పంచవర్ష ప్రణాలిక


                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్
                                                                             
టోపీలు పెట్టుకుంటారు ,
టోకరాలు చేస్తుంటారు . 

ప్రేమగా వాటేసుకొంటారు ,
దోమలా కాటేయ చూస్తారు .
                                                                           
ఇస్త్రీలు చేస్తారు ,
కుస్తీలు పడతారు .

కట్టెలు మోస్తారు ,
రొట్టెలు వేస్తారు ,

మొక్కలు నాటుతారు ,
గోతులు తవ్వుతారు .

కూరలమ్ముతారు ,
చీరె , సారెలనిస్తారు  .

చెప్పని ఊసులు లేవు ,
చేసిన దాఖలాలు లేవు .

 దోశలు వేస్తారు ,
ఆశలూ రేపుతారు .

రాఖీలు కడతారు ,
కాఖీలను పడతారు .

ఆటోలు నడుపుతారు ,
ఆటలు ఆడుతారు .

కంకణం కట్టించుకొంటారు ,
కందకాల్లోకి తోసేస్తారు .

వెయ్యని వేషాలు లేవు ,
చెయ్యని మోసాలు లేవు .
                                                                 
ఎక్కని గడపలు లేవు ,
మొక్కని దేవుళ్ళు లేరు .

నీతులు వల్లిస్తారు ,
చేతులు జోడిస్తారు .

ఎండనకా , వాననకా తిరుగుతారు ,
ఏ ఎండకా గొడుగు వాడతారు ,

మనసారా పదవిని ఆకాంక్షిస్తూ ,
సారా , మనసారా అందిస్తారు .

సీట్ల కొఱకు ఎగబడ్తారు ,
ఈయకుంటే తిరగబడ్తారు .

కుర్చీలు విరగ గొడ్తారు ,
ఖుషీగ జెండా మార్చేస్తారు .

ఎదుటి పార్టీ తమ గూండాయిజానికే ,
సీటు యిస్తుందన్న దుర్భావనతో .

ఎంతైనా ఖర్చు పెడ్తారు ,
మఱల సంపాదించుకోవచ్చనే ,
దురాలోచనతో , దూరాలోచనతో .

ఈ వేషాలన్నీ ఈ ఎన్నికల సమయంలోనే ,
మన ఓట్లతో పదవులనందుకోవాలనే .

ఈ ఎన్నికలు మన నాయకులకు ,
పంచవర్ష ప్రణాళికలు గదా  మఱి  ! 


******


No comments:

Post a Comment