వి(జయ)భజనా ? భజనా ?

                                                                                                          రచన : శర్మ జీ ఎస్ 

కేంద్రం ( అధికార పార్టీ )ఆంధ్రప్రదేశ్ ని రెండు రాష్ట్రాలుగా విభజించాలని గత 60 యేళ్ళుగా జరుపుతున్న తెలంగాణా ప్రజల ఆరాటాల పోరాటాలని యిన్నేళ్ళ తర్వాత పరిగణలోనికి తీసుకొని ,యిస్తున్నామని ప్రకటించేసింది .
అయితే ప్రకటన సీమాంధ్ర ప్రజలకు యింపుగా లేక నిరవధిక సమ్మెలు చేశారు . ప్రయోజనం శూన్యం .
రెండు రాష్ట్రాలు రకంగా చేశారు ? దానికి విధానమేమిటని ప్రశ్నించినా జవాబు చెప్పలేకపోయింది . ఫలితంగా అధికార కాంగ్రెస్  రాష్ట్ర విభజనను , తన భజన సంఘ సభ్యుల సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా , గుట్టుగా లైవ్ టెలికాష్టుని కూడా ఆపి , తోటి అప్పోజిషన్ పార్టి సహకారంతో ఆమోదముద్ర వేసేసింది .
గత పదేళ్ళ నుంచి మేము అధికారంలోకి వస్తే యిస్తామంటుండటం వలన , అదికార పార్టీకి రాబోయే ఎన్నికల టర్మ్ లో వాళ్ళు అధికారం లోకి మఱల వస్తామన్న నమ్మకం వాళ్ళకు లేకపోవటం వలన , యిప్పుడు తాము తెలంగాణా రాష్ట్రం యీయకపోతే ,రాబోయే టర్మ్ లో అప్పోజిషన్ పార్టీ అధికారం లోకి వచ్చి క్రెడిట్ అది కొట్టేసుకుపోతుందేమోనన్న భయం వైపు , కనీసం అప్పోజిషన్లో కూర్చోవటానికైనా కొన్ని సీట్లు కావాలిగదా! , సీట్లను నూతన తెలంగాణా రాష్ట్రం ద్వారా నైనా రాబట్టుకోవచ్చు ( ఇప్పుడు యిచ్చేస్తే ) అన్న స్వార్ధపూరిత , కుటిల ఆలోచనలతో , అదీ అప్పోజిషన్ పార్టీ నడిపిన అత్యంత నాటకీయ పరిణామాల నడుమ యివ్వటం జరిగింది
అడుగడుగునా అన్ని పార్టీల ఆమోదంతోనే యిచ్చామని యిప్పుడు చెప్తున్నది అధికార కాంగ్రెస్ .
దానికి అన్ని పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి . ఇవ్వటం తప్పని అనటం లేదు . అయితే యిచ్చేదాని విధానమేమిటీ ?
ఒక ఉమ్మడి కుటుంబం లోని వారు విడిపోవాలంటేనే ఎన్నో రక రకాలుగా ఆలోచించి ఒక్కరికీ అన్యాయం జరుగకూడదని అనేక పర్యాయములు ఆలోచించి , మేధావుల ( పెద్దల / పంచాయతీల  ) సలహాల మేరకు విభజన జరపటం జరుగుతుంది .
అటువంటిది ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించటానికి ఎంత కృషి చేయాలో అధికారపక్షమైన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి తెలియలేదేమిటని యావత్ ప్రజానీకం బిత్తరపోయింది . అదే అందరి ఆవేదన .
రెండుగా విభజించి యిప్పుడు ఏవేవి ఎలా పంచాలి అని ఆలోచించటం వాళ్ళ అధమస్తపు పాలనకు తార్కాణం .
అదేమంటే మేము కమిటీని వేశామంటారు . కమిటీలో తెలుగు జాతి ( ఆంధ్ర ప్రదేశ్ ) కి సంబంధించిన వారెవరూ వుండరు . అలాంటి వాళ్ళకు యిచ్చటి సాధక , బాధకాలెలా తెలుస్తాయి ? ఇలా చేయటానికి మూలమొక్కటి అనాదిగా వస్తున్న ఆనవాయితేనే .
చట్టం . ఇది నిరుపేదల కొరకు ఏర్పరచినదే . అయితే చట్టాన్ని పదుగురు ధనవంతులు రౌండ్ టేబుల్ సమావేశమై , నిరుపేదల గురించి ఆలోచించి ఏర్పరచారు . సమావేశంలో అందరూ ధనవంతులు తప్ప , నిరుపేదలు లేనే లేరు . అందులకే నిరుపేదల కేమి కావాలో ధనవంతులకు తెలియదు . అందులకే నిరుపేదలకు ఎన్నటికీ న్యాయం అందించలేకపోతున్నది చట్టం .

