పధకాలా ? పాతకాలా ?

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్
గ్యాస్ :

ఓ నాడు గ్యాస్ వాడేవాళ్ళు లేక ( దాని ఉపయోగం తెలియక లెండి ), గ్యాస్ సరఫరదారులు వెంటపడి మఱీ ,మఱీ మీరు తీసుకోండి , మీరు తీసుకోండి అంటూ అంటగట్టారు వాడకందారులకు యిష్టమున్నా లేకున్నా . మాంసం రుచి చూసిన పులి , మందు కలవాటు పడిన వాళ్ళు ఎలాగైతే , వాటికొఱకు ఎదురు చూస్తుంటారో , అలాగే అధిక మొత్తం లో గ్యాస్ కనెక్షన్లు తీసేసుకొన్నారు . వాళ్ళు ఆనందంగా కొన్ని సమయాలలో అత్యధిక ధరకు ఆ గ్యాస్ సరఫరా దారులు కూడా అమ్మిన ఆనవాళ్ళు రిజిస్టర్ చేసుకొన్నాయి .

కొంతకాలానికి గ్యాస్ చౌక మఱియు సుఖం అని తెలుసుకొన్న ప్రజలు ఎక్కువమంది కనెక్షన్ల కొఱకు దాఖలు చేసు కొన్నారు .

గ్యాస్ సరఫరాదారులు ఈ పరిస్థిని ఎదుర్కొనలేక , అధికార ప్రభుత్వంతో చేతులు కలిపి , కొత్త కొత్త నియమ నిబంధ నలను అమలులోకి తెచ్చింది .

దాని రూపమే , అధిక కనెక్షన్ దారులు ( ఒకే ఇంటిలో నివసిస్తున్న వాళ్ళు ) ఒక కనెక్షన్లో రెండు సిలిండర్ల కంటే అర్హులు కారు . కనుక మీకున్న అధిక కనెక్షన్లని గ్యాస్ కంపెనీలకు వాపసు చేసి మీకు రావలసిన సొమ్మును మీరు పుచ్చుకోవచ్చు . లెకుంటె , మీకు అధిక కనెక్షన్లున్నాయని మేమే కనుగొంటే , అప్పుడు మీరు నానా విధాలుగా నష్టపోవలసి వస్తుంది అని హెచ్చరించటంతో చాలా వఱకు అధిక కనెక్షన్లు వాపసు చెయటం జరిగింది . ఎప్పుడైతే 
వాపసు వచ్చాయో , వెంటనే మఱల కొత్త కనెక్షన్లు యిస్తాము , 1 అధిక సిలిండర్ కూడా  , అసలు గ్యాస్ కనెక్షన్ లేనివాళ్ళు దాఖలు చేసుకోవలసినదని ప్రకటన చేశారు . ఆ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది .

ఈ నడుమ గ్యాస్ సరఫరాదారులతో , ప్రభుత్వం చేతులు కలిపి ఓ కొత్త విధానాన్ని అమలు లోకి తెచ్చారు  . ఆ నూతన విధానమే " ఆధార్ " కార్డ్ .

ఇది అత్యంత విశేషమైనదని , భారతదేశ ప్రజలు ( అప్పుడే పుట్టిన బేబీ నుంచి చావబోయే వాడి వరకు ) గర్వించే విధంగా దీనిని రూపకల్పన చేశాము . దీని భారత దేశ ప్రజలకు ముఖ్యమైనవన్నీ దీనిలో పొందు పరుస్తాము . ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది . ప్యాన్ కార్డ్ లా కాదు , బ్యాంకు అకౌంటుల కాదు . అన్ని రకల ఖాతాలు దీనిలో పొందుపరచబడ్తాయి . దీన్ని ఒక్కదాన్ని కలిగుంటే వాళ్ళ జాతకం మొత్తం అందులో వున్నట్లే నని తెగ ప్రచారం చేశారు . కోట్లకు కోట్లు వెచ్చించారు .

ఈ ఆధార్ ఎలా యివ్వబడిందో ఒకమారు పరిశీలించండి .

అధికారుల ఆజమాయిషీ లోపాలు :
1 ) ఈ ఆధార్ నమోదు కేంద్రాలలో టెంపరరీ క్లర్కులను నియమించటం .
2 ) ఆధార్ నమోదుకి కావలసిన పూర్తి అవగాహన కల్గించకపోవటం .
3 ) వాళ్ళు నమోదు చేసుకున్న అప్లికేషన్లని ఏ రోజు కా రోజు పరిశీలించి , తగు విధమైన కట్టుదిట్టంగా భద్రపఱచక పోవటం .

