ఇవో పధకాలు


                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిరుపేదల ఓటు బ్యాంకుతోనే అన్నది ఎవ్వరూ , ఎన్నటికీ మరువరానిది .
అల వచ్చిన ప్రభుత్వాలు ఆ నిరుపెదలకి ఏవైనా చేయాలన్న సదుద్దేశ్యంతోనె కొన్ని కొన్ని కొత్త కొత్త పధకాలు లేవనెత్తుతుంటుంటారు .

అలాంటిదే ఈ క్రింది ఆలోచనలు .

పేదవాళ్ళు పిల్లలను కనటానికి ఉచిత ప్రసవానికి మందులతో కలిపి గర్భవతిగ నిర్ధారణ అయిన నాటి నుంచి  , ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్డర్లు జారీ చేశారు . అంతే కాకుండా ఆ పుట్టే ఆడపిల్ల భవిష్యత్తుకి భరోసా కల్పిస్తూ " బంగారు తల్లి " సర్టిఫికెట్ ని ప్రసవం అయి ఇంటికి వెళ్తూండగా యిష్యూ చేస్తుంది ప్రభుత్వం .
ఆ ఆడపిల్లలు ఎంతవరకు చదువుకొంటామంటారో , అంతవరకు వాళ్ళ చదువులకయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే పెట్టుకొంటుందని .

పధకాలైతే బాగానే వున్నాయి .

వాస్తవానికొస్తే , ఆ ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యులు లేక , మందులు లేక అంతే కాదు పడకలు లేక ఎంతమంది నేల మీదనే ప్రసవ నొప్పులు పడ్తున్నారో నిత్యం మనం ప్రముఖ పత్రికలలో చదువుతున్నాము . బుల్లి తెరలలో చూస్తున్నాము .

అయినా  ప్రభుము తక్షణమే తీసుకొంటున్న చర్యలు ఏమీ కనపడటం లేదు .

అలాగని పేదవాళ్ళు పిల్లలను కనటానికే మాత్రం వెనకాడటం లేదు . అలాగే , ఆ కటిక నేలమీదనే ప్రసవిస్తున్నారు . ధైర్యంగా వుంటున్నారు , ఎందుకో తెలుసా ? ఆ ప్రభుత్వ పధకాలను చూసి .

ఇటువంటి ముందు చూపు అన్ని రాజకీయ పార్టీలదే . నేడు కాకపోయినా , రాబోయే కాలంలో ఆ నిరుపేదల ఓటు బ్యాంకుని కొల్లగొట్టగలమనే అత్యాశే ఈ పధకాల వెనుక వున్న అతి నిగూఢ రహస్యం .

ఈ పేదవాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యేనాటికి ఆ ప్రభుత్వంలో ఎవరు అధికారంలో వుంటారో ఎవ్వరి కెఱుక ?

ఈ పధకాలన్ని ఖాళీ స్థలంలో పెంచుతున్న టేకు మొక్కల లాంటివన్నది ఈ నిరుపేదలు గ్రహించకపోవటం కడు శోచనీయం .


వాళ్ళు దోచుకునేందుకు వీలుగా  " ఇవో పధకాలు  " .


2 comments:

 1. ఇచ్చిన అస్త్రాన్ని ఉపయోగించుకొవటం తెలీని ఈ బడుగుజీవుల బరుతుకులింతే...,
  ఓటు రహస్యమేగా.., బయం లేదుగా డబ్బుతీసుకున్నా నమ్మకమున్న వాడికే వేయాలి.

  ReplyDelete
  Replies
  1. ఆ నమ్మకం చంచలం కావటంవలన అల్పావసరాలకు అమ్ముడుబోతోంది .ఈ విషయాన్ని గ్రహించిన నాడు ఓటు పోటెయ్యగలదు . ఎటువంటి లోటునైనా తీర్చగల నాయకులు జన్మ తీసుకొంటారు . ఓటర్లు స్వేఛ్ఛగా ఊపిరి పీల్చుకొనగలరు .

   Delete