అలాగే మన అధికార పక్షం వేసే వేల కమిటీలు కూడా యిలాంటివే .
అంతే కాదు , ఆ కమిటీలలో యితర రాష్ట్రాల కేంద్రమంత్రులు ( వాళ్ళ చంచాగిరిలోని వారే లెండి )వుంటారు . వాళ్ళ్కేమి తెలుస్తుంది తెలుగోళ్ళ గోడు . 

అతి సామాన్య మానవుడికి తెలిసినది అతి పెద్ద అధికార కాంగ్రెస్  కి తెలియకపోవడం క్షమించరాని నేరం కదా!


                                                                         *********

6 comments:

 1. తెలంగాణా ఎలా ఏర్పాటు చేయాలో చెప్పడానికి ఆంద్ర ప్రాంత రాజకీయ నాయకులకు నాలుగేళ్ల సమయం (2009-2013) ఉండింది. ఆ కాలాన్ని వృధాగా పోనిచ్చి ఇప్పుడు విభజించిన పద్దతి బాలేదని వాపోవడం ఎందుకు?

  మరో ప్రశ్న: కమిటీలో ఆంధ్రులు లేరు నిజమే, తెలంగాణా వారు కూడా లేరు కదా. జైపాల్ రెడ్డి కమిటీలో ఉండుంటే మీరు అభ్యంతరం చెప్పడం బాగుండేది.

  ReplyDelete
 2. గొట్తిముక్కల గారికి ,
  ముందుగా నా బ్లాగుకి స్వాగతం .

  తెలంగాణా వాళ్ళని ఎవ్వరినీ కించపరచలేదు . తెలంగాణా యిచ్చి తీరవలసిందే . అయితే మేధావులతో సంప్రదించి , అన్ని విభాగాలను సరైన పద్ధతిలో ముందుగా విభజించి యిచ్చి ఉంటే చాలా చాలా బాగుండేది . ఇప్పుడు మరల చర్చల అవసరం వచ్చేది కాదు , రచ్చలకవకాశం యివ్వవలసిన అవసరం వుండేది కాదు .
  ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన అన్నదమ్ముల్లా యిరు ప్రాంతాల వాళ్ళు వుండాలన్నదే తప్ప వేరే ఏదీ కాదు అన్నది గ్రహించండి .

  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ, విసృత స్థాయి సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని మీ ఆలోచనను నేను తప్పు పట్టడం లేదు. గడిచిన పది సంవత్సరాలలో (ముఖ్యంగా ఈ నాలుగేళ్ళలో) ఈ ప్రతిపాదన ఎవరూ తేలేదన్న వాస్తవాన్ని గుర్తు చేసే ప్రయత్నం మాత్రమె చేసాను.

   Delete
 3. ade kadaa maa kharma...Gottimukkala gaaru. ee raastra rajakeeya naayakulaku elaagu mundu chupu, alochana ledu. kaneesam desaanni paalinche peddalaku kudaa ledu. vaallu ituvantivi enno chusi untaaru. anni telisi kudaa ilaa chesaarnte...evaroo adagarane bhaavamainaa ayyundaali ledaa vaallaki samadhanam cheppalsina avasaram emundile... ane chinna chupu ayinaa ayyundaali....

  ReplyDelete
  Replies
  1. మీరు కేంద్రం వరకు వెళ్లనక్కరలేదు. తెరాసతో పొత్తు పెట్టుకున్న కాంగెసును 2004లొ, అలాగే తెలంగాణకు అనుకూలం అని మానిఫెస్టోలో రాసుకున్న తెదేపా & ప్రరాపాలను 2009లొ తుక్కు కింద ఓడించి ఉంటె, మళ్ళీ వారు ఆ సాహసం చేసేవారా?

   కేవలం రాజకీయనాయకుల ఆధారంగా తెలంగాణా రాదని 2009లొ ప్రజలకు తెలిసిపోయింది. ఊరూవాడా కలిసి వచ్చారు, ఊరూరా ఐకాసలు పెట్టుకున్నారు, ప్రజలందరినీ సంఘటితం చేసారు & తెగించి కొట్లాడారు.

   Delete
  2. Mastaru,telengana only one reason valla vachindi ... pappu ni PM cheyytaniki ... mee thyagala phalam edi koddiga undi

   Delete