తప్ప లేదు మళ్ళీ

                                                               
                                                                                                                         కవితా రచన : శర్మ జీ ఎస్     


పూలను చూసేపని తప్ప ,
కోసే పనే లేదు .

కొబ్బరికాయ పొడికి తప్ప ,
కొట్టే పనే లేదు .

ఫస్ట్ నైట్ కి బెడ్ ని చూసుకొనేవారు తప్ప ,
 పూలు పరవలేదేమని అడిగేవారు లేరు .


మెయిన్ డోర్ కి , బాత్ రూం డోర్లకి తప్ప ,
మరే డోర్లకు గడియలు , తాళాలుండనే వుండవు .

ఒకేమారు నాలుగు స్టౌలు ఉపయోగించటం తప్ప ,
వంట కొరకు గంటల తరబడి కిచెన్ లో  ఉండేవాడే లేడు .

ఎదుటబడినప్పుడు చిరునవ్వు విసిరేవాడు తప్ప ,
నువ్వెందుకిలా వున్నావని ప్రశ్నించేవాడే లేడు

కమిట్ అయిననంత కాలం ,
అడుగడుగునా , అణువణువునూ తడుముకొనేవారు తప్ప ,
పరాయి వాళ్ళని  పోకిరీ చేష్టలతో ఏడిపించే వాడు లేడు .******

4 comments:

 1. ఎవరికి తప్పలేదండి ?

  ReplyDelete
  Replies
  1. తప్ప ,లేదు మళ్ళీ .

   నా బ్లాగును వీక్షించే మీలాంటి నా సహవాసులైన వారందరికీ )

   Delete
 2. ఇవన్నీU.S,లోనే అంటారా..

  ReplyDelete