కెవ్వు కేక మళ్ళీ మళ్ళీ


                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్

సరుకు సకాలంలో అందకుంటే  షావుకారి గావుకేక ,
పదే పదే  అడిగినా జీతం యివ్వకుంటే నౌకరి పొలికేక  .

అడిగినా యివ్వటం లేదని అబ్బాయిల కాక ,
అడగకున్నా యిచ్చారని అమ్మాయిల  బాకా , 

అడిగిన విధంలో ఆలే ఆనందాన్నందిస్తుంటే  ,
ఆ భర్తకు ఆకాశాన్నంటేలా మానసపు పొలికేక  .

అలిగి పుట్టింటికి వెళ్ళిన పడుచు యిల్లాలు , 
తిరిగి అక్కున చేర్చుకుంటే  ఒకటే కెవ్వు కేక .

డీర్ టైగర్ బారిన పడ్డప్పుడు చావుకేక ,
బోనులో చిక్కుకున్నపులి కేక పెడకేక  .

డెలివరీ ఆలస్యమవుతుంటే కనబోయే పడుచు కేక  ,
డెలివరీ కాగానే పసికందుల  కేరింతల  కెవ్వు  కేక  .

పబ్బుల్లో , క్లబ్బుల్లో , ఆనందాల బ్బుల్లో ,
మందుల విందుల్లో ఆబగా అందాలందుతుంటే ,
పట్టలేని , పగ్గాల్లేని పడుచోళ్ళ చిందుల కేక .

      ***** 

8 comments:

 1. మొత్తంగా కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక

  ReplyDelete
  Replies
  1. కెవ్వు అంటేనే కేక గదండి , ఆ కేకే కేక అదేపనిగ కేక .

   Delete
 2. నాకనిపించెను చెప్పెద
  కేకలలో రకములన్ని ' కెవ్వనిపించన్ '
  " కేక " గ చెప్పారే యిక
  కేకయె కెవ్వనుచు తాను కేకలు వెట్టన్.

  ReplyDelete
  Replies
  1. కడు చక్కగ చెప్పితిరి సుమా !

   Delete
 3. మీ కవిత కేకో కేక:-)

  ReplyDelete
 4. కేక ఎదైనా అవసరార్దమే కదా, బాగుంది.

  ReplyDelete