నడ వడి నడవడి

                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్


గజరాజు గంగిరెద్దుగా మారిన వేళ ,
తన నడ వడిని మార్చుకొనెను ,
ఇంటింటి ముంగిట మెల్లగ అడుగులేసేను , 
తన అయ్యగారికేమైన యిమ్మని తల ఆడిస్తూ అడిగేను
బదులుగా తను దీవెనలిస్తాననేను ,
తన తనువు నల్లగా వున్నా , 
దంతాలు తెలుపేనని చూడండనేను  ,  
తనకే కాదు ఏ ప్రాణికైనా , ఎవరికైనా ,
దంతాలు తెలుపేనని  చూసుకోండండనేను ,
దంతాలే మాటలాడేను , 
అంటే భావాలు తెలపటమే కదా ! 
ఆ తెలపాల్సిన దంతాలు తెలుపేననేను , 
అదే అసలు సృష్టి శక్తి ఘనతని చాటేను  , 
ఇన్ని మంచి విషయాలను తెలిపిన ,
ఆ గజరాజును పట్టు వస్త్రాలతో ,
ఘనంగా సత్కరించగా సంతోషంగా , 
అట నుండి ముందుకు అడుగులు వేసింది .

******

4 comments: