వలసల వలలు

                                                          
                                                                                                          రచన : శర్మ జీ ఎస్

ఎన్నికలొస్తున్నాయంటే , సమాజం అంతటా హడావుడే హడావుడి , సందడే సందడి . సహజంగానే ఒక పార్టీ లోంచి , యింకో పార్టీలోకి జంపు జలానీలకు కొదవే లేదాయె .
అందులో నేడు సంఖ్య 4 అంకెలకు కూడా చేరుకొనే అవకాశాలు అత్యధికంగా వున్నాయి .
అందుకని అధికార కాంగ్రెస్ పార్టీని , పదవులను వదలకుండా మిగిలి వున్నవాళ్ళను వాళ్ళ స్వలాభాలకొరకు పదోన్నతులు కల్పించి ,( కాకుంటే పార్టీ ప్రయోజనాల కొరకు అంటారులెండి ), మారుమూల పల్లెల్లో తమ కొత్త కొత్త ప్యాకేజీల ప్రలోభాలతో , తమ ప్రతిభను చాటమని , ఒక్కరుగా వెళ్ళవద్దని , మూకుంంఅడిగా మిగిలి వున్న కార్యకర్తలను బస్సు యాత్రలు చేయమని ,ఎవరి మీదైనా ఎవరైనా బుస్సుమంటే , ఈ బస్సు మిమ్మల్ని కాపాడుతుందని ప్రబోధ చేసి పంపారు .
రాష్ట్ర విభజన తీరుపై అసంతృప్తితో వున్న జనం దెబ్బకు , కార్యకర్తలు కూడా తిరిగి అధికార కాంగ్రెస్ తరఫున నిలబడే నాయకుడిగా కనుపించుటలేదు .
అధికార కాంగ్రెస్ " నాయకులు వాంటెడ్ " అన్న కాలం ని ఆశించవలసిన పరిస్థితి కనపడ్తున్నది .
ఓ నాడు కాంగ్రెస్ అంటే అతి పెద్ద జాతీయ పార్టీగా పేరుగాంచినది .
నేడు కాంగ్రెస్ అంటే భూస్థాపితమయ్యే పార్టీగా ప్రచారంలో వున్నది . ఇది నిజమే .
కనుక పలువురు కాంగ్రెస్ నాయకులు వలసల బాట పట్టరు .  
వైపు అధికార పార్టీ రాజకీయనాయకులు కొంతమంది  జిల్లాలో నిలబడదామని కొందరు .
ఇంకొందరు రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేస్తున్నా , మనం ఆపలేకపోయాం , కనుక యిప్పుడు అధికార పార్టి తరఫున మనం ఎన్నికలలో నిలబడితే , చెప్పుదెబ్బలు తినవలసి వస్తుంది , ప్రజల చేత , అహంకారానికి గురయ్యే బదులు , అప్పోజిషన్ పార్టీ తీర్ధం పుచ్చుకొని కండువా కప్పేసుకొంటే , వాళ్ళే ఎక్కడో చోట ( మనం అడిగిన స్థానం యివ్వకున్నాఎలక్షన్లలో నిలబెడ్తారు . మనల్ని చూసి ఓట్లు వేస్తారన్న నమ్మకం ఎటూ లేదు , పార్టీ సింబల్ చూసి వేస్తారు గనుక , గెలిచే అవకాశాలు చాలావరకు ఉంటాయి గనుక . కనుక హ్యాపీగా అందులో చేరి 5 ఏళ్ళు ఖాళీగా లేకుండా కాలం గడిపామంటే సరిపోతుందనుకొనే స్వార్ధ రాజకీయనాయకులు .
సహజంగా వున్నవాడి పక్కన చేరాలనుకొనే వాళ్ళని మనం తఱచూ చూస్తుంటాం సమాజంలో . బాటలోనే అన్నిపార్టీల కార్యకర్తలు , రాజకీయ నాయకులు వున్న పార్టీనుంచి , అవతల పార్టీలోకి జంపు చేస్తున్నారు . ఇలా జంపు చేసేవాళ్ళని గొప్పగా చిత్రీకరిస్తుంటారు కొత్తగా  చేర్చుకొనే ఆ పార్టీలు . వీళ్ళు చేరకున్నా , వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను ఎన్నికల బరిలో నిలుపగల సత్తా వున్నా , కొత్తగా తమ పార్టీలలోకి చేరే వాళ్ళకు కోంచెం ప్రాముఖ్యత అదికంగానే చూపుతుంటారు .
ఇలా చేరిన వాళ్ళని ( అంతకు ముందున్న పార్టీలో ఏమీ చేయలేకపోయిన వాళ్ళని ) ఎన్నికలలో నిలబెడ్తే , తమ పార్టీ ఓడిపోతుందన్న ఆలోచనే మాత్రం కలగకపోవటం ఆశ్ఛర్యంగా వుంటుంది .
అంతే కాకుండా ఓడినా , గెల్చినా తమనే అంటిపెట్టుకున్న పార్టీ కార్యకర్తలకు , సభ్యులకు సీట్లు యివ్వకపోతే , తిరుగుబాటు తత్వం పెరుగుతుందేమోనన్న ఆలోచన చేయటం ఎంతైనా ,మంచిది .
ఎంతమంది వచ్చి చేరితే అంతమందిని చేర్చుకోవటానికి , అది బందీలదొడ్డీ కాదు , వారు బందీలు కారు అన్నది ఎఱుకలో వుంచుకోవటం అన్ని పార్టీలకు అన్ని విధాలా మంచిది .
జనం విపరీతంగా మన సమావేశాలకు వస్తున్నారు , మనకిక తిరుగులేదు అనుకోవటం , జనసంతోషం కొఱకు , అధికారం కోసం , ఆవేశంలో ఆలోచించకుండా బాసలు చేయటం కూడా అంత మంచిది కాదు . క్షణం గడిస్తే చాలు అనుకోవటం తప్పు . ఆచరణయోగ్యమైన బాసలు ఎల్లప్పుడూ మంచిది .

