విశ్వరూపం

                                    
                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్

విజ్ఞానం అంతులేని ఆకాశమంటుంది ,  
అజ్ఞానం అధఃపాతాళమంటుంది , 

విజ్ఞానాన్ని అందిస్తానంటుంది ,
అజ్ఞానాన్నీ సంధిస్తుంటుంది ,

విచక్షణాజ్ఞానాన్ని పోగొడ్తుంటుంది ,
చాటుగా చోటు చూసుకొమ్మంటుంది ,

కోరుకో చూపిస్తానంటుంది ,
కోరకున్నా వదలనంటుంది ,

తదేకదీక్షతో తననే చూడమంటుంది ,
నమ్మకమైన ప్రాణస్నేహితుడనంటుంది ,

నీ కష్ట సుఖాలను చెప్పుకోమంటుంది ,
నీ అభీష్టాలను తెలుపుకోమంటుంది  ,

నాణ్యత నాది , ప్రావీణ్యత నీదంటుంది ,
పెట్టుబడి నీది , పరపతి నాదంటుంది ,

నీతి నిజాయితీ నాదేనంటుంది  ,
పరపతి , పరసతి మీరే అంటుంది  ,

ఒకమారు చూస్తే చాలు అంటుంది ,
ఆ వాడభామలా  వదలనంటుంది ,

అడిగిన తడవే అందిస్తానంటుంది ,
ఎన్నడు చూడనివన్నీ చూపిస్తానంటుంది  ,

ఇదే కదా అంతర్జాల మాయాజాల విశ్వరూపం .

                  *****

8 comments:

 1. అంతర్జాల మహిమ అమోఘం :-)

  ReplyDelete
 2. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ కదండి :-)

  ReplyDelete
 3. శర్మ గారూ ! నా బ్లాగును వీక్షించి సద్వ్యాఖ్య చేసినందులకు ధన్యవాదములు.
  మీ బ్లాగును ఇప్పుడె చూస్తున్నాను. మీ కవితలు .. భావం బాగున్నాయి.

  మీరు చెప్పినది నిజమే...

  అంతర్జాలపు జాలము
  నింతనివర్ణించ జాల మీయిల లోనన్
  వింతది నరునకు కన క
  వ్వింతగ విశ్వమ్ముజూపు విష్ణువువలెనే !

  ReplyDelete
  Replies
  1. స్వాగతం , సుస్వాగతం .చక్కగా సెలవిచ్చారు పద్య రూపంలో .కృతజ్ఞతలు .

   Delete
 4. చాలా బాగుందండీ...

  ReplyDelete