అచ్చోసిన అమెరికా .


                                                                                                                         కవితా రచన : శర్మ జీ ఎస్

కోతలు కోసేవారు లేరు ,
మోతలు మోసేవారూ లేరు .

అందనిదాన్ని త్యజిస్తారు .
అందినదానితో ఆనందిస్తారు ,

దాచుకోవాలన్న ధ్యాస ,
దోచుకోవాలన్న ఆశ కానరావు . 

పందాలు కాసేవారు ఎక్కువే ,
జంధ్యాలు వేసుకొనేవారు తక్కువే .

ఎన్ని కార్లు వరుసగా వెళ్తున్నా ,
వేగం శబ్దం తప్ప , ఆగం శబ్దం వినపడదు .

శాకాహారం పాకాహారం కాదు వారికి ,
మాంసాహారమే పోషకాహారం వారందరికి .

నువ్వెలా బతకాలనుకొంటే అలా బతకవచ్చు ,
ఎదుటివారి స్వేఛ్ఛ కక్షలో ప్రవేశించినంతవరకు .

మొదట స్నేహం మోహంగా మారుతుందిచట ,
ఆ పై ఆ మోహమే స్నేహంగా రూపు దిద్దుకొంటుందట .

ఇండియా రోడ్లమీద కుమ్మేసినా పడదు ఫైన్ ఒక్క రూపాయైనా ,
అమెరికాలో ఉమ్మేసినా పడ్తుంది ఫైన్ కనీసం 1000 డాలర్లయినా .  

కొంతమందికి అచ్చొచ్చిన అమెరికా యిదే  ,
మరికొంతమందికి అచ్చోసిన అమెరికానూ  యిదే  .

******

1 comment:

  1. ఇక్కడా వేస్తున్నారండి ఫైన్, దానికేం లేదండిలోటు,
    ఇక్కడా ఉన్నాయండి ఆబోతులు కానయితే కట్టడి చేసేవారే లేరండి

    ReplyDelete