" వచ్చే వారందరికీ మా తలుపులు తీసే వున్నాయని చెప్పుకోవటం యిబ్బందులకు గురి చేస్తుందన్నది గుర్తుంచుకోవాలి వలసదారుల విషయంలో సుమా ! .


                                                                           ********

"జయ" హో ఉగాది


                                                                                                                             వ్యాసరచన : శర్మ జీ ఎస్                                                                                                                                                                  

తెలుగు వారీ నూతన సంవత్సరాన్ని ఉగాది అని అంటారు . ఇటువంటి ఈ ఉగాదులకు మన పూర్వీకులు వాళ్ళ్ అనుభవాన్ని జోడించి  , మనకు లాగే పేర్లు పెట్టారు

వాటిని  60 పేర్లుగా నిర్ణయించారు మన ముందు తరాలవారు . ఆ 60 పూర్తి కాగానే మఱల ఆ  పేర్లే తిరిగి వస్తుంటాయిట .

అయితే ఒక సందేహం మన దేహంలోను , మన మనసుల్లోను పీడిస్తుండవచ్చు . ఇంక పేర్లు లేవా ?  మళ్ళీ ఆ పేర్లే ఎందుకు పెట్టారు ? మనుషులకు లాగా కాలానుగుణంగా కొత్త కొత్త పేర్లు పెట్టుకోవచ్చు గదా అని .

ఆ  ఉగాదులు మన మనుషుల్లాంటివి కాదన్నది మనం గ్రహించాలి .  మనుషులకు లాగా వాటికీ పునర్జన్మ ఉంటుంది .

