లబ్ డబ్ , లబ్ డబ్

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


( 25 ఆగష్ట్ 2013 న మాలిక యాగ్రెగాటర్లో ప్రచురించిన పెండెం గారి చిత్రానికి నా చిరు స్పందన  )     
ఎల్ ఓ వీ ఈ అంటే లవ్వట
వన్ టూ త్రీ అంటే ఆ ,
లవ్వుకి సంకేతమట ,
సందేశాన్ని పంపుతుంటారట  ,
తమ ఆదేశాన్ని అనుసరించమంటారట ,
లవ్ / ప్రేమ అంటే రెండే రెండక్షరాలట ,
ఇరువురి నడుమ జనిస్తుందట ,
ఆకారమే లేని మనసుకు లంకె వేస్తుందట ,
వలపుని పుట్టిస్తుందట ,
వయసుని వాడుకొమ్మంటుందట ,
తనువులను దగ్గర చేస్తుందట ,
తలపులను జమ చేస్తుందట ,
తన్మయత్వంలో ముంచేస్తుందట ,
ఎవ్వరికైనా లైను వేస్తుందట , 
పదుగురి కంట పడకుండా ,
పక్క తోవలు పట్ట్టిస్తుందట ,
లబ్ డబ్ , లబ్ డబ్ అంటూ,
గుండెలను పిండేస్తుందట ,
రెండు గుండెలను ఒక్కటి చేస్తుందట ,
అదే అమరప్రేమ అంటుందట ,
కొందరి కది పైత్య ప్రకంపనట ,
ఇంకొంతమందికి కామా లేని కామమట ,
మరి కొంతమందికి మన్మధ బాణమట ,
ఆ యిరువురికి మాత్రం కొబ్బరి లౌజట
అదే అందమైన సంగమమట .

*******

7 comments:

 1. Replies
  1. సహజంగా 143 అంటే ఐ లవ్ యూ అని ఆంగ్ల అక్షరాలకు సంకేతం గా భావిస్తారు . అదే ఆంగ్ల పదాలు తెలుగులో వాడుతున్నప్పుడు ఐ ఒకటవది ,లవ్ రెండవది , యూ మూడవది అవుతుంది కనుక 123 అని వాడటం జరిగింది .

   Delete
 2. లబ్ డబ్ or లవ్ డబ్?

  ReplyDelete
  Replies
  1. లవ్ లబ్ డబ్ గా మారి ఆ పై లవ్ ( ఎక్కువైన తర్వాత ) డబ్బులను కోరుతుంది . ఇది మన నిత్యజీవితంలో చూస్తున్న సత్యం .

   Delete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. వామ్మో శర్మగారు.....లవ్ అంటే 143 అనుకున్నానేకాని ఇంతర్థం ఉందాండి :-)

  ReplyDelete
  Replies
  1. అయినా నీకు తెలియనిదేమీ కాదులే పద్మా .

   Delete