నేత ( ర ) చరిత్ర


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్ 


ఎన్నికల సమయంలో , ధనం , బలం కలిగిన నాయకులను ఎటువంటివరినైనా తమ పార్టీ అభ్యర్ధిగ నిలబెట్టటానికి దాదాపు ప్రముఖ పార్టీలేమాత్రం వెనకాడటం లేదనే చెప్పుకోవాలి .

ఎవరు , ఏ పార్టీనుంచి వచ్చినా , స్వాగత వచనాలు పలికి , కుశల సమాచారాలడిగి , ఆ పై వాళ్ళ పార్టీల తీర్ధం యిచ్చి , ఆ పై ఓ కండువా కప్పి అభ్యర్ధిగా నామినేషన్లు వేయిస్తుంటారు .

ఆ సమయంలో ఆ నాయకులు తు .చ . తప్పకుండా వాళ్ళ ఆస్తుల వివరాలు , రిటర్నింగు అధికారికి అందిస్తున్నారు .
అయితే అవి ఎంతవరకు నిజం అన్నదే ప్రశ్నార్ధకమవుతున్నది .   

వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ  స్థిర చరాస్తులు కొన్నారో , అవి కొనటానికి ఎన్ని రకాలుగ వ్యవహారాలు జరిపారో , అటు అమ్మిన వాళ్ళకి , యిటు కొన్న వాళ్ళకి , ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగినదో , ఎవరు డబ్బులు ముట్టజెప్పారో అన్ని వివరాలు చాలా మందికి తెలుసు . 

అటువంటివేమీ యిప్పుడు , యిక్కడ సదరు అభ్యర్ధి స్వంత ఆస్తుల లోనికి రావు .

తీరా  నామినేషన్లు వేసిన తర్వాత , నేరచరిత్రులనటం ఎంతవరకు సమంజసం ?
వాస్తవానికి ఆ యా పార్టీలు అభ్యర్ధిగా నామినేషన్లు వేయించిన తర్వాత , వాల్ళు కొత్తగ నేరాలు చేసిన వాళ్ళేమీ కాదు కద ! 

అంతకు ముందు వాళ్ళు నేరచరితులని , ఎన్నో మార్లు జైలు గడపలు చూసి వున్నారని , కోర్టు బోనులలో నుల్చొన్నారని , తమ తమ పలుకుబడిని ఉపయోగించి బయటకు వచ్చిన వాళ్ళేనని , యింకా కొంతమంది కేసులు కోర్టులలో కొనసాగుతూనే వున్నాయని , చాల మందికి తెలిసిన విషయమే . 

అంటే అవి తేలేటంతవరకు వాళ్ళు దోషులుగా పరిగణించలేము అనే వాళ్ళు లేకపోలేదు . నిజమే , అయితే యిక్కడ మరొక్కటి కూడా వాళ్ళు గ్రహించాలి . ఏమిటంటే , ఆ కేసులు కోర్టులో తేలేటంతవరకు ఎలా దోషులుగా పరిగణించలెమో , అలాగే నిర్దోషులుగా కూడా నిర్ణయించలేము .

కనుక అటువంటి వాళ్ళకు ఏ పార్టీలైనా తమ అభ్యర్ధిగా ఎలెక్షన్లలో సెలెక్షన్ చెయ్యకూడదు అన్నది గ్రహించుకోవాలి .
ఇలా గ్రహించేటందులకు ప్రభుత్వపరంగా ఇటువంటి చట్టాన్ని క్రమబధ్ధీకరణ ( పటిష్టంగా ) చెయ్యాలి . 

చరిత్ర అడక్కు , చెప్పింది విను అన్నది ఈ మధ్య ఎక్కువగా రాజ్యమేలుతున్నది . అందులకే నేరచరిత్రులే నేతలౌతున్నారు .


చరిత్రనడగాలి , పలువురికి తెలియజేయాలి , ఆ పైనే వారు అర్హులా ? కాదా ? అన్న కోర్టు నిర్ణయంతో నామినేషన్లకు ఉపక్రమించాలి .

ఏ పార్టీ అయినా ముందుగా తమ పార్టీ అభ్యర్ధి ఎవరో పత్రికా ముఖంగా తెలియ చేయాలి కోర్టుకి . ఆ తర్వాతనే వాళ్ళు అర్హులా ? కారా అన్నది నిర్ధారించబడ్తుంది వాళ్ళ నేరచరిత్రల ఆధారంగా . ఆ తర్వాతనే తదనుగుణంగా అభ్యర్ధుల చేత  నామినేషన్లు వేయించేలా చేయాలి .

ఆనాడే నేరచరితుల రాజకీయ చరిత్రకు ఓ చక్కటి ఆనకట్ట వేసిన వాళ్ళమౌతాము .

సత్చరిత్ర గల సమాజ  సేవ చేసే నాయకులను ఎన్నుకొనే అవకాశం మనందరకి లభిస్తుంది .

                                                                                           *******

2 comments:

 1. నేర చరిత లేనివాళ్ళే ఎన్నికల్లో నిల్చోవాలంటే వారికి రాజకీయం తెలిసి ఉండాలి కదా సర్,
  రాజకీయానికీ గూండాయిజానికీ్ దగ్గరి సంబంధం ఉంటుంది.
  చక్కని రచన (మీ హెల్త్ ఎలా ఉంది సర్)

  ReplyDelete
  Replies
  1. రాజకీయాలు , గూండాలు అరాచకాలని సృష్టిస్తారు . అందుకే ఆ రెంటికీ అవినాభావ సంబంధం అలా ఏర్పడిపోయింది .
   దానిని ఏ ఎన్నికలలోనైనా మార్చాలనుకుంటే మనం కొన్ని కొత్త కొత్త ఆలోచనలకు తావియ్యాలి .
   ఎవరి ఆలోచనలు వాళ్ళు పంచుకొంటుంటే మార్పు దానంతట అదే తన్నుకు వస్తుంది కదా!

   Delete