బాగా ఆలోచించి చూస్తే అవి మనలాంటి మాములు పేర్లు కాదు . ఆ పేర్లతో ఆ సంవత్సరం మనకు ఏమేమి అందించబోతుందో తెలియచేసే విషయం యిమిడి ఉంటుంది ( అంటే మన భవిష్యత్తు ) అన్నమాట  . ఈ ఉగాదులు కాలచక్రంతో ముడిపడి ఉండటమే అందుకు మూల కారణం .

ఇపుడు రాబోతున్న ఈ ఉగాది పేరు " జయ " , అంటే ఆడవారి పేరు కలిగి ఉండటం , ఈ ' జయ ' అన్న పదం ఒక్క ఆడవాళ్ళకే కాకుండా ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికీ సంబంధించినది అగుట వలన , అందరికీ సంబంధించినదవటం వలన జయం అధికంగా వుండవచ్చనుకొందాం .

మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి , ఈ మానవుల జీవనంలో సుఖసంతోషాలు కావాలంటే యిలా కొన్నింటిని  ఆచారాలుగా  అలవాటు చేశారు మన పూర్వీకులు వాళ్ళ అనుభవసారాన్ని జోడించి .
సమాజంలో అందరూ మృష్ఠాన్న బ్భోజనం ఆరగించలేరు . అలా ఆరగించలేని ఆ అభాగ్యుల కొఱకు ఈ పండుగలను సృష్టించారు . కనీసం ఆ పండగ నాడైనా , ఆ పండగ పేరు చెప్పుకొని ఆ రోజైనా కడుపునిండా తృప్తిగా భోజనం చేస్తాడని , సంతోషంగా తనవాళ్ళతో ఆ రోజుని ఆనందంగా గడుపుతాడని .

వాస్తవానికి ధనికులకి , పెద్దలకి నిత్యం పండుగే . అయితే సమాజ శ్రేయస్సు కోరి ఈ ఆచారాలని అలవరచుకొని , కొనసాగిద్తున్నారు . కాలక్రమేణా ఈ ఆచారాలను వాళ్ళకనుగుణంగా మలుచుకొని జీవనం సాగిస్తున్నారు .

ఏది ఏమైనా ఈ " జయ " నామ సంవత్సర ఆరంభం నాడు , అందరికి శుభాకాంక్షలు .

ఇలాగే ప్రతి ఉగాది ఒక్కో పేరుతో మనకు వచ్చి మనకేమి యివ్వబోతుందో సూచన ప్రాయంగా ముందే తెలియ
చేస్తుంటుంది .

             
                                                                       *   *   *   * 

పొత్తులా ? ఎత్తులా ?

                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్

పొత్తులు ఈ పదం ఒక్క ఎన్నికల వేళ మాత్రమే హల్ చల్ చేస్తుంటుంది అన్ని పార్టీల నడుమ .

ఏ పార్టీ ఏ పార్టితో పొత్తు పెట్టుకొంటుందో ఎవరి కెఱుక కాదు .
ఎందుకంటే తను ప్రజాసేవ చేయాలన్న సదుద్దేశ్యం ఏ మాత్రం వుండదు ఈ పొత్తుల విషయంలో . ఎలాగైనా తామూ స్వతహాగా కాకుండా , మఱో పార్టీతో జత కూడి , తన వెతను బయటపడనీయకుండా , వాళ్ళతో పాటు తన పార్టీ నేతలలో కొద్దిమందైనా ఆ 5 ఏళ్ళ పదవిని అనుభవించాలన్నదే పొత్తుల ప్రధమ ప్రధాన ఎజెండా .

