అందమె ఆనందం

                                                                                                                               కధా రచన : శర్మ జీ ఎస్

హైదరాబాద్ లాంటి సిటీలో అన్ని వసతులు గల యిళ్ళ అద్దె ఆకాశాన్నంటుకొంటుండగా , కొన్ని వసతులు గల యిళ్ళు తక్కువ అద్దెతో కొత్త జంటలకి మాత్రమే అందుబాటులో అనుకూలంగా వుంటున్నాయి .

కొత్త దంపతులైన క్రాంతి కార్తీక్ లు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ చేరుకొని కొత్త జంటలకి అనుకూలంగా వున్న వున్న చిన్న యింటిని అద్దెకు తీసుకున్నారు .
ఓ హాలు , ఓ చిన్న కిచెన్ రూం , ఆ కిచెన్ ఆనుకుని బాత్ రూం గా చెలామణీ అవుతున్న ఓ బుల్లి గది , వెరసి ఆ యింటి మొత్తానికి ఒకటే డోర్ .

ఆ హాలులో రెండు వైపులా రెండు కిటికీలు , రెండు వాల్ ఫిటెడ్ అల్మైరాలున్నాయి . ఆ కొత్త దంపతులు ఈ హాలుని రెండు గదులుగా వుపయోగించుకొనే ప్రయత్నంగా రెండు వైపులా రెండు సింగిల్ కాట్స్ వేసుకొన్నారు .నడుమ స్క్రీన్ కూడా ఏర్పరచుకొన్నారు .

సమయం రాత్రి 8 గంటలు దాటింది . కార్తీక్ తన టేబుల్ వద్దనే ఇంగ్లీష్ మేగజైన్ చూస్తున్నాడు .
 స్నానం ముగించుకొని , లంగా కట్టుకొని , చీర చుట్టుకొని హాలులోకి వచ్చి స్క్రీన్ లాగి , డ్రెస్ చేసుకొనేటందుకై అల్మైరా వైపు నడిచింది క్రాంతి . ఆ రింగుల గలగలలకి కార్టీక్ దృష్టి అటు మళ్ళింది . జీరో వాట్ ఆన్ చేసి సెంటర్ బల్బ్ ఆఫ్ చేసింది . షిఫాణ్ శారీ , బ్లౌజ్ అల్మైరాలోంచి తీసి , బ్రా వేసుకొన్నది . బ్యాక్ ఓపెన్ కావడంతో , రెండు చేతులను వెనుకకు మళ్ళించి , హుక్స్ తగిలించుకొనే ప్రయత్నంలో ఆమె నీడ కార్తీక్ ని ఆకర్షించింది . అతని పై పెదవి క్రింది పెదవిని పదే పదే పలుకరిస్తున్నది ,  అధరామృతధారలు గ్రోల యిరువురి నడుమ స్క్రీన్ అడ్డుగా నిలిచినా , నీడల కడ్డు లేనట్లు ఆ నిలువెత్తు అందాల వంపు సొంపుల నీడలు అతనిని చిత్తు చిత్తు చేసేస్తున్నాయి . మెల్లగా మేగజైన్ ని టేబుల్ పై వుంచి కుర్చీలోంచి  లేచాడు .

" ఏయ్ కార్తీక్ ఎక్కడకీ ? అక్కడే ఆగు . నాడు అందాన్ని ఆరాధించాలన్నావ్ . వివాహమంటే  రెండు తనువుల కలయిక కాదు , రెండు మనసుల కలయిక . అలా కలసిన మనసుల మనుగడ కడదాకా సాఫీగా సాగిపోతుందన్నావ్ . నేడు సామాన్య మానవునిలా సలపరింతలతో సతమతమవుతున్నావ్ . క్షణిక ఆవేశానికి దాసుడవై , విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి , ఆరాధకునిలా కాక , అపరాధకుడిలా ఈ నీ క్రాంతి ముంగిట బోనులో నిలబడక , ఇటువంటి తొందరపాటు చేతలు , తలరాతలనే మార్చేస్తాయి " అన్న మనసు హెచ్చరికతో మరలి కుర్చీలో కూలబడ్డాడు .

డ్రెస్ చేసుకొంటూ అతని అవస్థని గమనించి నవ్వుకొన్నది . సెంటర్ బల్బ్ ఆన్ చేసి జీరో ఆఫ్ చేసి  స్క్రీన్ అడ్డు తొలగించింది .

