఉన్నది . అతను ప్రయత్నం చేస్తానే అంటూ చెప్పి వెళ్తున్నాడు . తిరిగి వచ్చింతర్వాత యిదే వరస . 

ఇదివరకు అడపా , తడపా వచ్చే కారు ఇపుడు క్రమం తప్పకుండా వస్తున్నది . ఆయన వెళ్ళొస్తూనే ఉన్నారు. ఎపుడడిగినా , ఇంకా అంతదాకా రాలేదే అంటున్నారు .

గతంలో తను కాసేపాగండి అంటే , అపుడు మళ్ళీ ఊగుదాంలే  , ఇపుడు  ఊగాల్సిందే ఉయ్యాలంటూ వెంటబడేవాడు . ఇపుడు  ఆ ఉయ్యాల ఊగుదాం అనే పదమే సారధి నోటినుంచి విని ఎన్నాళ్ళైందో ?

దైలీ కారు రావటం , అతను తప్పనిసరిగా వెళ్తున్నట్లు ముఖంలో భావాన్ని ప్రదర్శించటం , తిరిగి వచ్చేటప్పుడు నీరసంగా రావటం చూస్తుంటే , మేడంతో ఆ సుఖాలకు అలవాటుపడి తనను మెల మెల్లగా దూరం చేస్తున్నాడా అన్నట్లు కనపడ్తోంది .
                                                                              
                                                                                               *****    
   
అనతి కాలంలోనే భర్తలోని మార్పుని గమనించిన సారికలో అలజడి ఆరంభమైంది . తన భర్తను మరెవ్వరూ పంచుకోరాదు , తప్పంతా తనదే . అతను వద్దంటున్నా వినకుండా తనే బలవంతం చేసింది . అందరిలాంటి మగవాడు తన భర్త కాదనుకున్నది . తన భర్తే కాదు , ఏ భర్తైనా , ఈ 21 వ శతాబ్దం లోనే కాదు , ఏ శతాబ్దంలో నైనా మగవాడు మగువ పొందుకే తెగువ చూపించి మనసు మార్చుకొంటాడు . శిలాక్షరాలలో శాశ్వతంగా చరిత్ర కెక్కించవలసిన , చెరపలేని నగ్న సత్యం . నర మాంసం  రుచి ఎరిగిన పులిలా , పరాయి పడతిని మరిగిన మగవాడు అగ్నిసాక్షిగా కట్టుకున్న పెళ్ళాన్నైనా సులభంగా వదిలేస్తాడు .

అలవిమాలిన సుఖాలను ఆశించినందుకు " తనకు తగిన శాస్తే జరిగింది, తనకు తగిన శాస్తే జరిగింది " బిగ్గరగా అరుస్తున్న సారికను  తట్టి , "   ఏయ్ సారికా , మేడం కారు పంపించిందే , అర్జంటుగా రమ్మన్నదే ,  అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది , త్వరగా తలుపులేసుకో , నే వెళ్ళొస్తా "  అంటూ లేపాడు .

"    వెళ్తే నేను ఫీలవుతా  "  సారిక .

"    వెళ్ళకపోతే మేడం ఫీలవుతుందేమో , కొంచెం ఆలోచించు "  సారధి .

"    కొంచెం కాదు , చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నా . అయినా మీకెందుకంత స్పెషల్ ఇంటరెస్ట్ ? "

"    ఇంటరెస్ట్ కాదే , ఇంతటి మంచి అవకాశం యింకెప్పుడూ మళ్ళీ రాదేమోనే . "

"    నాకా ? మీకా ? "

"    అపార్ధం చేసుకోకే , ఓ వేళ మా బాస్ సడెన్ గా వచ్చాడనుకో . అపుడు ఈ అవకాశం రాదు కదా ! నీకా అవకాశం పోయినట్లే కదా ? మనం నువ్వనుకున్నట్లు ఆ సుఖాలు పొందేదెలా ? "

"    పొందకపోయినా ఫరవాలేదు . నేనేమీ బాధపడటం లేదు సుమా . అటువంటి తెలివి మాలిన పనులు ఎవ్వరూ చేయకూడదండి . ఆ ఒక్కక్షణం వదులుకున్నామంటే , జీవించినంతతకాలం  ఎంత నష్టపోతామో  జష్టు  రియలైజ్   అయ్యాను . "

"    మరి ఓ ఏ సి , ఓ ఎల్ ఈ డి టీ వి ,  ఫ్రిజ్ ,  కారు నిత్యావసర  వస్తువులు కదా ! అవి లేకుండా ఎలా బతుకుతామే ? "

"    వీలుంటే కొనుక్కుంటాం , లేకుంటే మానుకుంటాం . ఆ ఏ సీ ఓ సీ గా తీసుకుంటే బతుకంతా బీ సీ గా మార్చుకోవటం ,  ఆ టీ వి కొనుక్కుని ,  అసలైన  టాప్ విజన్ని వేరొకరికందించి , నాకు నేను అన్యాయం చెసుకోలేను . కూలర్స్ పై బాడీని కూల్ చేస్తాయే గాని , లోపల వేడిని చేయలేవు . నాకవేమీ వద్దు , మీరే కావాలి .

మిట్టమధ్యాహ్నమైనా   మిడ్ నైటు షోలో ఆనందాల్ని  పగలే వెన్నెలగా భావించి ఆలస్యం కాకుండా అందుకున్నారు సారిక సారధులు .


                                                                                   **  స  ** మా  ** ప్తం **

2 comments:

  1. వివేక భ్రష్ట సంపాతముల్

    ReplyDelete
    Replies
    1. నిజమే కదండి మరి .

      Delete