వాస్తవానికి చూస్తే వాళ్ళ ఎజెండాలు రెండు పూర్తిగా కలువవు . కానీ వాళ్ళు కలిసిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటారు . ఇది చిన్నా , చితక పార్టీల పొత్తుల ఎత్తుగడలు .
ఇక పెద్ద పెద్ద జాతీయ పార్టీలు కూడా ఈ చిన్నా , చితక , ప్రాంతీయ పార్టీలను చేర్చుకోవటంలో ప్రధాన ఉద్దేశ్యం తాము ఎలాగైనా ఆ ప్రధాన స్థానాన్ని అధిరోహించాలన్నదే వారి తాపత్రయం .
అవకాశం ఉన్నంతవఱకు రాష్ట్రాలలోని ప్రధాన స్థానాలని కూడా అధిరోహించాలన్నదే అంతిమ లక్ష్యంగా అగపడ్తుంది .
తాము గెలిచేటందులకు ఎటువంటి వారినైనా ( నేరచరితులను కూడా ) తమ అభ్యర్ధిగా నిలబెట్టటానికి గాని  , పొత్తులు పెట్టుకోవటానికి గాని  వెనుకాడటం లేదు .

ఇలాంటి పొత్తులు తమకో పదవి కావాలి , ఆ పదవి కొఱకు అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి ఈ ఎన్నికల సమయంలో అన్నివేళలా తమ సంసిధ్ధతను సిగ్గుపడకుండా చాటుకొంటున్నారు .

ఓ వైపు , నువ్వు నాకొద్దు మొఱ్ఱో అంటున్నా , సిగ్గు, ఎగ్గూ లేకుండా , ఆ పార్టీల వైపే మొగ్గు చూపుతూ , ఇంకా మా తలుపులు తీసే వుంచాము మీ రాకకై అంటూ చెప్తున్నారంటే ఆ పార్టీ ఎంత అధోగతిలో ఉందో అర్ధమవుతూనే వున్నది .

ప్రతి రోజు బుల్లితెరలొ ప్రతి క్షణం చూస్తూనే వున్నాం , వింటూనే వున్నాం .
ఎక్కడ చూసినా , ఏ నాయకుడు ఈ ఎన్నికల వేళ వచ్చి ఆప్యాంగా (సిగ్గూ శరాన్ని వదలి )పలుకరిస్తూ , తమకు , తమ పార్టీ / మిత్రపక్షాల అభ్యర్ధులలో ఎవరికైనా వేసి తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని మఱీ మఱీ వేడుకొంటాడు అనటం కంటే ప్రాధేయ పడ్తుంటాడు . ఆ తర్వాత మఱి మా మొఖమే చూడడు , తన మొఖం కూడా చూపించడు . అసలు మా నేతలు ఎవరో మాకు తెలియదు అంటుంటారు . ఈ సారి రానీయండి , ఆ నాయకులను అడిగేస్తాం , కడిగేస్తాం , అటువంటి వారికి మేం మా వోట్లు వేయం అని .
ఇక్కడొక ముఖ్య విషయాన్ని మనం మఱచిపోయాం . అదేమిటంటే మనం అలా అడగలేదని వాళ్ళు ( మనచే ఎన్నుకొనబడిన ప్రజానాయకులు ) చేయకుండా వుండలేదు . వాళ్ళ సహజ స్వభావమే చేయకుండా వుండటానికి ప్రధాన కారణం . ఇది మనం బాగా తెలుసుకొని మసలాలి సుమా ! .

మాకు కావలసినవన్నీ అడుగుతాము , మాకు అలా సేవ చేసే నాయకుడికే మా విలువైన వోతుని వేస్తాం అంటూ కూడా ప్రతి రోజు వింతున్నాము , చూస్తున్నాము .

మంచిదే . కానీ సేవ చేసే నాయకుడు ఎవరన్నది ఎలా గుర్తించటం ? ఇది ఓ శేషప్రశ్నగా ఈ అశేష జనవాహిని మదిలో మిగిలిపోయింది .

