మన కోసమైనా........

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్


కనబడే  వృక్షాలు శాశ్వతం కాదు ,
కొండలు , లోయలూ శాశ్వతం కాదు ,
నేనూ శాశ్వతం కాదు ,
నువ్వూ శాశ్వతం కాదు ,
మనమెవ్వరమూ శాశ్వతం కాదు ,
ఏ ప్రాణులు శాశ్వతం కాదు ,
జీవించటమంటే ,
బ్రతికిన నాలుగు రోజులలో ,
పదుగురికి కాకున్నా ,
నలుగురికైనా సాయపడాల , 
దేనికంటే , 

అక్కడ కూడా  స్వార్ధపు ఆగడమే ,
పోయినాక  నలుగురు మొయ్యాలిగా ,
ఆపైనే  ఆనందించాల ,
ఆనక నే చావాల ,
ఆపైన  మొయ్యాల ,
ఆపైన దించాల ,  

ఎక్కడనుంచి వచ్చామో ,
ఎక్కడికి వెళ్తామో , 
తెలియరాని మనం ,
శాశ్వతమైన బంధాలను ,
కోరుకోవటంలో ,
అర్ధమేమున్నది ,
స్వార్ధపరత్వం తప్ప .
     
*****

5 comments:

 1. అదే విష్ణు మాయ.

  ReplyDelete
  Replies
  1. నిజమే, శాశ్వతం కాదని తెలిసీ బంధాలను వీడిపోలేక పోవటం స్వార్దమే... మరి అదే ఈ జీవిత పోరాటమ్లో మనం చేసే ప్రయాణం.కానీ నలుగురికీ సాయపడి నలుగురూ గుర్తుంచుకుంటే మనం శాశ్వతంగా ఉన్నట్లే్.

   Delete
  2. నిజమే, శాశ్వతం కాదని తెలిసీ బంధాలను వీడిపోలేక పోవటం స్వార్దమే... మరి అదే ఈ జీవిత పోరాటమ్లో మనం చేసే ప్రయాణం.కానీ నలుగురికీ సాయపడి నలుగురూ గుర్తుంచుకుంటే మనం శాశ్వతంగా ఉన్నట్లే్.

   Delete
 2. hmmm!! but thappadu kadaa!! Swaardham lenide manishi puttuke ledu!!

  ReplyDelete