క్లాసిక్ (గా) లేస్ సేల్స్

                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్
                 
                                      ( జూలై లో మాలిక యాగ్రెగాటర్లో ప్రచురించిన పెండెం గారి చిత్రానికి నా చిరు స్పందన ).
                                                                                 

లేస్ లేస్ లేస్ ,
ఈ తరం పిన్న , పెద్దలందరి
నోటివెంట ఇదే మాట , అదే బాట

లేస్ ప్యాకెట్ ఎప్పుడు చూసినా
మెండుగా సరుకు లోన లేకున్నా
నిండుగా నిండు పున్నమిలా అగుపిస్తుంది
నిండు చూలాలినే తలపిస్తుంటుంది
తననెన్ని మార్లైనా తడవమంటుంది
ఎవరిని ప్రెస్ చేస్తే ఎవరూరుకొంటారు
ప్రెస్ చేసి ఆనందించమంటుంది

పలుమార్లు ఆలోచించా ఈ లేస్ లో
అంత ఆకర్షించేదేముంటుందా అని ?
మనసు ఒక పరి రుచి చూడమంది
ఎదురు చెప్పక , బదులు చెప్పక
ప్యాకెట్ కట్ చేశా , అంతే  ఘుప్పున 
నసాళానికి అంటేటట్లున్నదా మసాలా వాసన 
ఐనా ఒక చిప్ తీసి నోటి కందించా
అంగిలి దాటకుండానే మహ ఎంగిలి పడ్డావులే
అంటూ ఎకసక్కెమాడినట్లు నాసిక నస

ఆ లేస్ లో 70 శాతం గాలేనట
మిగిలిన 30 శాతమే సరుకట
ఆ 70 గాలి 30 సరుకుని పరిరక్షిస్తుందట
గాలే కదా ప్రాణవాయువు మరి దేనికైనా ,
ఆ ప్రాణవాయువే కదా మనకు రక్ష

ఆ గాలి గనులను నమ్ముకొని అమ్ముకోవటం కంటే
ఎవరి సొంతం కాని ఈ గాలిని అమ్ముకొంటే
తప్పేమీ లేదనుకొన్నట్లున్నారు కాబోలు

అందుకే వీళ్ళు అమ్ముకొంటున్నారు బహిరంగంగా 
ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలదు అనుమతించక .

          ******               

11 comments:

 1. Replies
  1. గాలి ఘనులకంటే వీళ్లు బెటర్ అనుకుంటా ( ప్రభుత్వ అనుమతి అర్హతగా వెంటే వుండటం వల్ల ) .

   Delete
 2. గాలినే వీరు రామాహరి!
  కొనుక్కుని భుజిస్తారు రామాహరి!

  ReplyDelete
  Replies
  1. అమ్ముకొని బతుకుతారు కొంతమంది , కొనుక్కొని జీవిస్తారు యింకొంతమంది .

   Delete
 3. అక్కడ 'గాలి గనులు' అన్నది స్కాము
  ఇక్కడ 'గాలి డ్రామాలు' అయినది స్కీము

  ;-)

  ReplyDelete
  Replies
  1. గాలి గనుల ఘనులకు ఇంకొంచెం టైముంది సుమా , అంటే యింకా కొన్నాళ్ళు ఆగాలి .

   Delete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. లేస్ ప్యాకట్ లో chips less..మసాలా లేని లేస్ కూడా వున్నాయి..బాగా వ్రాసారు..

   Delete
  2. కృతజ్ఞతలు .

   Delete
 5. బావుందండీ!ఎవరి చేతిలో చూసినా అవే!చాలా ఉప్పు,అది ఎందుకు తింటారో అర్ధం కాదు .

  ReplyDelete
  Replies
  1. కష్టంగా తింటారు , దాన్ని బట్టి యిష్టమై ఆరగిస్తున్నారనుకొందాం .

   Delete