కలిసుందాం---- రా !


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

కేంద్రంలో అ అందుకెలాగైనా ధికార పగ్గాలు పట్తలంకొంటున్నారు ,చక్రం తిప్పాలనుకొంటున్నారు భారతీయ జనతా పార్టి అభ్యర్ధులందరూ . అయితే ఈ పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా తమ ప్రధాని అభ్యర్ధి ' నరేంద్ర మోడీ ' అని ప్రకటించిన తర్వాత , నరేంద్ర మోడీయే ఆ పార్టీకి సెంటర్ అయి పోయాడు . ఇప్పుడు మొత్తం ఆ నరేంద్ర మోడీని ముద్దుగా " నమో " అంటూ పిలుచుకొంటున్నారు .
ఆ పార్టీ ప్రచారభారాన్ని అధికంగా నెత్తిన వేసుకున్నది కూడా ఆ నమోయే . ఇప్పుడా పార్టీ ఏ స్థాయికి మారిందంటే , ఒన్ మ్యాన్ ఆర్మీగా మారి , మిగిలిన ఆ పార్టీ సభ్యులందరూ ఈ నమోనే చూపిస్తుండటంతో , ఆ నమోయే ఒన్ మ్యాన్ షో ప్రజలతో పాటు పార్టీ వాళ్ళందఱకీ ప్రదర్శన యిస్తున్నారు .

ఇక కేంద్రం పగ్గాలు పట్టాలంటే , కొన్ని రాష్ట్రాలకు పొత్తుల తాయిలాన్ని ఎఱ వేస్తున్నారు . ఎందుకంటే ఎలాగైనా సరే కేంద్రం లోని యూ పీ ఏ ( కాంగ్రెస్ ని ) అధికారం నుంచి క్రిందకు దింపి మట్టి కఱిపించి , మిగిలిన వారి పొత్తుతో ఆ కేంద్రంలోని ప్రధానమైన ప్రధాన మంత్రి పదవి నధిష్టించాలని .

ఈ ఉద్దేశంతోనే వాళ్ళ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని పలు రాష్ట్రాలలో తమకు అవకాశమీయాలని , అప్పుడే మన పొత్తు విజయవంతమౌతుందని ఒత్తిడి తెస్తున్నారు ఆ యా ప్రాంతీయ పార్టీలతో .

ఏ రాష్ట్రానికా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు వాళ్ళకున్న యిప్పటి ప్రజా వ్యతిరేకతను , బలంగా మరుతున్న పరిస్థితులలో , స్వతంత్రంగా నుల్చొన్నా , రాష్ట్ర అధికార పగ్గాలు చెజిక్కించుకోగలరు . అయినా బి జే పి వాళ్ళ పొత్తు ఎందుకు కోరుతున్నారంటే , ప్రస్తుతం అధికారంలో నున్న యూ పీ ఏ పరిపాలనా యంత్రాంగం ఘోరాతి ఘోరంగా , అవినీతి వృక్షాన్ని ఆకాశాన్నంటించాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే వున్నది . నిరవధికంగా నీతిని అధః పాతాళానికి అణగదొక్కే ప్రయత్నం చేస్తూనే వున్నది .

దానితో మరో ప్రత్యామ్నాయ జాతీయపార్టీ గత పదేళ్ళ నుంచి అప్పోజిషన్లోనే తిష్ట వేసుకున్న తన పొజిషన్ మార్చు కోవాలనుకొని , ప్రాంతీయ పార్టిల పొత్తుల ఎత్తులు చూపుతుంటే , ఈ సదవకాశాన్ని తాము ఉపయోగించుకొంటే , వాళ్ళు అధికారానికి వస్తే , తమ రాష్ట్ర అభివృధ్ధికి చేయూత అందిస్తుందన్న సద్భావనతో సంసిధ్ధమవుతున్నాయి ఆ యా రాష్ట్ర ప్రాంతీయ పార్టిలు .

ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొన్న బి జే ఫి , ఆ యా ప్రాంతీయ పార్టీలకు కంచుకోటలైన ముఖ్య ప్రాంతాలలో వాళ్ళ జెండా ఎగురవేయాలన్న దురాలోచనతో , దూరాలోచనతో , ఆ ప్రాంతాలనే తమ పార్టీ అభ్యర్ధులకు టికెట్లు కేటాయించాలని ఒత్తిడి యిస్తున్నారు .

ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో వాళ్ళ కంచుకోటలు కాస్తా మంచుకొండల్లా కరిగిపోయి , మఱుగున పడే అవకాశాలు వస్తున్నాయి .

ఇదే విషయాల్ని ఆ యా పార్టీల సీనియర్ మెంబర్లు చెప్తున్నా ఆ పార్టీ అద్యక్షులు గ్రహించక పోవటం ఒక రకంగా తప్పిదమని తెలుస్తోంది .

కలిసుందాం---- రా ! అనగానే  పరుగులు తీయకూడదు , అమాంతంగా సామాన్లూ సర్దుకోకూడదు .

ఎక్కడ , ఏ ప్రాంతంలో కలిసుంటామో తెలుసుకొని , ఏ ఏ షరతులతో కలిసుంటామో తెలుసుకొని , అందులకు యిరువురకు అంగీకారమైతే , అప్పుడు పరుగులు తీసినా , సామాన్లు సర్దుకున్నా తప్పు కాదు . ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మసులుకొంటే భవిషత్తు బంగారు బాటే .


                                                                                                              ******* 

No comments:

Post a Comment