పొత్తులా ? ఎత్తులా ?

                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్

పొత్తులు ఈ పదం ఒక్క ఎన్నికల వేళ మాత్రమే హల్ చల్ చేస్తుంటుంది అన్ని పార్టీల నడుమ .

ఏ పార్టీ ఏ పార్టితో పొత్తు పెట్టుకొంటుందో ఎవరి కెఱుక కాదు .
ఎందుకంటే తను ప్రజాసేవ చేయాలన్న సదుద్దేశ్యం ఏ మాత్రం వుండదు ఈ పొత్తుల విషయంలో . ఎలాగైనా తామూ స్వతహాగా కాకుండా , మఱో పార్టీతో జత కూడి , తన వెతను బయటపడనీయకుండా , వాళ్ళతో పాటు తన పార్టీ నేతలలో కొద్దిమందైనా ఆ 5 ఏళ్ళ పదవిని అనుభవించాలన్నదే పొత్తుల ప్రధమ ప్రధాన ఎజెండా .

వాస్తవానికి చూస్తే వాళ్ళ ఎజెండాలు రెండు పూర్తిగా కలువవు . కానీ వాళ్ళు కలిసిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటారు . ఇది చిన్నా , చితక పార్టీల పొత్తుల ఎత్తుగడలు .
ఇక పెద్ద పెద్ద జాతీయ పార్టీలు కూడా ఈ చిన్నా , చితక , ప్రాంతీయ పార్టీలను చేర్చుకోవటంలో ప్రధాన ఉద్దేశ్యం తాము ఎలాగైనా ఆ ప్రధాన స్థానాన్ని అధిరోహించాలన్నదే వారి తాపత్రయం .
అవకాశం ఉన్నంతవఱకు రాష్ట్రాలలోని ప్రధాన స్థానాలని కూడా అధిరోహించాలన్నదే అంతిమ లక్ష్యంగా అగపడ్తుంది .
తాము గెలిచేటందులకు ఎటువంటి వారినైనా ( నేరచరితులను కూడా ) తమ అభ్యర్ధిగా నిలబెట్టటానికి గాని  , పొత్తులు పెట్టుకోవటానికి గాని  వెనుకాడటం లేదు .

ఇలాంటి పొత్తులు తమకో పదవి కావాలి , ఆ పదవి కొఱకు అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి ఈ ఎన్నికల సమయంలో అన్నివేళలా తమ సంసిధ్ధతను సిగ్గుపడకుండా చాటుకొంటున్నారు .

ఓ వైపు , నువ్వు నాకొద్దు మొఱ్ఱో అంటున్నా , సిగ్గు, ఎగ్గూ లేకుండా , ఆ పార్టీల వైపే మొగ్గు చూపుతూ , ఇంకా మా తలుపులు తీసే వుంచాము మీ రాకకై అంటూ చెప్తున్నారంటే ఆ పార్టీ ఎంత అధోగతిలో ఉందో అర్ధమవుతూనే వున్నది .

ప్రతి రోజు బుల్లితెరలొ ప్రతి క్షణం చూస్తూనే వున్నాం , వింటూనే వున్నాం .
ఎక్కడ చూసినా , ఏ నాయకుడు ఈ ఎన్నికల వేళ వచ్చి ఆప్యాంగా (సిగ్గూ శరాన్ని వదలి )పలుకరిస్తూ , తమకు , తమ పార్టీ / మిత్రపక్షాల అభ్యర్ధులలో ఎవరికైనా వేసి తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని మఱీ మఱీ వేడుకొంటాడు అనటం కంటే ప్రాధేయ పడ్తుంటాడు . ఆ తర్వాత మఱి మా మొఖమే చూడడు , తన మొఖం కూడా చూపించడు . అసలు మా నేతలు ఎవరో మాకు తెలియదు అంటుంటారు . ఈ సారి రానీయండి , ఆ నాయకులను అడిగేస్తాం , కడిగేస్తాం , అటువంటి వారికి మేం మా వోట్లు వేయం అని .
ఇక్కడొక ముఖ్య విషయాన్ని మనం మఱచిపోయాం . అదేమిటంటే మనం అలా అడగలేదని వాళ్ళు ( మనచే ఎన్నుకొనబడిన ప్రజానాయకులు ) చేయకుండా వుండలేదు . వాళ్ళ సహజ స్వభావమే చేయకుండా వుండటానికి ప్రధాన కారణం . ఇది మనం బాగా తెలుసుకొని మసలాలి సుమా ! .

మాకు కావలసినవన్నీ అడుగుతాము , మాకు అలా సేవ చేసే నాయకుడికే మా విలువైన వోతుని వేస్తాం అంటూ కూడా ప్రతి రోజు వింతున్నాము , చూస్తున్నాము .

మంచిదే . కానీ సేవ చేసే నాయకుడు ఎవరన్నది ఎలా గుర్తించటం ? ఇది ఓ శేషప్రశ్నగా ఈ అశేష జనవాహిని మదిలో మిగిలిపోయింది .