                                                                                                        *****

కార్తీక్ కళ్ళు అడుగడుగునా తెరమరుగున అందాలను పరికిస్తూనే వున్నాయి . అవకాశం కొరకు ఎదురుచూస్తున్నాయి . క్రాంతి కార్తీక్ అవస్థని గమనిస్తూనే వున్నది . సరదాగా ప్రారంభమై , క్రమేపీ ఆమె అందాలు తెరమరుగున మరిగి మాడుతున్నట్లుగా భావన కలిగి తెర తొలగించ వుపక్రమించింది .

" ఏయ్ క్రాంతీ తొందరపడకు . అపుడే అన్నీ మరచిపోయావా ? పక్కింటి పంకజం ఎంత ఆందాల రాశి . అటువంటి పంకజాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకొంటానని మాట యిచ్చి సంసారానికి తీసుకెళ్ళి సంవత్సరం తిరగకుండా , నుగ్గు నుగ్గు చేసి ఒగ్గులా పంపాడామె భర్త పుట్టింటికి . ఆ అవమానం భరించలేక అగ్గిపాలైంది . ఇలంటి సంఘటనలు నేడు కోకొల్లలు . సినిమాలలో , బుల్లితెరలో చూడటం లేదా ? పత్రికలలో చదవటం లేదా ? రేపు నీ గతీ అంతే అవుతుందేమో ? " అంటూ తన మనసు క్రాంతిని హెచ్చరించింది .

" అవును , మరచేపోయాను . ఈ మగజాతి అంతా యింతే . అందం అందనంతవరకు ఆరా తీస్తారు , ఆరాధిస్తామంటారు . తీరా అందిన పిమ్మట వాళ్ళు అనుకున్నది సాధిస్తారు , ఆ పై వేధిస్తారు . ఎంతకైనా తెగిస్తారు . తను తొందర పడకూడదు . తామిరువురు ఆరాధనకిష్టపడే వివాహం చేసుకొన్నారు . ఇంక ఆ విషయం ఆలోచించకూడదు " అనుకొని అక్కడే ఆగిపోయింది .

" ఇటువంటి తొందరపాటు నిర్ణయాలే నీ అందాన్ని యిన్నాళ్ళూ అడవిగాచిన వెన్నెల చేశాయి . తెలియక జరిగిన పొరపాటు మెలమెల్లగా సర్దుకొంటున్న సమయంలో మరల అర్ధరహిత నిర్ణయాలా ? ఈ ప్రపంచపు పంచలో మగజాతి పంకజం భర్త లాంటి వారే వుండరు . అలాగని ఆరాధకులూ వుండరు . ఈ ప్రపంచమంతా నీలా భావిస్తే , నీవు లేవు , నేను లేను , ఈ సృష్టే వుండేది కాదు . స్తంభించి పోతుంది . అండం వాడి ( పదును ) పోతుంది . అలా వాడి ( పదును ) పోయిన అందాన్ని వాడే వారు కరువైపోతారు . ఆ పై ఏకరువు పెట్టుకున్నా , ఏ ఒక్కరూ దొరకరు . ఎవరూ ఏటికి ఎదురీదరాదు .
భగవత్ సృష్టి అభివృధ్ధికి దోహదం కావాలి . అలా అభివృధ్ధికి సాయపడే ప్రాణికోటిని అంతు లేని , అంతు తెలియని ఆనందాలని పొందమని ఈ అందాల్ని సృష్టించటం జరిగింది . సృష్టి కొరకు అయితే అందాలతో పని లేదు . ఆ అందాలు మానవుల ఆనందాల కొరకన్నది మనం మరచిపోకూడదు .
అలా ఆ ఆనందాల్ని పొందుతున్న తరుణంలో , ఆ యిరువురకు అంతవరకు వున్న బంధం మరింత బలపడాలని , అలా బలపడిన బంధంతో జీవితాంతం అన్యోన్యంగా జీవించమని ఆ సడ్గుణ శక్తి స్వరూపుడైన ఆ భగవంతుని ఆదేశం . ఆ ఆదేశాన్ని ఆయనచే సృష్టింపబడిన  ఈ మానవులు ఆనందాల్ని అందుకోక , అందాలని ఆరాధించాలన్న అపోహతో , అడ్దుపడటం , నిలువ నీడ నిచ్చిన వాళ్ళని నిప్పుల్లోకి నెట్టినట్లవుతుంది .
అన్ని జన్మలలోకి మానవ జన్మ అత్యుత్తమమైనదిగా ఘోషిస్తున్నాయి వేదాలు . ఆలోచించటానికి మనసు , వుపయోగించటానికి మెదడు కల్పించాడు . అన్ని ప్రాణులకూ మెదడు వుంటుంది . అయితే మానవుల ఆలోచన మాత్రం మిగిలిన అన్ని ప్రాణులకంటె డిఫరెంటుగా వుంటుంది .
ఇప్పటికైనా మించిపోయింది లేదు . అందాల్ని ఆరాదించి అనుభవించేలా నడుచుకో . సృష్టి అభివృధ్ధికి నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు " అని అంతరాత్మ  హిత బోధ చేయగా  ఎటూ నిర్ణయించుకోలేక అలా బెడ్ మీడ తల వాల్చింది .

