నాయకులూ బహుపరాక్

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

ఉదయం బుల్లితెర ఆన్ చేయగానే ,

" మా అమ్మాయి పెద్దదవుతుంటే ఒక ప్రక్క ఆనందంగా వున్నది చక్కగా చదువుకొంటుంటే , మరో ప్రక్క భవిష్యత్తు గురించి బాధగా కూడా వున్నది . ఉన్నత చదువులకు పరాయి ఊరికి బయటకు పంపాలంటే , ఏ మూలనుంచి ఏ కిరాతకుడు అరాచకాలు సృష్టిస్తాడేమోనని . ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అత్యాచారాలు , వృధ్ధులపై హత్యా ప్రయత్నాలు . వీటన్నింటినీ అఱికట్టించాలంటే " ఆయన రావాలి " అని ఆ యింటిల్లిపాది అనుకొంటూంటే ఒక రాజకీయ నాయకుడి ముఖచిత్రం దర్శనమిస్తుంటుంది .

" అవును ఆయన వస్తున్నాడు , యిక మన భద్రతకు , భవిష్యత్తుకు  ఏ లోటు వుండదు " అని ఆనందంగా చెప్పుకొంటుంటారు .

ఇంకొంచెం సేపటి తర్వాత మరొకటి దర్శనమిస్తున్నది అదే బుల్లితెరలో .

అమ్మా అన్నం తినవే అంటూ బ్రతిమలాడుతున్న ఓ కొడుకుచేతిని తను తిననంటూ ఆ అన్నపు పళ్ళాన్ని నెట్టేస్తూ , నా కొఱకు కూలీ పని చేసి నీ చేతులకు కాయలు కాయించుకున్నావటరా అంటుంది ఆ తల్లి ముసలమ్మ .లేదమ్మా " ఆయన వస్తున్నాడు " అంటాడు . ఎవర్రా ఆయన ? అని అడుగుతుంది . " ఆయన కాదమ్మా , నీ మనమడు వస్తున్నాడు , ఫ్యాను దుమ్ము దులపండి అంటూ వినపడ్తుంది .

మఱల ఇంకొంచెం సేపటి తర్వాత ,

" అందరం కలుసుందాం కలిసుంటే కలదు సుఖం అంటూ నినదిస్తూ , ఈ భూ ప్రపంచంలో ప్రతి మానవుడికి పాదరక్షలు నిత్యావసరమైనవి . పాదరక్షలు లేనిదెవ్వరైనా , ఎక్కడైనా , ఎప్పుడైనా , ఎటువంటి వారైనా బయట ప్రపంచంలో అడుగు పెట్టలేరు . అటువంటి పాదరక్షలు కలిసుండాలని కోరుకొంటున్నాయి . కనుక పాదరక్షలు మన జీవనానికి ముఖ్యమైనవని మరువకండి . "

అంతే కాదు " వేర్పాటువాదులకు ' చెప్పు ' సమాధానం " అంటూ ఓ క్యాప్షన్ కూడా .

మరల మరొకళ్ళు ,

మీ గిరిజనులను ఎస్ సీ లో కలిపేస్తము , జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ళు కట్టిస్తం , లక్షలకొద్దీ ఉద్యొగలిప్పిస్తము . మాయలోళ్ళు వస్తరు , మాయలు చేస్తరు , ఆశలు చూపిస్తరు , బాసలు చేస్తరు , నమ్మకండి . 60 ఏళ్ళ పాటు మనల్ని పాలిస్తున్నట్లు అగపడ్తూ , మన ప్రాంతాల్ని , మనల్ని యిప్పటిదాకా నిరవధికంగా డొబ్బారు . ఇంకా చాలలేదన్నట్లు యిప్పుడు ( అంటే సోనియమ్మ తప్పనిసరై యిచ్చేసిన తెలంగాణా రాష్ట్రం )కూడా వాళ్ళే మనల్నిపాలించాలని మన ప్రాంగణం లోనికి దూసుకొచ్చేస్తున్నారు . నమ్మకండి , నన్ను  , నా కుటుంబాన్ని, నా అనుచర వర్గాన్ని మాత్రమే నమ్మండి . ఈ ఎన్నికలలో మమ్మల్నే ఎన్నుకోండి . "