ఇదిలా వుండగా ఒక కుటుంబం అత్యధిక ప్రయాసలకోర్చి ( అందఱినీ ఒక చోట చేర్చటంలో )ఆధార్ అప్లికేషన్లు నమోదు చేసుకొంటే , ఆధార్ కార్డులు ఆ కుటుంబంలోని 3 రికో , 4 గురికో ఇష్యూ చేయటం , మిగిలిన వాళ్ళకు రాకపోవటం .అడిగితే త్వరలో మీకు వస్తాయని మొదట , కొంతకాలం తర్వాత వెతుకుతున్నామని , ఇంకా రాక , మఱల అడిగితే , మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకొమ్మని సలహాలు వెబ్ సైట్ ద్వారా తెలియచేయటం జరిగింది అనటం .

ఈ ఆధార్ కార్డ్ ఎలా ఇష్యూ చేస్తారో ఈ పధ్ధతి చూస్తే మీకే అర్ధమైపోతోంది మీ అందఱికీ .

ఆధార్  కార్డ్  కి రెసిడెన్స్ ఋజువుగా , లేటెస్ట్ కరెంట్ బిల్ ఒక్కటి జిరాక్స్ కాపీ జత పరిస్తే చాలట ( ఆ యింటిలో నివసించకపోయినా ) .


ఇలా ఆధార్ కార్డ్ లు ఇష్యూ చేసుకొంటూ పోతుంటె , ఎంతోమంది టెర్రరిస్టులకు , గూండాలకు , హంతకులకు  మఱియు అవినీతి పరులకు బలం చేకూర్చినట్లు కాదా !  

ఇంక అసలు విషయంలోకి వద్దాము .

అలా అధిక కనెక్షన్లని వాపసు తీసుకొని , కొత్త కనెక్షన్లు యిస్తూ , మీకు ఒక కనెక్షంకి సంవత్సరానికి 6 సిలిండర్లు సరఫరా చేయబడ్తుందని , మీ గ్యాస్ కనెక్షన్ ఈ ఆధార్ కార్డ్ కి జత చేయాలని ఆర్డర్ జారీ చేసింది అధికార ప్రభుత్వం . ఆ 6 స్య్లిండర్లు కూడా ఒక్కింటికి 1320 లు చెల్లించాలని ( మామూలు మొత్తం కంటే రెండు రెట్లు అధికంగా ) , మీ బ్యాంకు అకౌంట్ ఈ ఆధార్ కార్డ్ కి జతపరచమని , ఆ తర్వాతే మీకు ఆ అధికంగా చెల్లించిన మొత్తం జమ చేయపడ్తుందని ఆర్డర్ జారీ చేసింది .
ఈ చర్య వల్ల , గ్యాస్ మామూలుగా చెల్లించే 441 లు లేక ఎన్నో యిబ్బందులు పడ్తుంటే , అధికంగా రెండు రెట్లు ఎక్కడనుంచి చెల్లించగలడు సామాన్య మానవుడు .

ఆ ఆధార్ కార్డుకి ఈ లింకులన్నీ జత చేసేవరకు ( చాలా సమయం తీసుకొంటుంది కదా! )యిలా సిలిండర్ల కొఱకు అధికంగా చెల్లించిన మొత్తానికి నీళ్ళు వదులుకోవలసిందే .

ఇంతే కాకుండా , 6 సిలిండర్లని 9 గా మార్చటం , ప్రజలకేదో సాయం చేస్తున్నట్లు ఓ భావన కలిగించటం . మఱల ఆ 9 ని 12 చేయటం   ( ఎన్నికలను దృష్టిలో పెట్టుకొన్నట్లున్నారు లెండి ) . ఇప్పుడు ఈ ఏప్రియల్ 1 నుంచి ఆధార్ జతకి సంబంధంలేదని . మామూలు ధరకే గ్యాస్ సరఫరా చేస్తారని కొత్తగ ఆర్డినెన్స్ జారీ చేయటం . 

ఇప్పుడు అమలు జరుపుతున్నారు మఱల ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న దురుద్దేశంతోనే .

ఇంత గొప్పగ చెప్పబడిన ఆధార్ కార్డ్ ని భారతదేశ ప్రజలకు ఎలా అందించాలో తెలియని ప్రభుత్వంలో ఉన్నామని చెప్పుకోవటానికి సిగ్గు పడవల్సి వస్తోంది .
అధికార ప్రభుత్వం ఎంతోమంది అడ్డగాడిదలతో , అడ్డంగా చేతులూపుకొంటూ ప్రారంభించే పధకాలే ఇవి .

పధకాలే యివి , ప్రజలను పబ్లిక్ గా దోచుకొనే లైసెన్స్డ్ పధకాలే నిజ్జంగా యివి .

ఇటువంటి ప్రభుత్వాలనా మనం అధికారంలో కూర్చోపెడ్తున్నది ? ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించండి ఓటర్లూ . 


                                                                                                             *******


No comments:

Post a Comment