వాస్తవానికి మన భారతదేశ జనాభా వెరశి 84 కోట్లుంటే , వీరిలో అత్యధికంగా వోటు హక్కు వినియోగించుకొనే వారిసంఖ్య 64 కోట్లు వరకు ఉందనుకొందాం .
ఈ 64 కోట్ల మందిలో షుమారుగా 30 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోకుండా వుండిపోతున్నారు .
మిగిలిన ఆ 34 కోట్ల ఓటర్లు , భారతదేశాన్ని పంచుకుంటున్న పార్టీలకు ఓట్లు వేస్తారు . అలా పంచుకున్న ( ఉన్న ప్రముఖ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా కొంతమందిని ఆకర్షణియమైన ఎజెండాలతొ ఎన్నికల బరిలోనికి దించుతారు . ఆ ఆకర్షణీయ ఎజండాలను చూసి కొంతమంది మంచి ఓటర్లు ప్రధాన పార్టీలకు ఓట్లు వేయకుండా , వీళ్ళకు వేస్తుంటారు . వాళ్ళు గెలిచేదీ లేదు , సేవ చేసేదీ లేదు ) పార్టీలలో 40 శాతం వోట్లు వచ్చి గెలిచిన పార్టీల్ ఈ 84 / 64 కోట్ల జనాభాను పరిపాలిస్తున్నారు .
ఇది మన వ్యవస్థ లోని ప్రధాన లోపం .

ఎన్నికల వేళల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పార్టీలు జన్మ తీసుకొంటాయి కొంగొత్త ఎజెండాలతో . ఆ పార్టీలేవో మనకు చేసేస్తాయని మనమనుకొంటే పొఱపడ్డట్లే .

శ్రీ శ్రీ గారన్నట్లు
" ఎవరో వస్తారని ,
ఎడో చేస్తారని ,
ఎదురుచూసి మోసపోకుమా ,
నిజం మఱచి నిదుర పోకుమా "
అన్నది సత్యమన్నది మనం మఱువరాదు .
భూమికోసం చిత్రానికి 1974 సంవత్సరంలో వ్రాసిన పాట యిది . 40 ఏళ్ళ క్రితమే నేటి చరిత్రను ఊహించి వ్రాసిన సమాజ సత్యం .

ఈ నడుమ ఆరడుగుల బుల్లెట్ గా పేరు కంచిన చలనచిత్ర నటుడు అయిన పవన్ కళ్యాణ్ చే ఊపిరి పోసుకుని , ఆవిర్భవించిన  " జనసేన " పార్టీ ప్రసంగం ఓ సగటు మానవుడి ఆవేదన ( అధికార ప్రభుత్వంపై ) ప్రశంసనీయమైనది . " కాంగ్రెస్ హటావో , దేస్ బచావో " అని ఆ సభలో గర్జించారు .

ఇందు కొరకైతే ఆయన జనసేన పార్టీ పెట్టవలసిన పనే లేదు . ఎందుకంటే , కాంగ్రెస్ సరైన విధానాలు లేకుండా అడ్డగోలుగా ( స్వార్ధపూరిత పొత్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ) రాష్ట్రవిభజన ( లైవ్ టెలికాష్టులను నిలిపివేసి చేసిన ) తీరు ఆ ఫార్టీని భూస్థాపితానికి దారితీసింది భారతప్రజల మనసుల్లో అప్పటికే .

అయితే ఈ ఎన్నికలకు కాకున్నా వచ్చే ఎన్నికలకైనా ఈయన ప్రజలకు కావలసిన న్యాయం చేస్తాడు అనుకుంటే , ఇదేంటి ఉన్నట్లుండి నరేంద్రమోడీని కలవటానికి అహమ్మదాబాద్ లో 3 రోజులుండి ఆయనను భేటీ అయి రిటర్న్ వచ్చి , ఆయనకు మద్దతు పలకటం ప్రజలను బాధ కలిగించి , ఆలోచింపచేసింది .

ఎవరు ఎవరికి మద్దతిస్తానన్నా సరేనంటుంది ఏ పార్టీ అయినా . అటువంటిది ఇక ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ మద్దతిస్తానంటే ఎందుకొప్పుకోరు . ఆయనకున్న అభిమాన యువ పవన్సేన కూడా వాళ్ళ విజయానికి దోహదడ్తుంది  కదా!

