గృహమే కదా స్వర్గసీమ .

                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్                       
                           ( జూలై మాలిక యాగ్రెగాటర్లో ప్రచురించిన పెండెం గారి చిత్రానికి నా చిరు స్పందన ).                                 


నాడు ,
జనాభా అల్పం ,
స్వలాభాలు చవి చూశాం ,
నా యింటి ముంగిలి వాకిలి నాది ,
ఆ దారి నన్ను దాటి పో(లే)దు కదా !
నాదనుకొన్నా గనుకనే ,
కళ్ళాపు చల్లి , కళ్ళకు నిండుగా ,
ముగ్గుల అలంకరణలు చేసి ,
ముస్తాబు చేశా నా కన్నపిల్లకు మల్లె .

నేడు ,
జనాభా అధికం ,
గలభాలు పెరిగాయి ,
పల్లెలు కాస్తా పట్టణాలై పోయాయి
రూపు రేఖలు , ఆకార ఆచార వ్యవహారాలూ ,
అన్నీ మెల్ల మెల్లగ మారిపోతున్నాయి ,
ఉదయాన్నే నిద్ర లేచే పనే లేదు ,
లేవలేదేమిటని అడిగే వాళ్ళూ లేరు ,
వాళ్ళు పడే శ్రమను చూస్తున్నారు గనుక ,

నాడు కళ్ళు చెదిరేలా ముగ్గులలో ముగ్ధలు ,
నేడు వళ్ళు మరిచేలా నిదురలో ఆ ముగ్ధలే , 

ఆ నాడు అలా వుండటానికి ,
ఈ నాడు యిలా వుండటానికి ,
కారణం ఆ యా పరిసరాలు , పరిస్థితులే తప్ప ,
వేరేవీ కావు అన్నది గ్రహించి మసులుకొంటే చాలు ,
అపుడే  కదా  !
గృహమే  స్వర్గసీమ .

******

13 comments:

 1. 1973 : 5AM ఫోటో కనుక మనం పరిశీలిస్తే , ఇంటి ముందు ప్యాడతో కల్లాపి కూడా చల్లేవాళ్ళు 1993 లో అది మిస్సింగ్
  2013 లో ముగ్గే మిస్సింగ్ .......

  ఇదే చరిత్ర కూర్పు
  మనలో వచ్చిన మార్పు
  ఇమడటానికి కావాలి ఓర్పు

  మీరూ అదే చెప్పారు కాకపోతే నేను కొంచెం విడమరచి చెప్పినా ...

  ReplyDelete
  Replies
  1. ఈ సృష్టిలో మార్పే శాశ్వతం పంచభూతాలతో పాటు .

   Delete
 2. ఇంకా మార్పులొస్తాయ్! మీరూ చూస్తారు!! మీకింకా వయసుందిగా. సరిపెట్టుకోండి :)

  ReplyDelete
  Replies
  1. అవకాశం వస్తే చూస్తాను మీరన్నట్లుగా .

   Delete
 3. శర్మ గారూ, పోస్ట్ర్ బాగుంది, మార్పు అనివార్యం. కానీ మార్పు వల్లా మేలు జరిగితే మంచిదే. ఆడవారి జీవితాలలో మంచి మార్పు రావాలని ఆశిస్తూ..

  ReplyDelete
  Replies
  1. స్వాతంత్రం పగలు వచ్చిందా ? అర్ధరాత్రి వచ్చిందా అన్నది కాదు ప్రధానం . అది మనకు యిచ్చినవాళ్ళకు అక్కడ పగలే . అది మఱచి మనం అర్ధరాత్రి ఆడది నడిబజారులో తిరిగినపుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అంటున్నారు కొంతమంది మహానుభావులు .
   అర్ధరాత్రి ఆడది నడిబజారులో తిరిగి ఏం చెయ్యాలి ? పట్టపగలు తను చేయవలసిన పనులకు అడ్డంకులు కలుగజేయకుండా తోటి మానవుడు సహకరిస్తే చాలు , నిజమైన స్వాతంత్ర్యం ఆ ఆడవాళ్ళకే కాదు , మనందరకు వచ్చినట్లే . సరైన మార్పు మనుషుల మనసుల్లో రావాలి , శాశ్వతంగా వుండిపోవాలి . ఆ దిశగా అడుగులు వేస్తే చాలు , వెంటనే కాకపోయినా , కొంతకాలానికైనా అటువంటి స్నేహపూర్వక స్వాతంత్ర్యం చూడగలం .

   Delete
 4. ( అర్ధరాత్రి ఆడది నడిబజారులో తిరిగి ఏం చెయ్యాలి ? పట్టపగలు తను చేయవలసిన పనులకు అడ్డంకులు కలుగజేయకుండా తోటి మానవుడు సహకరిస్తే చాలు)..నిజం చెప్పారు,..పట్టపగలు స్వాతంత్ర్యం వస్తే అర్ధరాత్తి వచ్చినట్లే..మంచి విషయాలు వ్రాసారు..

  ReplyDelete
  Replies
  1. అవునమ్మాయ్ ఆ స్వాతంత్ర్యమే మనకు కావాలి .

   Delete
 5. Umm baavundi!!! Maarpu lekapothe jeevithame ledu. Mee generatiom lo office ninchi 6 kalla intikochevaallu. eppudu morning 6 daaka panicheathunnaru, gents kuda... Anduke evannni....good one!!!

  ReplyDelete
 6. Umm baavundi!!! Maarpu lekapothe jeevithame ledu. Mee generatiom lo office ninchi 6 kalla intikochevaallu. eppudu morning 6 daaka panicheathunnaru, gents kuda... Anduke evannni....good one!!!

  ReplyDelete