వారసత్వ చరిత్ర


                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్ 


ఆరంభంలో వంశాభివృధ్ధికే వారసత్వం ,

కొంతకాలం పిదప ,
రాజకీయాల్లో వారసత్వం ,

ఇంకొంతకాలం గడిచాక ,
వ్యాపారాలలో వారసత్వం ,

మరికొంతకాలం గడిచాక ,
సినీ చరిత్రలో వారసత్వం ,

ఇంతకాలం యిలా గడిచాక , 
ఆ వారసత్వానికే ,
సీనియారిటీ పెరిగాక ,
ఇక్కడా , అక్కడా అన్న తేడా  లేకుండా ,
అంటుకొమ్మలా అల్లుకు పోయింది ,
అంటువ్యాధిలా ప్రబలిపోయింది ,
మంచి చెడు చూడనే చూడదు , 
వలసినదల్లా ధనికుడా ? నిరుపేదా ?
ధనికుడిని అమాంతంగా వాటేసుకుంటుంది ,
నిరుపేదను నిర్మొహమాటంగా కాటేస్తుంది , నెట్టేస్తుంది ,

ధనికులకు వారసత్వపు జోరు ,
నిరుపేదలకు బానిసత్వపు హోరు ,
ఇదే తర తరాలుగ  మార్చుకోని తన తీరు .

 ******

2 comments:

 1. పేదలకు పేదరికం వారసత్వం
  ధనికులకు ధనాగారమే వారసత్వం

  పేదలను వారసత్వం ప్రక్కకు నెట్ట లేదు అక్కున చేర్చుకున్నది (ఈ కోణంలో ).... ;-)

  ReplyDelete
  Replies
  1. ఇదీ నిజమే సుమా !

   Delete