లే ...లే ... ప ... పా ...

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


అడవిలో చాలా చాలా మృగాలుంటాయని ,
వాటిలో చాలా స్నేహంగానే ఉంటాయని ,
చీతలు చిక్కులు పెడ్తాయని ,
పులులూ పిల్లుల్లా మెల్లగా వెంటపడ్తాయని ,
సింహం స్వరూపానికే నర సింహమని ,
తనకాహారం అందకుంటే ఆగ్రహిస్తుందని ,
ఏడేడకో వెళ్ళకు ఈడీడనే ఆడుకొమ్మని ,
మరీ మరీ , పదే పదే చెప్పి వెళ్ళింది తల్లి లేడి  ,
పరుగులు తీస్తూ ఆనందించాలనుకొని ,
ఆ కానలో , ఆ కోనలో , ఆ లేడి కూన ,
అమ్మ మాట పెడచెవిన పెట్టింది ,
ప్రకృతిని చూడాలని ఉవ్విళ్ళూరింది ,
అంగలంగలతో చెంగు చెంగున గంతులేస్తూ ,
అలా అలా అడవి అంతా కలయ తిరిగింది ,
ఎనలేని ఆనందాల్ని ఆస్వాదించింది ,
హాయిగా ఆదమరచి అచ్చోటనే విశ్రమించింది ,
చాటుగా పొదలమాటున మాటు వేసిన చీత , 
మెల్లగా , సవ్వడి లేని ఆడుగులతో కదిలింది ,
పొదల సవ్వడికి , వెనుకకు చూసింది ,
అలుపు రొప్పులతో పరుగులు తీసింది ,
అమ్మ కొరకు కాకున్నా , ప్రాణం కొరకు ,
ఆ ప్రాణాన్నే పరుగులు తీసేలా చేసింది ,
చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు తృటిలో తప్పించుకొంది ,
లే ... లే ... ప ... పా ... అంటే ,
లేడికి లేచిందే పరుగు పారిపోయేటందులకే .

******


ముఖ్య గమనిక :

సహజంగా మన ఈ సమాజంలో ఎవరైనా వున్న పళాన ఉరుకులతో పరుగులు తీస్తుంటే "   లేడికి లేచిందే పరుగు , ఆగేది లేదా ? "   అంటుంటారు .


కానీ లేడి అలా పరుగులు తీయటానికి వెనక నున్న గాధ ఇంత భయంకరమైనదని , బాధాకరమైనదని తెలుసుకొంటే , ఇక ముందు పైలా వాడుకో కూడదు . 

6 comments:

 1. Haha!! Good thought.... Okate image ki father and son ichina different descriptions baavunnayi....

  ReplyDelete
  Replies
  1. అదే తరాల అంతరాల తేడా .

   Delete
 2. Replies
  1. బహు కాలానికి మీ కమెంట్ . కృతజ్ఞతలు .

   Delete
 3. Replies
  1. బహు కాలానికి మీ కమెంట్ .

   Delete