రూపాయి పాపాయి

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్

                                                                              
బోసిగా నవ్వటం , 
భొరున ఏడవటం తప్ప ,
 పాపాయికేమీ తెలియదు , 
అందుకే అక్కున చేర్చుకొంటారు  

అందరినీ విపరీతంగా ఆకర్షిస్తుంది ,

ఆ దరి జేరుస్తానంటుంది , 
అన్నీ తనతోనే ముడిపడ్డాయంటుంది , 
అందరినీ తనని దరి జేర్చుకోమంటుంది ,
రూపాయికి తనకు తెలియనివి లేవంటుంది , 
ఠక్కున అందుకోని వాడు లేడు   

పాపాయి అందరినీ నవ్విస్తుంది ,
రూపాయి అందరినీ కవ్విస్తుంది ,
పాపాయి పెరుగుతుంటే ఆనందం ,
రూపాయి ( విలువ ) పెరిగితే ఆనందమే ,
పెరగకుండా నానాటికి దిగజారుతుంటే విషాదమే ,

అమెరికా వారు తమను తాము గుర్తించారు ,
ఎగుమతులకు అధిక ప్రాధాన్యత , 
తమ సరుకు నాణ్యతలు దిగజారనీయరు ,
డాలర్ నానాటికీ అత్యున్నతమైన ఆసనాన్ని అలంకరిస్తోంది 

అడుగడుగునా , అణువణువునా కల్తీలాయె ,
లంచాల మంచాలపై సంచులతో సంసారమాయె ,
నిలబడలేక రూపాయి తల వాల్చేస్తున్నదాయె ,
నిలద్రొక్కుకునే తన ప్రయత్నానికి చేయూతగా ,
మన ప్రభుత్వ చర్యలు ఆ దిశగా లేవాయె ,
తమ పరిపాలనా కాలంలో తాము ,
సంపాదించుకోవాలన్న తపనే ప్రధానమాయే ,
మఱల ఈ ఛాన్సు వచ్చునో రాదో అన్న సందేహమాయె ,
ఎవరెలా వుంటే మనకేం , ఎవరెలా పోతేనేం ?,
మనకు మనం , మనవాళ్ళు బాగుపడితే చాలాయె ,
ఇలాంటి మన ప్రభుత్వ ధోరణితో రూపాయి పాపాయి
పురోగతి లేక మరోగతి లేక అధోగతి అక్కున చేరుతోంది ,

ఎదుటివారి ఘనతని గుర్తించటం మంచిదే ,
దిగుమతులకు మతి లేకుండా పోతోంది
దిగుమతుల పై ప్రత్యేక దృష్టి కూడా ,
మన రూపాయి  పతనానికి  ఓ కారణం ,
అదే క్షణంలో ఎగుమతులపై దృష్టి సారించాలి ,
మన సరుకు ఉత్పత్తిలో నాణ్యతకు పెద్ద పీట వేయాలి ,
యాంత్రికంగా మనకు ఎగుమతులు అధికమౌతాయి ,
దిగుమతుల అవసరం తగ్గిపోతుంది ,
మన రూపాయి పాపాయి  ఆరోగ్యంగా పెరగగలుగుతుంది ,

*****

12 comments:

 1. "లంచాల మంచాలపై సంచులతో సంసారమాయె"

  రూపాయి పాపాయి (nice usage) ...

  ReplyDelete
  Replies
  1. దాదాపు రెండూ ఆకర్షించి , ఆనందాన్ని అందించి , ఆ పై ముంచేవి అనిశ్చిత మానవులకి .

   Delete
 2. దేశమెటుపోయినా మనం అధికారంలో ఉంటే అంతే చాలు :)

  ReplyDelete
  Replies
  1. అదేకదండి అనునిత్యం మనం చూస్తున్నది .

   Delete
 3. ఎంత అద్భుతంగా, వివరణగా చెప్పగలిగారో, అందరూ చదివి అర్దం చేసుకోవల్సిన ( ముఖ్యంగా నా లాంటి కరంట్ అఫేర్స్ తెలీని వారు ) కవిత ఇది, సర్, మీ నుండి ఇంకా ఇలాంటి ప్రాయోజిత కవితలను ఆశిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. ఏదో నాకు తెలిసినది చెప్పానంతే . మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు .

   Delete

 4. లంచాల మంచాలపై సంచులతో సంసారమాయె ! ఈ అంచు పంచు బాగా కుదిరిందండీ !!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అండి .

   Delete
 5. రూపాయిని పాపాయిని బేరీజు వేస్తూ ,చాలా బాగా వ్రాసారు,..రూపాయి కొత్త శక్తిని పుంజుకోవాలని ఆశిద్దాం...

  ReplyDelete
  Replies
  1. ఆశిద్దాం అనుకోవటం అందరి హక్కు ,
   ఆ పై ( ఢిల్లీ )వాడి లుక్ దీనిపై పడితేనే మన రూపాయి పాపాయికి లక్ .

   Delete
  2. ఆశిద్దాం అనుకోవటం అందరి హక్కు ,
   ఆ పై ( ఢిల్లీ )వాడి లుక్ దీనిపై పడితేనే మన రూపాయి పాపాయికి లక్ .

   Delete
 6. What u said was right.. We have to increase the quality in our products.. But that won't happen..... So this is what happening.. Good one...nice usage of words...

  ReplyDelete