వలసల వలలు

                                                          
                                                                                                          రచన : శర్మ జీ ఎస్

ఎన్నికలొస్తున్నాయంటే , సమాజం అంతటా హడావుడే హడావుడి , సందడే సందడి . సహజంగానే ఒక పార్టీ లోంచి , యింకో పార్టీలోకి జంపు జలానీలకు కొదవే లేదాయె .
అందులో నేడు సంఖ్య 4 అంకెలకు కూడా చేరుకొనే అవకాశాలు అత్యధికంగా వున్నాయి .
అందుకని అధికార కాంగ్రెస్ పార్టీని , పదవులను వదలకుండా మిగిలి వున్నవాళ్ళను వాళ్ళ స్వలాభాలకొరకు పదోన్నతులు కల్పించి ,( కాకుంటే పార్టీ ప్రయోజనాల కొరకు అంటారులెండి ), మారుమూల పల్లెల్లో తమ కొత్త కొత్త ప్యాకేజీల ప్రలోభాలతో , తమ ప్రతిభను చాటమని , ఒక్కరుగా వెళ్ళవద్దని , మూకుంంఅడిగా మిగిలి వున్న కార్యకర్తలను బస్సు యాత్రలు చేయమని ,ఎవరి మీదైనా ఎవరైనా బుస్సుమంటే , ఈ బస్సు మిమ్మల్ని కాపాడుతుందని ప్రబోధ చేసి పంపారు .
రాష్ట్ర విభజన తీరుపై అసంతృప్తితో వున్న జనం దెబ్బకు , కార్యకర్తలు కూడా తిరిగి అధికార కాంగ్రెస్ తరఫున నిలబడే నాయకుడిగా కనుపించుటలేదు .
అధికార కాంగ్రెస్ " నాయకులు వాంటెడ్ " అన్న కాలం ని ఆశించవలసిన పరిస్థితి కనపడ్తున్నది .
ఓ నాడు కాంగ్రెస్ అంటే అతి పెద్ద జాతీయ పార్టీగా పేరుగాంచినది .
నేడు కాంగ్రెస్ అంటే భూస్థాపితమయ్యే పార్టీగా ప్రచారంలో వున్నది . ఇది నిజమే .
కనుక పలువురు కాంగ్రెస్ నాయకులు వలసల బాట పట్టరు .  
వైపు అధికార పార్టీ రాజకీయనాయకులు కొంతమంది  జిల్లాలో నిలబడదామని కొందరు .
ఇంకొందరు రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేస్తున్నా , మనం ఆపలేకపోయాం , కనుక యిప్పుడు అధికార పార్టి తరఫున మనం ఎన్నికలలో నిలబడితే , చెప్పుదెబ్బలు తినవలసి వస్తుంది , ప్రజల చేత , అహంకారానికి గురయ్యే బదులు , అప్పోజిషన్ పార్టీ తీర్ధం పుచ్చుకొని కండువా కప్పేసుకొంటే , వాళ్ళే ఎక్కడో చోట ( మనం అడిగిన స్థానం యివ్వకున్నాఎలక్షన్లలో నిలబెడ్తారు . మనల్ని చూసి ఓట్లు వేస్తారన్న నమ్మకం ఎటూ లేదు , పార్టీ సింబల్ చూసి వేస్తారు గనుక , గెలిచే అవకాశాలు చాలావరకు ఉంటాయి గనుక . కనుక హ్యాపీగా అందులో చేరి 5 ఏళ్ళు ఖాళీగా లేకుండా కాలం గడిపామంటే సరిపోతుందనుకొనే స్వార్ధ రాజకీయనాయకులు .
సహజంగా వున్నవాడి పక్కన చేరాలనుకొనే వాళ్ళని మనం తఱచూ చూస్తుంటాం సమాజంలో . బాటలోనే అన్నిపార్టీల కార్యకర్తలు , రాజకీయ నాయకులు వున్న పార్టీనుంచి , అవతల పార్టీలోకి జంపు చేస్తున్నారు . ఇలా జంపు చేసేవాళ్ళని గొప్పగా చిత్రీకరిస్తుంటారు కొత్తగా  చేర్చుకొనే ఆ పార్టీలు . వీళ్ళు చేరకున్నా , వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను ఎన్నికల బరిలో నిలుపగల సత్తా వున్నా , కొత్తగా తమ పార్టీలలోకి చేరే వాళ్ళకు కోంచెం ప్రాముఖ్యత అదికంగానే చూపుతుంటారు .
ఇలా చేరిన వాళ్ళని ( అంతకు ముందున్న పార్టీలో ఏమీ చేయలేకపోయిన వాళ్ళని ) ఎన్నికలలో నిలబెడ్తే , తమ పార్టీ ఓడిపోతుందన్న ఆలోచనే మాత్రం కలగకపోవటం ఆశ్ఛర్యంగా వుంటుంది .
అంతే కాకుండా ఓడినా , గెల్చినా తమనే అంటిపెట్టుకున్న పార్టీ కార్యకర్తలకు , సభ్యులకు సీట్లు యివ్వకపోతే , తిరుగుబాటు తత్వం పెరుగుతుందేమోనన్న ఆలోచన చేయటం ఎంతైనా ,మంచిది .
ఎంతమంది వచ్చి చేరితే అంతమందిని చేర్చుకోవటానికి , అది బందీలదొడ్డీ కాదు , వారు బందీలు కారు అన్నది ఎఱుకలో వుంచుకోవటం అన్ని పార్టీలకు అన్ని విధాలా మంచిది .
జనం విపరీతంగా మన సమావేశాలకు వస్తున్నారు , మనకిక తిరుగులేదు అనుకోవటం , జనసంతోషం కొఱకు , అధికారం కోసం , ఆవేశంలో ఆలోచించకుండా బాసలు చేయటం కూడా అంత మంచిది కాదు . క్షణం గడిస్తే చాలు అనుకోవటం తప్పు . ఆచరణయోగ్యమైన బాసలు ఎల్లప్పుడూ మంచిది .

" వచ్చే వారందరికీ మా తలుపులు తీసే వున్నాయని చెప్పుకోవటం యిబ్బందులకు గురి చేస్తుందన్నది గుర్తుంచుకోవాలి వలసదారుల విషయంలో సుమా ! .


                                                                           ********

No comments:

Post a Comment