                                                                                                     *****

కార్తీక్ కోర్కెల కళ్ళెంలో చిక్కుకొని సతమతమవుతున్నాడు .
" ఏయ్ కార్తీక్ ఎందుకలా నీరుగారిపోతావ్ ? అందం వేరు , కోరిక వేరు . అందాలని ఆరాధించాలి , కోరికలను తీర్చుకోవాలి . ఈ విషయాన్ని గ్రహించక నీలాంటి వాళ్ళు కమ్మనైన జీవితాల్ని కన్నీటి పాల్జేసుకొంటున్నారు . పొంతన కుదరదని సందేహిస్తున్నావా ? నేను కుదురుస్తాగా . కోరికలని బలవంతంగా అణగదొక్కటం వలన ఆమె వద్ద ఒక్కసారిగా బలహీనుడవై , నిగ్రహ హీనుడవై నిలబడవలసి వస్తుంది . ఆనాడు ఆమె పొందు పొందే అవకాశాన్ని  , సావకాశంగా ఈ జన్మకు సరిపడా కోల్పోతావు . ఆలస్యం చేయక లే బయలుదేరు అన్న హెచ్చరికతో ఒకింత ఆలోచనలో మునిగాడు .
ఏమిటీ ? ఇంకా తీకగా ఆలోచిస్తున్నావా ? తప్పని సందేహిస్తున్నావా ? హైస్కూలులో హైమతో , కాలేజీలో కామాక్షితో పొందిన ఆనందం మరచిపోయావా ? నాకేమీ తెలియదనుకోంటున్నావా ? ఆ చర్యలు పరిణతి చెందక చేసినవని సమర్ధించుకొన ప్రయత్నిస్తున్నావా ? ఎలా చేసినా పొరపాటు , పొరపాటే . కోరికలని సుళువుగా తీర్చుకో , లేకుంటే అవి బిగువుగా నొక్కేస్తాయి . ఆనాడు నే ఈ సలహాలు యివ్వలేను , ఆ సంతోషాన్ని అందించలేను . లే , వెళ్ళు . ఎంతోమంది నీ పొందు కోరకు బయట సిధ్ధంగా వున్నారు . ఆలస్యం చేయకు . వారందుకే వున్నది " అన్న , మాటాళాటొ  " ఈంటాఖి ణివేవాఋఈవీ ? " ఆణీ ఆదీఘదూ .

" ణివె ఖడూ , ఇ ంఅనవాళి నన్నంత త్వరగా అర్ధం చేసుకోదు . మీ ప్రాణానికి ప్రాణాన్ని . మీ జీవనగమనంలో నవ వసంతంలా సంతోషాల్ని సుళువుగా అందించి , జీవితకాలం ఆ సంతోషాల్ని తీపిగురుతులుగా మిగిల్చేదానిని , వయసుని . ఇప్పుడర్ధం చేసుకోలేని వారు , ముందు జీవితకాలంలో అర్ధం చేసుకొని , నా కొరకెంతగా పరితపిస్తారో . అప్పుడు ఫలితముండదు కూడా . నీకలా కాకూడదు . త్వరగా నీ కోరిక తీర్చుకో స్వేఛ్ఛగా " అని బదులిచ్చింది వయసు .

కార్తీక్ బెడ్ మీదనుంచి లేచాడు .