వాస్తవానికి మన భారతదేశ జనాభా వెరశి 84 కోట్లుంటే , వీరిలో అత్యధికంగా వోటు హక్కు వినియోగించుకొనే వారిసంఖ్య 64 కోట్లు వరకు ఉందనుకొందాం .
ఈ 64 కోట్ల మందిలో షుమారుగా 30 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోకుండా వుండిపోతున్నారు .
మిగిలిన ఆ 34 కోట్ల ఓటర్లు , భారతదేశాన్ని పంచుకుంటున్న పార్టీలకు ఓట్లు వేస్తారు . అలా పంచుకున్న ( ఉన్న ప్రముఖ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా కొంతమందిని ఆకర్షణియమైన ఎజెండాలతొ ఎన్నికల బరిలోనికి దించుతారు . ఆ ఆకర్షణీయ ఎజండాలను చూసి కొంతమంది మంచి ఓటర్లు ప్రధాన పార్టీలకు ఓట్లు వేయకుండా , వీళ్ళకు వేస్తుంటారు . వాళ్ళు గెలిచేదీ లేదు , సేవ చేసేదీ లేదు ) పార్టీలలో 40 శాతం వోట్లు వచ్చి గెలిచిన పార్టీల్ ఈ 84 / 64 కోట్ల జనాభాను పరిపాలిస్తున్నారు .
ఇది మన వ్యవస్థ లోని ప్రధాన లోపం .

ఎన్నికల వేళల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పార్టీలు జన్మ తీసుకొంటాయి కొంగొత్త ఎజెండాలతో . ఆ పార్టీలేవో మనకు చేసేస్తాయని మనమనుకొంటే పొఱపడ్డట్లే .

శ్రీ శ్రీ గారన్నట్లు
" ఎవరో వస్తారని ,
ఎడో చేస్తారని ,
ఎదురుచూసి మోసపోకుమా ,
నిజం మఱచి నిదుర పోకుమా "
అన్నది సత్యమన్నది మనం మఱువరాదు .
భూమికోసం చిత్రానికి 1974 సంవత్సరంలో వ్రాసిన పాట యిది . 40 ఏళ్ళ క్రితమే నేటి చరిత్రను ఊహించి వ్రాసిన సమాజ సత్యం .

ఈ నడుమ ఆరడుగుల బుల్లెట్ గా పేరు కంచిన చలనచిత్ర నటుడు అయిన పవన్ కళ్యాణ్ చే ఊపిరి పోసుకుని , ఆవిర్భవించిన  " జనసేన " పార్టీ ప్రసంగం ఓ సగటు మానవుడి ఆవేదన ( అధికార ప్రభుత్వంపై ) ప్రశంసనీయమైనది . " కాంగ్రెస్ హటావో , దేస్ బచావో " అని ఆ సభలో గర్జించారు .

ఇందు కొరకైతే ఆయన జనసేన పార్టీ పెట్టవలసిన పనే లేదు . ఎందుకంటే , కాంగ్రెస్ సరైన విధానాలు లేకుండా అడ్డగోలుగా ( స్వార్ధపూరిత పొత్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ) రాష్ట్రవిభజన ( లైవ్ టెలికాష్టులను నిలిపివేసి చేసిన ) తీరు ఆ ఫార్టీని భూస్థాపితానికి దారితీసింది భారతప్రజల మనసుల్లో అప్పటికే .

అయితే ఈ ఎన్నికలకు కాకున్నా వచ్చే ఎన్నికలకైనా ఈయన ప్రజలకు కావలసిన న్యాయం చేస్తాడు అనుకుంటే , ఇదేంటి ఉన్నట్లుండి నరేంద్రమోడీని కలవటానికి అహమ్మదాబాద్ లో 3 రోజులుండి ఆయనను భేటీ అయి రిటర్న్ వచ్చి , ఆయనకు మద్దతు పలకటం ప్రజలను బాధ కలిగించి , ఆలోచింపచేసింది .

ఎవరు ఎవరికి మద్దతిస్తానన్నా సరేనంటుంది ఏ పార్టీ అయినా . అటువంటిది ఇక ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ మద్దతిస్తానంటే ఎందుకొప్పుకోరు . ఆయనకున్న అభిమాన యువ పవన్సేన కూడా వాళ్ళ విజయానికి దోహదడ్తుంది  కదా!

