మనసు ఓవర్ టేక్ వయసు

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


పెళ్ళైన కొత్తలో
డబుల్ బెడ్ లెందుకు ,
సింగిల్ చాలు అని సర్దుకుంటారు ,

పిల్లలు పుట్టాక ,
ఆ డబుల్ బెడ్ ని ,
ఆ పిల్లలకు కేటాయిస్తారు .

ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ,
ఆ డబుల్ బెడ్ ,
అవసరం ఎంతో వుంది అనిపిస్తుంది .

ఆ పిల్లలే పెళ్ళై వెళ్ళాక ,
ఆ డబుల్ బెడ్ అవసరం ,
ఇక లేనే లేదనుకుంటారు .
మళ్ళీ ఖాళీగానే వుంచుతారు

మనుమళ్ళు , మనుమరాళ్ళతో ,
ఆ సింగిల్  బెడ్ ,
అవసరమే లేదనిపిస్తుంది .

కొంతకాలం గడిచాక ,
వయసయిపోతున్న వేళ ,
ఆ డబుల్ బెడ్లు ,
అవసరమనిపిస్తాయి .

ఇంకొంతకాలం గడిచాక ,
ఆ డబుల్ బెడ్లు ,
రెండు సింగిల్ బెడ్లు లా ,
రూపాంతరం చెందుతాయి

మఱి కొంతకాలానికి ,
మదిలోన భావాలు మారుతున్నప్పుడు ,
ఆ యిరువురూ ఎవరికి వారవుతారు ,
ఒకరు నిద్రపోవాలనుకుంటే ,
మరొకరు టీ వీ చూడాలనుకుంటారు ,

బెడ్లు కాదు మార్చాల్సింది  ,
మార్చాల్సింది పడక గదులే .

           ******

4 comments:

 1. వయసు చిత్రం!

  ReplyDelete
  Replies
  1. మనసు కొన్నాళ్ళు వయసుకి తలొగ్గుతుంది , ఆ పై వయసు వాడిపోబడ్తుందని తెలుసుకోవటం వల్లనే మరి .

   Delete
 2. వామ్మో....డబుల్ బెడ్ & సింగిల్ బెడ్ అంటూ కంప్యూజ్ చేసి చివరికి రూం కంస్ట్రక్ట్ చేయమంటే కష్టమే :-)

  ReplyDelete
  Replies
  1. వయసు , సొగసులు శాశ్వతం కాదని మనసు తెలుసుకోవటం వల్లనే .

   Delete