పొత్తులతో సమాజ సేవ చేసే అవకాశం లభ్యం కాదన్నది మన నాయకులెప్పటికైనా గుర్తుంచుకోవలసిందే . ఎందుకంటే నిజ్జంగా సమాజ సేవ చేయాలనుకున్న కొత్త పార్టీల ఎజెండా ఎల్లప్పుడూ , మామూలు పార్టీల వాళ్ళ ఎజెండాలకు భిన్నంగానే వుంటుంది . వాళ్ళతో పొత్తులు కొత్తగా వచ్చిన పార్టీల వాళ్ళను సమాజ సేవ చేయనీయకుండా యిబ్బందులకు గురి చేస్తాయన్నది ఆ కొత్త పార్టీలు ( చక్కగా సమాజ సేవ చేయాలనుకున్న పార్టీలు ) గుర్తుంచుకొని వాటిని దూరంగా వుంచి , వాటికి దూరంగా వుండి , మెల మెల్లగా సమాజ సేవ మొదలు పెడ్తూ , నేరచరితులను , స్వార్ధపరులను దరి చేర్చుకోకుండా చూడగలిగిన నాడు ఆ పార్టీ ఆవిర్భావానికి అసలు సిసలు అర్ధం అగపడ్తుంది .

ఈ ఆరడుగుల బుల్లెట్ " ఇజం " అనే పుస్తకాన్ని తన మిత్రగణంతో వ్రాయటం అభినందించవలసినదే . ఆ పుస్తకం  27/03/2014  ఆవిష్కరించటం జరిగింది .
దీనిని అతి తక్కువ వెలకే విక్రయించటం అందరికీ అందాలనే తాపత్రయం .
ఐతే ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఆవిష్కరిస్తున్న సమయంలో తెలుగులో ముద్రించి అందరికీ అందిస్తే , ఎంతగానో సమాజంలోని వాళ్ళ మనసులను చేరుకొని శ్రేయస్సు .
అలాంటిది తెలుగువారి నాడిలో ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ కొంచెం బాగా లేదని భావన .
వీలున్నంత త్వరగా , 10 / 15 రోజులలో తెలుగులో తర్జుమా అవుతుందని తెలియటం కొంచెం ఊరట కలిగిస్తోంది .
ఈ ప్రపంచంలో ప్రతివానికీ ఏదో చేసేయాలని అనిపిస్తుంటుంది . అయితే అందరికీ సాధ్యం కాదు . కొంతమందికే అది సాధ్యమవుతుంది . అది మన జనసేన అయిన పవన్ సేనకే సాధ్యపడ్తుందని ఆశిద్దాం .

ఆవేశపూరిత , జనాలకుపయోగకరమైన ఉపన్యాసాలు ఎవరు చేసినా జనాలకందరికీ వినసొంపుగనే  వుంటుంది కదా ! .
అవి ఆచరణలోకి వచ్చిననాడు కదా ! .అందరూ సంతోషించగలిగేదే , అభినందించేది  .

ఇరు ప్రాంతాల ( తెలుగోళ్ళే కాబట్టి ) వాళ్ళకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఊర్కోను అని ఉద్ఘాటించారు . ఇది చాలా చక్కటి ఆలోచన . అన్యాయాన్ని , అక్రమాల్ని సహించలేకపోవటమే ఆతని అంతరంగ ఘోష అని ఆతని వైజాగ్ బహిరంగసభలో వెల్లడి చేశారు .                                                                    *******

వి(జయ)భజనా ? భజనా ?

