ఆన్ సైట్ ఫైట్

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్

ఉద్యోగపరంగా తరలి వెళ్ళాక ,
అమ్మా నాన్నలను వదలి వెళ్ళాక ,
భార్యాబిడ్డలను వదలి వెళ్ళాక ,
కులాలని , మతాలని ,
మన దేశం లోనే వదిలేయాల్సిందే ,
స్వదేశం కాని పరదేశంలో ,
అక్కడ అనుక్షణం హితం కోరే 
అసలు సిసలు స్నేహితుడే కావాలి ,
చక్కటి రూం మేటే దొరకాలి ,
ఎవరికి ఏ అవసరం వచ్చినా ,
ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి ,
అవసరాలకు అనుగుణంగా మసులుకోవాలి ,
సక్రమంగా స్పందిచే గుణం కావాలి ,
అభిమతాలని తెలుసుకొని మసలాల్సిందే ,
ఆ క్షణమే ఆన్ సైట్ ఆల్ రైట్ .

 ******

4 comments:

 1. Replies
  1. తుది మాటగా అన్నీ వదిలేయాల్సిందే నంటారు , అదీ అక్కడి దేశ ,కాల మాన పరిస్థితులను బట్టి .

   Delete
 2. కుల మతాలూ ఒక విధమైన అంటూ వ్యాధులు .... ఎక్కడ వున్నా మంచిది కాదు ...

  స్నేహ భావం కలిగి ఉన్నంతన ఎక్కడైనా అల్ రైట్ లేకపోతే ఎక్కడైనా ఫైటే...

  ReplyDelete
 3. స్నేహ భావం కలిగి ఉన్నంతన ఎక్కడైనా అల్ రైట్ లేకపోతే ఎక్కడైనా ఫైటే... నిజమే కదా !

  ReplyDelete