"  నో... నో ... కార్తీక్ , నువ్వలా బయటకు వెళ్ళటానికి వీల్లేదు , వీల్లేదు అంటూ బెడ్ మీద నుంచి పైకి లేచింది క్రాంతి . ఎదురుగా కార్తీక్ బెడ్ మీద లేడు . గోడ గడియారం 3 గంటలు మోగించి , తన ఉనికిని , పరిసరాలని తెలియపరచింది . అంటే తనింతవరకు కలగన్నదా ! కార్తీక్ ఆఫీసు నుంచి యింకా యింటికి రాలేదా ? మంచి పనే జరిగింది . అతనిని బయట సుఖానికి అలవాటు చేయకూడదున్ . ఆ తర్వాత ఎన్నౌకొని ప్రయోజనముండదు . తనే చొరవ చేసుకొని అవకాశం అతనికి కల్పించాలి " అనుకొంటూ , కార్తీక్ బెడ్ చేరుకొని తీసి వున్న అల్మైరా తలుపు తాళం అందుకోబోయింది .
అందం ( క్రాంతి ) + ఆరాధన = అందమైన జీవితం  అన్న పుస్తకం ఆమె దృష్టినాకర్షించింది . గబగబా అందులోని పేజీలను తిరగేసింది . ప్రతి పేజీలో తన బొమ్మ గీసి , ఆ బొమ్మ క్రింద తన బొమ్మ గీసి తననో ఆరాధకుడిలా , తననో దేవతలా చిత్రించాడు . ఆమె కళ్ళు మొదటిసారిగా చెమర్చాయి . ఇంతటి ఆరాధకుడినా తను యిన్నాళ్ళూ అనుమానించింది , ఆ సుఖాన్ని ఆమడ దూరానుంచింది . తను చాలా పెద్ద పొరపాటు చేసింది .

ఇకనైనా అతనికి ఏ లోటు కలిగించకుండా అన్నీ అందించాలనుకొని ,ఆ పుస్తకాన్నక్కడే వుంచి , అంతదాకా తామిరువురకు అడ్డుగా నున్న స్క్రీన్ ని తొలగించి , తన బెడ్ ని అతని బెడ్ ప్రక్కకు చేర్చి , అతని డ్రెస్ ను తన అల్మైరా లోకి సర్దేసింది .

ఆఫీసు నుంచి సాయంత్రం యింటి వచ్చిన కార్తీక్ గదిలోని మార్పులను గమనించి " క్రాంతీ ఈ రోజే మైంది నీకు ? " అడిగాడు ఆశ్చర్యవదనంతో .

సిగ్గుల మొగ్గ అయి , " ఏమీ లేదు . మీ ప్రవర్తన నాకు బాగా నచ్చింది . నిజమైన కళారాధకులుగా , నిగ్రహపరులుగా నా మనసులో సుష్తిర స్థానం ఏర్పరచుకొన్నారు . మీ నిగ్రహానికి నా విగ్రహం అర్పించుకోవాలంటున్నది . అందుకే ఈ మార్పులు " అన్నది .

" తొందరపడకు క్రాంతి , బాగా నిదానంగా ఆలోచించు . ఆవేశంలో తప్పటడుగు వేసే అవకాశం వేయకు " అని హెచ్చరించాడు .

" ఇంకా ఆలోచించి ఆలస్యం చేయదలచుకోలేదు .అనవసరపు కాలయాపనే అవుతుంది . నిజాలు అవగతమైనప్పుడు , నైజాలు తదనుగుణంగా మార్చుకొని మనుగడ సాగించటమే అన్ని విధాలా ఆనంద దాయకం . మనసు ముచ్చటప్[అడ్తున్న వేళ , కలిసే తనువుల కలయికే అసలు సిసలు తన్మయత్వపు తొలి రాత్రి . ఇన్నాళ్ళూ అందాల్ని ఆరాదించాలి , ఆస్వాదించకూడదు అన్న అపోహలో గడిపానని యిపుడే అర్ధం చేసుకున్నాను . అందాన్ని ఆరాధిస్తూ ఆస్వాదించాలని నేడే గ్రహించాను " అన్నది .

కార్తీక్ కి ఆ రాత్రి కాదు , ఆ క్షణమే తొలిరాత్రిగా భావించి అలా ప్రవర్తించాడు . క్రాంతి అడ్డు చెప్పక , అతనికనువుగా తనువుని అందించి సహకరించింది . అతని చొరవకి , ఆమె అంబరపు వీధుల్లో సంబరాలు చేసుకొంటోంది . ఈ ఆనందాన్నా యిన్నాళ్ళూ చేజేతులా వదులుకున్నాను అనుకొంటూ , ఇక వదులుకోను గ్శాక వదులుకోను అని అతన్ని గట్టిగా గుండెలకు హత్తుకొన్నది .


                                                                                     ** స ** మా ** ప్తం **

No comments:

Post a Comment