                                                                                                          రచన : శర్మ జీ ఎస్ 

కేంద్రం ( అధికార పార్టీ )ఆంధ్రప్రదేశ్ ని రెండు రాష్ట్రాలుగా విభజించాలని గత 60 యేళ్ళుగా జరుపుతున్న తెలంగాణా ప్రజల ఆరాటాల పోరాటాలని యిన్నేళ్ళ తర్వాత పరిగణలోనికి తీసుకొని ,యిస్తున్నామని ప్రకటించేసింది .
అయితే ప్రకటన సీమాంధ్ర ప్రజలకు యింపుగా లేక నిరవధిక సమ్మెలు చేశారు . ప్రయోజనం శూన్యం .
రెండు రాష్ట్రాలు రకంగా చేశారు ? దానికి విధానమేమిటని ప్రశ్నించినా జవాబు చెప్పలేకపోయింది . ఫలితంగా అధికార కాంగ్రెస్  రాష్ట్ర విభజనను , తన భజన సంఘ సభ్యుల సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా , గుట్టుగా లైవ్ టెలికాష్టుని కూడా ఆపి , తోటి అప్పోజిషన్ పార్టి సహకారంతో ఆమోదముద్ర వేసేసింది .
గత పదేళ్ళ నుంచి మేము అధికారంలోకి వస్తే యిస్తామంటుండటం వలన , అదికార పార్టీకి రాబోయే ఎన్నికల టర్మ్ లో వాళ్ళు అధికారం లోకి మఱల వస్తామన్న నమ్మకం వాళ్ళకు లేకపోవటం వలన , యిప్పుడు తాము తెలంగాణా రాష్ట్రం యీయకపోతే ,రాబోయే టర్మ్ లో అప్పోజిషన్ పార్టీ అధికారం లోకి వచ్చి క్రెడిట్ అది కొట్టేసుకుపోతుందేమోనన్న భయం వైపు , కనీసం అప్పోజిషన్లో కూర్చోవటానికైనా కొన్ని సీట్లు కావాలిగదా! , సీట్లను నూతన తెలంగాణా రాష్ట్రం ద్వారా నైనా రాబట్టుకోవచ్చు ( ఇప్పుడు యిచ్చేస్తే ) అన్న స్వార్ధపూరిత , కుటిల ఆలోచనలతో , అదీ అప్పోజిషన్ పార్టీ నడిపిన అత్యంత నాటకీయ పరిణామాల నడుమ యివ్వటం జరిగింది
అడుగడుగునా అన్ని పార్టీల ఆమోదంతోనే యిచ్చామని యిప్పుడు చెప్తున్నది అధికార కాంగ్రెస్ .
దానికి అన్ని పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి . ఇవ్వటం తప్పని అనటం లేదు . అయితే యిచ్చేదాని విధానమేమిటీ ?
ఒక ఉమ్మడి కుటుంబం లోని వారు విడిపోవాలంటేనే ఎన్నో రక రకాలుగా ఆలోచించి ఒక్కరికీ అన్యాయం జరుగకూడదని అనేక పర్యాయములు ఆలోచించి , మేధావుల ( పెద్దల / పంచాయతీల  ) సలహాల మేరకు విభజన జరపటం జరుగుతుంది .
అటువంటిది ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించటానికి ఎంత కృషి చేయాలో అధికారపక్షమైన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి తెలియలేదేమిటని యావత్ ప్రజానీకం బిత్తరపోయింది . అదే అందరి ఆవేదన .
రెండుగా విభజించి యిప్పుడు ఏవేవి ఎలా పంచాలి అని ఆలోచించటం వాళ్ళ అధమస్తపు పాలనకు తార్కాణం .
అదేమంటే మేము కమిటీని వేశామంటారు . కమిటీలో తెలుగు జాతి ( ఆంధ్ర ప్రదేశ్ ) కి సంబంధించిన వారెవరూ వుండరు . అలాంటి వాళ్ళకు యిచ్చటి సాధక , బాధకాలెలా తెలుస్తాయి ? ఇలా చేయటానికి మూలమొక్కటి అనాదిగా వస్తున్న ఆనవాయితేనే .
చట్టం . ఇది నిరుపేదల కొరకు ఏర్పరచినదే . అయితే చట్టాన్ని పదుగురు ధనవంతులు రౌండ్ టేబుల్ సమావేశమై , నిరుపేదల గురించి ఆలోచించి ఏర్పరచారు . సమావేశంలో అందరూ ధనవంతులు తప్ప , నిరుపేదలు లేనే లేరు . అందులకే నిరుపేదల కేమి కావాలో ధనవంతులకు తెలియదు . అందులకే నిరుపేదలకు ఎన్నటికీ న్యాయం అందించలేకపోతున్నది చట్టం .