మరో ఛానల్ లో ,

" రైతులను ఆదుకుంటాను ,   అసలు రైతుల ఋణాలు బ్యాంకులలో ఎంత వున్నాయో తెలుసుకోకుండానే , ఎవరికి వాళ్ళు పాత ఋణాలు మాఫీలు చేస్తాం  అనటం ఎంతవరకు ఆచరణ రూపం దాల్చగలదు ? ఆడబిడ్డకు పుట్టినప్పటినుంచి అంతా ఖర్చులు మేమే భరిస్తాం అంటూ ఎన్నో ఆవేశపూరిత వాగ్దానాలు ఓ ప్రక్క వినపడ్తున్నాయి , కనపడుతున్నాయి . 

ఎవరు ఏం చెప్పినా ఓటర్లకి , ఎంతవరకు చేయగలరు ఈ నాయకులు అన్న ఆలోచన ఈ ఓటర్లకు వుండదను కొంటా రేమో . ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడి నోటికి వచ్చిన వాగ్దానాలను చేస్తూ పోతుండటం , ఓటు బ్యాంకింగుకు తప్ప , ఓటర్ల భవిష్యత్తును బాగుచేద్దామన్న ధ్యాస లేని ఈ నాయకులకు పదవి మీద తప్ప వేరే ధ్యాస లేదన్నది స్పష్టంగా అందఱికీ అర్ధమవుతూనే వున్నది కదా !  

ఇటువంటి వాగ్దానాలు నీటిపైన వ్రాయలేని వ్రాతలు కావా ? కొంచెం ఆలోచించి చూడండి .

ఇలా ఏవేవో చెప్పుకు పోతుంటే ప్రజలు నమ్ముతారనుకొంటున్నారా ? నమ్మరు గాక నమ్మరు .

అయితే ఒక్కటి  మాత్రం ఏ ప్రజానాయకుడైనా మరువకూడదు , ఎల్ల వేళలా గుర్తుంచుకొని తీరవలసిందే .

గతంలో మీరేం చెప్పారో , మీరేం చేశారో మీకు గుర్తు లేదా ? లేక మాకు గుర్తుండదని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రపోజల్స్ పెట్టి మభ్య పెట్టాలనుకొంటున్నారా ?  నాయకులారా , బహుపరాక్ !


                                                                                         *******

6 comments:

 1. బాగుందండోయ్ మీ వ్యాసం.....వ్యాసం వ్రాసారు అంటే మీరు ఫుల్ యాక్టీవ్ అన్నమాట....హ్యాపీ హ్యాపీస్ :-)

  ReplyDelete
  Replies
  1. నిజాలెప్పుడూ బావుంటాయి కదా ! ఇప్పుడిప్పుడే మెల మెల్లగా నార్మల్ కి వస్తున్నాను అని చెప్పుకోవచ్చు .

   Delete
 2. మీ వ్యాసం బాగుంది. చాలా కాలానికి మళ్ళీ దర్శనం సంతోషం శర్మాజి

  ReplyDelete
  Replies
  1. ఫాతిమాజీ ,
   ఆ నడుమ ఆఫిసు పనులతో బిజీగా వుండటం వలన , ఈ నడుమ నా ఎడమ కాలు ఎముక చిన్నగా చిట్లటం వలన , గత 6 వారాలుగా బెద్ రెస్ట్లో వున్నాను . ఇపుడిపుడే నార్మల్కి వస్తున్నది నడక . మీ అభినందనకు కృతఙ్నతలు .

   Delete
 3. అయ్యో.., రెస్ట్ తీసుకోండి, మంచివారికి ఏమీ కాదు.
  కొంచం కంగారు పడ్డాను కానీ వేచి ఉండటం తప్ప్ప ఏమీ చేయలేము కదా..,(ఓ సోదరున్లా అనిపించే వారు)

  ReplyDelete
  Replies
  1. మీ సోదరాభిమానానికి కృతఙ్నతలు .

   Delete