యువతా మేలుకో - నేతా ఇకపై ఏలుకో యిలా


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

గమనిక : ఈ వ్యాసాన్ని ఏప్రియల్ 4 వ తారీఖున ఈనాడు తెలుగు దినపత్రికకు పంపగా వారు ప్రచురించలేదు . అందువలన ఈ వ్యాసాన్ని నా బ్లాగులో ప్రచురించటమైనది . 

" యువతే ఈ సారి ఎన్నికలలో ప్రధాన పాత్ర వహించి రాజకీయ నేతల తలవ్రాతలు మారుస్తారని పత్రికలలో చదువుతున్నాము  , బుల్లి తెరలలో కూడా వింటున్నాము ."

యువ ఓటర్లూ మేలుకోండి . ప్రభుత్వాలని నిలదీయండి . ఏ ప్రభుత్వాలైనా మీరంతా ఒక్కటే . కారణం మీరే రేపటి భావితరాల పౌరులు , నాయకులూ .

మీరు ఎవ్వరినైనా ఎన్నుకోండి . అధికారం కొఱకు ఏ పార్టీ జెండా ఎగరటానికి అవకాశమిచ్చినా ఫరవాలేదు ప్రభుత్వంలో .

మీరు ఓటు వేస్తున్నది  మీ బాగోగులు చూడటానికే నన్నది  మాత్రం మఱచిపోకండేం . 

వాళ్ళు పదవులంటిపెట్టుకొని వాళ్ళ సంపదలను , వాళ్ళ సమీప , దూరపు బంధువులు బాగుపడటానికి మాత్రం కాదని మనం మఱచి పోకండి.

అంతే కాకుండా మన ఈ భారత దేశంలో ఎంతోమంది యువత నిరుద్యోగంతో , నిరుత్సాహంతో సతమవుతున్నారు . 
అటువంటి యువతకు ఈ భారతదేశ నేతలు ఏం చేస్తున్నారు ?

యువతను ఎప్పటికప్పుడు ఉద్యమాలని , ఊరేగింపులని ఉసిగొల్పి , వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు ఈ స్వార్ధపూరిత నాయకులు . ఆ యువతలో కొంతమంది చనిపోగానే , వాళ్ళకు స్మారక స్థూపాలు నిర్మించి , ఆ యువత తల్లి తండ్రులకు ఊరట కల్గిస్తున్నారే గాని , వారికి బాసటగా ఉండలేకపోతున్నారు . ఈ స్మారక స్థూపాల వలన చెట్టంత ఎదిగిన ఆ కొడుకులు వాళ్ళకు చేయూతగా లేకపోయారన్నది , వారి జీవితాల్ని దుర్భరం చేస్తుంది . జీవితమంతా ఆ దిగులుతో కృశిస్తూ వాళ్ళ ఆ శేష జీవితాల్ని గడపవలసినదే కదా ! ఆలోచించవలసిన విషయం . 

ఎన్నో ఉద్యోగాల ప్రకటనలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్లికేషన్లని అందిస్తూ , వాటికి చలాన్లు కట్టమని , ఆ పరీక్షలకు ఎక్కడో హాజరు కమ్మని పత్రికాముఖంగ ప్రకటనలు చేస్తుంది . వాస్తవానికి ఆ ఉద్యోగాల ఖాళీల సంఖ్య 4 , 5 అంకెలలోనే వుంటుంది . కానీ అప్లికేషన్లు మాత్రం లక్షల సంఖ్యలలో . ఎందుకంటే మన ఈ భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువ కదా ! 

విచిత్రమేమిటంటే , వాళ్ళసలే నిరుద్యోగులు , వాళ్ళ పాకెట్ ఖర్చులకు కూడా వాళ్ళు నిత్యం తల్లితంద్రుల వద్ద చేయి చాస్తూనే వుంటారు . అటువంటి వాళ్ళనుంచి , ఈ ఉద్యోగాల రూపంలో , 
అప్లికేషన్ల ద్వారా , 
చలాన్ల ద్వారా ,
రవాణా ఛార్జీల ద్వారా ,
అధికారిక క్యాంటీన్ల ద్వారా ,సంపాదిస్తుంటుంది మన ఈ ప్రభుత్వం . 
దీనివలన ఎంతమంది నిరుద్యోగులు , నిరుద్యోగులుగానే వుండిపోతున్నారో ఒక్క మారు ఆలోచించండి . వేలల్లో ఉద్యోగులు ,
లక్షల్లో వున్న నిరుద్యోగులనుంచి , కోట్లల్లో ప్రభుత్వం సంపాదించుకుంటుంది . ఆ పై అధికారులు పంచుకొంటారు కొన్ని ఉద్యోగాలను వాళ్ళ యిలాకాలో వాళ్ళకు ముట్టజెప్పి .

ఇలా ఈ మన ప్రభుత్వం చేసే కంటే , యిలా చేస్తే బాగుంటుంది ( ఏ ప్రభుత్వాలైనా ఈ భావి భవిష్యత్తుకి యువతకు )ఒకమారు కాదు , పలుమార్లు ఆలోచించండి .

అప్లికేషన్లు ఉచితంగా అందించాలి .
చలాన్లను ఎత్తివేయాలి .
ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకు ఉచితంగా వెళ్ళేటందులకు , రైల్వేలో ఉచిత భోజన వసతి కల్పించాలి , అనుమతించాలి తగు నిర్ధారిత పత్రాలతో .
ఆ పరీక్షా కేంద్రాలలో క్యాంటీను వసతులు కల్పించి , నామ మాత్రపు ధరలకే నాణ్యతతో అందించాలి .
ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో ఆ పరీక్షా సమయాలలో మాత్రమే ఉండే ఉచిత వసతి కల్పించాలి .

ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చదువును బట్టి కేటాయించాలే గాని , రికమండేషన్లతో కాదు . 
నిజ్జంగా వెనుకబడిన వర్గాలకూ ప్రాధాన్యత యివ్వవచ్చు . ఆ సాకుతో అన్యాయాలకు ఒడిగట్టకూడదు .

ఆ నాడు ఏ పార్టీ ప్రభుత్వం వున్నా యువతను తీర్చి దిద్దినదై , వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండగలదని ఘంటాపధంగా చెప్పవచ్చు .

                                                                                                                   ****** 

No comments:

Post a Comment