అలాగే మన అధికార పక్షం వేసే వేల కమిటీలు కూడా యిలాంటివే .
అంతే కాదు , ఆ కమిటీలలో యితర రాష్ట్రాల కేంద్రమంత్రులు ( వాళ్ళ చంచాగిరిలోని వారే లెండి )వుంటారు . వాళ్ళ్కేమి తెలుస్తుంది తెలుగోళ్ళ గోడు . 

అతి సామాన్య మానవుడికి తెలిసినది అతి పెద్ద అధికార కాంగ్రెస్  కి తెలియకపోవడం క్షమించరాని నేరం కదా!


                                                                         *********

నయగారాల నయాగరా


                                                             
                                                                                                                              రచన : శర్మ జి ఎస్

                                                                                     అటు కెనడా ,
ఇటు అమెరికా ,
నడుమ నయాగరా .

ఆ వైపు అందాలొలికే భవనాలు ,
ఈ వైపు ఆనందాలనందించే జలాలు .
అంబరాన్నంటుతూ సంబరాలు చేసుకొంటున్న జలధారలు
ఆ ప్రక్కనే హోరెత్తుతున్న నయాగరా జలపాతాలు .


నిరంతర నయాగరా ఫాల్స్ ,
నయగారంగా హొయల జోష్ .
అది నురగల ఉరకల గంగ లే ,
తలపించెను ఆకాశగంగనే . 
                                                                             
                                                                               

ఆ జలధారల కాధారాలెక్కడో ,
ఈ జలపాయల గమ్యమెక్కడికో .

ఆ వేగం ముందు , 
ఆవేశం , ఆక్రోశం ,
పటాపంచలే  సుమా ! .

కలగూర గంప అందాలు ,
కళ్ళకు కనువిందు బంధాలు .

                                                                                 
మేడ్ ఆఫ్ మిస్ట్ 

మేడ్ ఆఫ్ మిస్ట్  రెయిన్ కోట్


చూపించటానికి మేడ్ ఆఫ్ మిస్ట్ ,
అదే ఆ దరిదాపులకి చేర్చుటలో బెస్ట్ .

అందాల అనుభవాలు ,
ఆనందాల అనుభూతులు .

ఇరు దేశాల హద్దు

అదే ఆ యిరు దేశాలకు బార్డరట ,
దాటి పోలేరెవ్వరూ ఆ ఆర్డరట .


ఆ జలపాతాలు అతి సుందరం ,
చూసి తీరాలి మనమందరం .
అవకాశం లభిస్తే .

   ******* ప్రియ పాఠకులకు ,

శుభోదయం .

నా హాస్య కధ " దొరకునా యిటువంటి సేవ " కందిరీగ.కం కధల పోటీలో ప్రచురించబడినది .
కధ కొఱకు ఈ క్రింద లింకును క్లిక్ చేయండి .

http://kandireega.com/telugu-stories-by-g-s-sharma-8022

నా కథ " సరదాల సంక్రాంతి " ( హాస్యకధ ) సృజన డిసెంబర్ మాసపత్రికలో ప్రచురించబడినది . ఆ కధ కొఱకు ఈ క్రింది లింకుని క్లిక్ చేయండి .

srujanapatrika.blogspot.in