ఉల్లి తల్లిపై లొల్లి

                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్
( పెండెం గారి ఛాయాచిత్రానికి నా చిరు కవిత )


ఉల్లి తింటే ఘాటు , 
కొనకుంటే లోటు ,
కొనాలంటే ధరల వేటు ,
తినకుంటే రుచిలో పెద్ద లోటు

వరదల వర్షాలతో స్తంభించిన నిల్వల ,
ఉల్లి మురిగి ముక్కు మూసుకొనే స్థాయిలో మళ్ళీ , 

రవాణా శాఖ నిరవధిక సమ్మె వల్ల ,
ఉల్లి దొరకలేదని ఒకటే లొల్లి ప్రతి గల్లీలో ,
ఉల్లికే కాదు , దేనికైనా  గాలి సోకాలి లేకుంటే ,
గాలి ( దెయ్యం ) సోకినదానిలా కుప్ప కూలిపోతుంది ,

తర తరాలుగ ఉల్లి తఱుగుతుంటే కన్నీళ్ళు ,  
నడుమ నడుమ కొనాలంటేనే ధరల  కన్నీటి ధారలే ,

రాజకీయ పార్టీల ప్రముఖులు ,
బ్లాకు మార్కెట్లో  అధిక ధరకి కొని ,
అల్ప ధరకే అమ్మటంలోని అంతరార్ధం ,
ప్రజలపై అభిమానం అసలు కానే కాదు ,
నల్ల ధనాన్ని కొంతైనా తెల్లగ మార్చటానికే , 
ఈ ఉల్లి లొల్లి రాజకీయ నాయకులకు మళ్ళీ మళ్ళీ , 

ఒక రాజకీయ పార్టికే పరిమితం కాదు ,
అన్ని రాజకీయ పార్టీలకు యిలాంటి లొల్లులు ,
అపుడపుడు ధనలక్ష్మి గజ్జెల గల గలలు ,

ఉల్లి చేసే మేలు తల్లైనా చేయదంటారు ,
ఉల్లి చేసిన కీడు తల్లెంతమాత్రమూ చేయదంటా ,

ఓ నాడు యిదే ఉల్లి ఓ ప్రముఖ పార్టీని,
పదవి నుంచి క్రిందకు తోసేసింది ,
తన సత్తా ఏమిటో ఘాటుగా చూపించింది ,
అది మర్చిపోలేదేమో ? అందుకేనేమో మళ్ళా ఈ ఉల్లి లొల్లి  .

******

9 comments:

 1. ఉల్లి వెనుక ఇంత రాజకీయ లొల్లి ఉందంటారా :-)

  ReplyDelete
  Replies
  1. ఉన్నదని ఖచ్చితంగా , ధైర్యంగా , బాహాటంగా చెప్పుకోవచ్చు మనమందరం .

   Delete
 2. అప్పటి రాజకీయ పార్టీ ఈ ఉల్లి లొల్లిని త్వరగా తేల్చింది, కానీ ఈసారి ఈ లొల్లి కంటే పెద్ద లొల్లిలే జరుగుతున్నాయి కదా అందుకే కన్నీళ్ళకి పనికొస్తుందిలే అని అలాగే ఉంచారు. మంచి కవిత,

  ReplyDelete
  Replies
  1. ఉల్లి తల్లి అన్నదే మరచారు , నేటి పిల్లలు వాళ్ళ తల్లిని లొల్లి చేస్తున్నట్లుగా ఈ రాజకీయ నాయకులు ఈ వుల్లిని పలు రకాలుగా లొల్లి చేస్తున్నారు .

   Delete
 3. ఉల్లి తల్లి మోడీ గారిని కరుణిస్తుందంటారా?

  ReplyDelete
  Replies
  1. ఆ విషయం కాలమే చెప్తుంది .

   Delete
 4. Liked the first stanza a lot!! .....

  ReplyDelete
 5. Liked the first stanza a lot!! .....

  ReplyDelete