చరిత్ర హీనులు

                                                                                                                  వచన కవితా రచన : శర్మ జీ ఎస్  

సామాన్య ప్రజానికానికి ,
సంవత్సర పొడవునా పండుగలే . 

రాజకీయ నాయకులకు ,
రెండే రెండు పండుగలు ,
5 ఏళ్ళకొక మారు వచ్చే ఎన్నికలు ,
ఆకస్మికంగా ఆ 5 ఏళ్ళలో వచ్చే ,
మధ్యంతర ఎన్నికలూ ,
ఓ వైపు డబ్బులు దండగ అవుతున్నా ,
ఆనందాన్ని అందిస్తాయన్న ,
ఎన్ని కలల పండుగలు .

పెదవి కాంక్షించి ,
రావణాసురుడు రాలిపోయాడు ,
రామాయణం చాటింపు వేస్తోందీనాటికీ .

పదవినాశించి దుర్యోధనుడు ,
దుష్ట చతుష్టయంతో కలిశాడు ,
దురద కంటే కండూతి కడు ఘోరమని , 
మహాభారతం చాటింపు వేస్తోందీనాటికీ .

ఈ యిరువురూ స్వార్ధంతో ,
సర్వనాశనమై పోయారు ,
ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం ,
తెలిసినా అటే మొగ్గు చూపుతున్నారంటే ,
నేటి రాజకీయ నాయకులూ ,
వీళ్ళూ చరిత్ర హీనులుగా మిగిలిపోవలసిందే కదా !

*****

11 comments:

 1. మాములుగా నేను చాలా బేవార్సు
  చేస్తున్నా చిన్న చితక బోఫోర్సు
  రాజకీయం అన్నదే దీని పైకోర్సు
  నాప్రతిభకి ప్రజలే చేసెను సిఫార్సు
  అయిపొయిందిదే నేటి మ్యానర్సు

  ReplyDelete
  Replies
  1. సూక్ష్మంలో మోక్షం చూపించేశావుగా .

   Delete
 2. చిన్న సవరణ
  రోజూ పండగ ఐదేళ్ళకో సారి పెద్ద పండగ, మిత్రమా.
  దండగెపుడూ లేదు, అదో పెట్టుబడి లో ఆట మాత్రమే

  ReplyDelete
  Replies
  1. ఆ ఆట ఆ పెద్దోళ్ళకేనండి , మన లాంటి మధ్య తరగతి ప్రజానీకానికి మాత్రం కాదండి .

   Delete
 3. Charithra thelini vàallu leru. Ayina evaru dàaninunchi emi nerchukoru. Ede ee kaliyuga dharmam.... Anduke Edi kaliyugam....

  ReplyDelete
  Replies
  1. ఒక్క ఈ యుగమే కాదు ,యుగ యుగానికి యిది వృధ్ధి పధంలో వున్నది

   Delete
 4. Charithra thelini vàallu leru. Ayina evaru dàaninunchi emi nerchukoru. Ede ee kaliyuga dharmam.... Anduke Edi kaliyugam....

  ReplyDelete
 5. శర్మ గారూ, ఈ పండగ మొదట్లో.., కొంతమందికి మాత్రమే ఉండేది ఇప్పుడూ మనమూ ఎందుకు చేసుకోకూడదు అని అందరూ బయలు దేరారు, అందరికీ నప్పుతుంది. చరిత్రనే మార్చిన హీనులు ఎక్కువగా ఉన్నారు చరిత్రలో.

  ReplyDelete
  Replies
  1. చరిత్రనే మార్చిన హీనులు వృధ్ధి చెందుతున్నారు .

   Delete
 6. చరిత్రహీనుల చేతలకు బలౌతున్నది సామాన్యులే కదా!

  ReplyDelete
  Replies
  1. ఈ మధ్య కొంతమంది మాన్యులు కూడా సామాన్యులనే బలి చేస్తున్నారు ఏదో విధంగా .

   Delete