నీనా నా ? నానీ నా ?

కవితా రచన : శర్మ జీ ఎస్


నేను ప్రధాన మంత్రిని ( నెహ్రూ ) 
నా కూతురు ( ఇందిరా గాంధి )ప్రధాన మంత్రి 

నా కొడుకు  సంజయ్ గాంధి యువజన కాంగ్రెస్ నాయకుడు ( ఇందిర  ) ,
బాగుంటే ( నా మాట వింటే ) ప్రధాన మంత్రిని చేసేదాన్ని ,
అందుకే వాడిని సాంతం అంతం చేశా , స్వంతమన్నది చూడకుండా ,
నా మరో కొడుకును రాజీవ్ గాంధీని  ఆకాశంలో ఎగరద్దన్నా( ఇందిర  )  , 
అది అనిశ్చిత స్థితి , నాతోనే జీవించమన్నా ,
ఇది తాతల బొచ్చ కదా ! మన వారసత్వం కదా !,
అఖిల భారత యువజన కాంగ్రెస్ అద్యక్షుణ్ణి చేశా ,

ఇందిరా గాంధీ హత్యాననంతరం అనుయాయులు ,
అంతవరకు వస్తున్న వారసత్వాన్నే బలపర్చారు ,
ఆ ఫలితమే రాజీవ్ గాంధి ప్రధాన మంత్రి అయ్యాడు ,
పీ వీ నరసింహా రావు శిక్షణలో స్పీచ్  లూ యిచ్చాడు ,

ఆతని (రాజీవ్ గాంధీ )హత్యాననంతరం , కొంత విరామం ,

వారసత్వ పధంలో సోనియా గాంధి ,
వీలు కాక కాంగ్రెస్ అద్యక్ష పదవితో సరి పెట్టుకొంది ,
ఎప్పటికైనా తన కొడుకుని ( రాహుల్ ) ప్రధాన మంత్రిగా చూడాలనుకొంది , 
ఆ దిశలోని పయనమే , ఈ తెలంగాణా ప్రకటన వైనం ,

విజయమ్మా ! ,
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ,
మీ మామగారు విశ్వ ప్రయత్నం చేశారు ,
వీలు కుదరక మీ ఆయన ( వై ఎస్ )కే వదిలేశారు ,
వై ఎస్ ని ప్రజల మధ్యకు పంపాను , 
మొత్తానికి ముఖ్యమంత్రిని ( నే  )చేశా ,
నా మాట వినబట్టి , నా బాటలో రాబట్టి ,
నమ్మినట్లే కనపడ్డాడు , నన్నూ మోసం చేశాడు ,
చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ,
ఆ చట్టాన్నే తన చట్రంలో మట్టం చేశాడు ,
ఆంధ్ర ప్రదేశ్ ఆస్తులన్నిటినీ కాజేశాడు ,
ఫలితంగా  తానే ఆనవాలు లేకుండా పోయాడు ,

ఆ వారసత్వ ధోరణిలో హడావుడిగా అడుగులేశాడు నీ జగన్ ,
చిలకకు చెప్పినట్టు చెప్పాను అంత తొందర వద్దు , 
ఎదర బ్రతుకంతా చిందర వందర అని ,
విన్నాడా ? వినలేదు , ఆ తండ్రి పేరనే ఓ పార్టీ స్థాపించాడు ,
నువ్వూ అందుకు మొగ్గావు , సానుభూతితో నెగ్గావు ,
ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని  ,
నన్ను నువ్వు మఱచావు కదా ! ,
ఇప్పటికైనా  తెలిసిందా విజయమ్మా , 
నేనేమిటొ , నా వంశమేమిటో ?
విజయమ్మా ! ,
నాతో కలిసిరా , నీతోనే వుంటా ,
ఆ కేంద్రం నా కొడుకుకి ,
ఈ ఆంధ్ర నీ కొడుకుకి ,
అందినంత అందుకో ,
జుఱ్ఱుకొన్నంత జుఱ్ఱుకో ,
ప్రజలు వెఱ్ఱి  బాగులోళ్ళు ,
ఆ విషయం మా అత్త కాలం నుంచే ఋజువైంది ,
మీ ఆయన ఈ మధ్యనే మరో మారు ఋజువు చేశాడులే , 
అలా దారికి రా దండం పెట్టు ,
అందుకో నా అభయ హస్తం ,
ఇదేలే మన ( కు ) సమ న్యాయం  .

*******
చిన్న విన్నపం : 

నాటి నుంచి  ,
ఇదే కదా మన స్వాతంత్ర్యం   
నేటికీ ఇదేలే  మన స్వాతంత్ర్యం ,
ఇది ఆ ఢిల్లీ పెద్దల కుతంత్రం . 


            ******

6 comments:

 1. నాకిది నీకది అలవాటేగా

  ReplyDelete
  Replies
  1. లెస్స బలికితిరి .

   Delete
 2. పేరుకి ప్రజాస్వామ్యం,..నడుస్తున్నది రాచరికం,...షరా మామూలే..

  ReplyDelete
  Replies
  1. ఆ పెద్దలకు తంత్రం
   మనకేమో కుతంత్రం

   Delete
 3. Replies
  1. వాస్తవం కదా మరి .

   Delete