పొత్తులతో సమాజ సేవ చేసే అవకాశం లభ్యం కాదన్నది మన నాయకులెప్పటికైనా గుర్తుంచుకోవలసిందే . ఎందుకంటే నిజ్జంగా సమాజ సేవ చేయాలనుకున్న కొత్త పార్టీల ఎజెండా ఎల్లప్పుడూ , మామూలు పార్టీల వాళ్ళ ఎజెండాలకు భిన్నంగానే వుంటుంది . వాళ్ళతో పొత్తులు కొత్తగా వచ్చిన పార్టీల వాళ్ళను సమాజ సేవ చేయనీయకుండా యిబ్బందులకు గురి చేస్తాయన్నది ఆ కొత్త పార్టీలు ( చక్కగా సమాజ సేవ చేయాలనుకున్న పార్టీలు ) గుర్తుంచుకొని వాటిని దూరంగా వుంచి , వాటికి దూరంగా వుండి , మెల మెల్లగా సమాజ సేవ మొదలు పెడ్తూ , నేరచరితులను , స్వార్ధపరులను దరి చేర్చుకోకుండా చూడగలిగిన నాడు ఆ పార్టీ ఆవిర్భావానికి అసలు సిసలు అర్ధం అగపడ్తుంది .

ఈ ఆరడుగుల బుల్లెట్ " ఇజం " అనే పుస్తకాన్ని తన మిత్రగణంతో వ్రాయటం అభినందించవలసినదే . ఆ పుస్తకం  27/03/2014  ఆవిష్కరించటం జరిగింది .
దీనిని అతి తక్కువ వెలకే విక్రయించటం అందరికీ అందాలనే తాపత్రయం .
ఐతే ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఆవిష్కరిస్తున్న సమయంలో తెలుగులో ముద్రించి అందరికీ అందిస్తే , ఎంతగానో సమాజంలోని వాళ్ళ మనసులను చేరుకొని శ్రేయస్సు .
అలాంటిది తెలుగువారి నాడిలో ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ కొంచెం బాగా లేదని భావన .
వీలున్నంత త్వరగా , 10 / 15 రోజులలో తెలుగులో తర్జుమా అవుతుందని తెలియటం కొంచెం ఊరట కలిగిస్తోంది .
ఈ ప్రపంచంలో ప్రతివానికీ ఏదో చేసేయాలని అనిపిస్తుంటుంది . అయితే అందరికీ సాధ్యం కాదు . కొంతమందికే అది సాధ్యమవుతుంది . అది మన జనసేన అయిన పవన్ సేనకే సాధ్యపడ్తుందని ఆశిద్దాం .

ఆవేశపూరిత , జనాలకుపయోగకరమైన ఉపన్యాసాలు ఎవరు చేసినా జనాలకందరికీ వినసొంపుగనే  వుంటుంది కదా ! .
అవి ఆచరణలోకి వచ్చిననాడు కదా ! .అందరూ సంతోషించగలిగేదే , అభినందించేది  .

ఇరు ప్రాంతాల ( తెలుగోళ్ళే కాబట్టి ) వాళ్ళకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఊర్కోను అని ఉద్ఘాటించారు . ఇది చాలా చక్కటి ఆలోచన . అన్యాయాన్ని , అక్రమాల్ని సహించలేకపోవటమే ఆతని అంతరంగ ఘోష అని ఆతని వైజాగ్ బహిరంగసభలో వెల్లడి చేశారు .                                                                    *******

2 comments:

 1. "ఎందుకంటే , కాంగ్రెస్ సరైన విధానాలు లేకుండా అడ్డగోలుగా ( స్వార్ధపూరిత పొత్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ) రాష్ట్రవిభజన ( లైవ్ టెలికాష్టులను నిలిపివేసి చేసిన ) తీరు ఆ ఫార్టీని భూస్థాపితానికి దారితీసింది భారతప్రజల మనసుల్లో అప్పటికే"

  భారత దేశ ప్రజలందరూ ఈ విషయంపై కాంగ్రెసును భూస్తాపితం చేయదలచారు అనడం అతిశయోక్తి. ఎక్కువ ఎక్కువ ఆంధ్రలో కొందరు మాత్రమె ఈ నిర్ణయానికి వచ్చారనడం సబబు. తెలంగాణా ఇవ్వకముందే కాంగ్రెసుకు ఆంధ్రలో వ్యతిరేక పవనాలు వీస్తూ వచ్చాయి (ఉ. ఉప ఎన్నికలు).

  "ఆయనకున్న అభిమాన యువ పవన్సేన కూడా వాళ్ళ విజయానికి దోహదడ్తుంది కదా!"

  దేశం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది కూడా చాలా పరిమతమయిన విషయం. హేమామాలిని, శత్రుఘ్న సిన్హా, సల్మాన్ ఖాన్, విజయ్ కాంత్, నాగార్జున లాంటి ఎందరో సినీ ప్రముఖులు ఇప్పటికే మోడీ వెంట ఉన్నారు. పవన్ సమర్ధన భాజపాకు కొసరు కిందే లెక్క

  ReplyDelete
 2. గోదావరి వాసులారా ! చంద్రబాబుకు వోటేసారా మన గ్యాస్ ను రిలయెన్స్ అంబానీకి మోడీతో కలిపి కట్టబెట్టడానికి అవకాసం కల్పించినట్లే

  ReplyDelete