"జయ" హో ఉగాది


                                                                                                                             వ్యాసరచన : శర్మ జీ ఎస్                                                                                                                                                                  

తెలుగు వారీ నూతన సంవత్సరాన్ని ఉగాది అని అంటారు . ఇటువంటి ఈ ఉగాదులకు మన పూర్వీకులు వాళ్ళ్ అనుభవాన్ని జోడించి  , మనకు లాగే పేర్లు పెట్టారు

వాటిని  60 పేర్లుగా నిర్ణయించారు మన ముందు తరాలవారు . ఆ 60 పూర్తి కాగానే మఱల ఆ  పేర్లే తిరిగి వస్తుంటాయిట .

అయితే ఒక సందేహం మన దేహంలోను , మన మనసుల్లోను పీడిస్తుండవచ్చు . ఇంక పేర్లు లేవా ?  మళ్ళీ ఆ పేర్లే ఎందుకు పెట్టారు ? మనుషులకు లాగా కాలానుగుణంగా కొత్త కొత్త పేర్లు పెట్టుకోవచ్చు గదా అని .

ఆ  ఉగాదులు మన మనుషుల్లాంటివి కాదన్నది మనం గ్రహించాలి .  మనుషులకు లాగా వాటికీ పునర్జన్మ ఉంటుంది .

బాగా ఆలోచించి చూస్తే అవి మనలాంటి మాములు పేర్లు కాదు . ఆ పేర్లతో ఆ సంవత్సరం మనకు ఏమేమి అందించబోతుందో తెలియచేసే విషయం యిమిడి ఉంటుంది ( అంటే మన భవిష్యత్తు ) అన్నమాట  . ఈ ఉగాదులు కాలచక్రంతో ముడిపడి ఉండటమే అందుకు మూల కారణం .

ఇపుడు రాబోతున్న ఈ ఉగాది పేరు " జయ " , అంటే ఆడవారి పేరు కలిగి ఉండటం , ఈ ' జయ ' అన్న పదం ఒక్క ఆడవాళ్ళకే కాకుండా ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికీ సంబంధించినది అగుట వలన , అందరికీ సంబంధించినదవటం వలన జయం అధికంగా వుండవచ్చనుకొందాం .

మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి , ఈ మానవుల జీవనంలో సుఖసంతోషాలు కావాలంటే యిలా కొన్నింటిని  ఆచారాలుగా  అలవాటు చేశారు మన పూర్వీకులు వాళ్ళ అనుభవసారాన్ని జోడించి .
సమాజంలో అందరూ మృష్ఠాన్న బ్భోజనం ఆరగించలేరు . అలా ఆరగించలేని ఆ అభాగ్యుల కొఱకు ఈ పండుగలను సృష్టించారు . కనీసం ఆ పండగ నాడైనా , ఆ పండగ పేరు చెప్పుకొని ఆ రోజైనా కడుపునిండా తృప్తిగా భోజనం చేస్తాడని , సంతోషంగా తనవాళ్ళతో ఆ రోజుని ఆనందంగా గడుపుతాడని .

వాస్తవానికి ధనికులకి , పెద్దలకి నిత్యం పండుగే . అయితే సమాజ శ్రేయస్సు కోరి ఈ ఆచారాలని అలవరచుకొని , కొనసాగిద్తున్నారు . కాలక్రమేణా ఈ ఆచారాలను వాళ్ళకనుగుణంగా మలుచుకొని జీవనం సాగిస్తున్నారు .

ఏది ఏమైనా ఈ " జయ " నామ సంవత్సర ఆరంభం నాడు , అందరికి శుభాకాంక్షలు .

ఇలాగే ప్రతి ఉగాది ఒక్కో పేరుతో మనకు వచ్చి మనకేమి యివ్వబోతుందో సూచన ప్రాయంగా ముందే తెలియ
చేస్తుంటుంది .

             
                                                                       *   *   *   * 

2 comments:

  1. ఉగాది శుభాకాంక్షలు సర్....

    ReplyDelete
  2. చాన్నాళ్ళకి.....మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete