శ్రీరామ నవమి                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్ఈ జయ నామ సంవత్సర  పంచాంగంలోని తెలుగు తిధులలో తొమ్మిదవదైన నవమి . మాసాలలో ప్రధమదైన చైత్రం .

ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఏర్పడినది . ఎప్పటినుంచో కాదు .

త్రేతాయుగం నుంచి మాత్రమే . అంతకు ముందు గడచిపోయిన కృత ( సత్య ) యుగం నుంచి కాదు అన్నమాట .
సహజంగానే ఒక్కొక్క యుగంలో కొంతమంది సమాజ శ్రేయస్సుకై జన్మించి , సమాజంలో ఎలా మానవుడిగా ఎలా బ్రతకాలి ? సాటి మానవులను ఎలా చూడాలి ? వారి సమస్యలను ఎలా తీర్చాలి ? లాంటి వన్నింటినీ తన జీవనం ద్వారా తెలియ చెప్పేటందులకై ఆ శక్తి రక రకాల రూపాల్లో జన్మించటం జరుగుతుంటుంది .

అలా ఆ త్రేతాయుగంలో , శ్రీరామచంద్రుడుగా జన్మించి , తన జన్మకు కారణభూతులైన ఆ  తల్లితండ్రుల వద్ద ఎలా పెరగాలో సోదరులతో ఎలా మెసులుకోవాలో , సహధర్మచారిణి అయిన ధర్మపత్నిని ఎలా చూసుకోవాలో , ప్రజల సమస్యలను ఓ రాజుగా ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఎలా పరిపాలించాలో అలా పరిపాలించి ఆ తర్వాత యుగాలకు మార్గదర్శకుడిగా నిల్చిపోయాడు .

అందుకే ఆ తర్వాత యుగాల అన్ని వయసుల వాళ్ళు అలనాటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శపురుషుడిగా భావిస్తూ , కనపడని , అంతు తెలియని ఆ దైవ శక్తిని ఆయనలో పూజిస్తున్నారు .

అయితే పాటకులందరి మనసుల్లో ఒక్క సందేహం పొడసూపవచ్చు . ఏమిటంటే , మఱి ఆ ముందు యుగమైన , ప్రారంభ యుగమైన : కృత ( సత్య ) యుగం లో ఏ మహనీయుడు జన్మించలేదా ? ఎందులకు ? అని .
సందేహం పొడసూపటం సమంజసమే . మీ సందేహము సత్యమే . ఏలనన ఆ యుగమే ఆరంభం . అందునా ఆ యుగం సత్య యుగమవటం వలన ఈ అవసరం వచ్చి వుండక పోయిందని అనుకోవాల్సిందే .

ఆ తర్వాత యుగమైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించి రాబోయే కలియుగానికి ఆదర్శపురుషుడు .

ఆ తర్వాత యుగమైన కలియుగంలో ఆ శక్తి మానవ రూపంలో జన్మించన , సాటి మానవులందరూ పూర్తిగా గ్రహించుకోలేరని , సద్గురువుల రూపంలో , శిలా విగ్రహ రూపాలలో అవతరించి సన్మార్గపధానికి దోహదకారమవటం జరుగుతోంది .

ఈ కలియుగ జనాభా , మిగిలిన అన్నియుగాలు కలిపితే వచ్చినంత అన్నమాట . 

అటువంటి ఆ శ్రీరామ నవమి పండుగ రోజే ఈ రోజు .

ఆ ప్రయత్నంలో దీన్ని అత్యంత శుభకార్యంగా జరుపుకొంటున్నారు మన ముందు యుగాల వాళ్ళు .  

కనుక అటువంటి మహానుభావులను స్మరించుకొంటూ , మనసులో ఆ మంచిగుణాలను మనం చేసుకొంటుంటే , కొన్ని ఆ సద్గుణాలు కొన్నైనా అబ్బుతాయేమోనని ప్రయత్నం చేద్దాం . 

పాకులందరికీ ఇటువంటి శ్రీరామ నవమి శుభాకాంక్షలు మనఃస్ఫూర్తిగా .

     
                                                                                                       ****** 

2 comments:

  1. జై శ్రీరాం

    ReplyDelete
  2. ఛాలా బాగా చెప్పారు.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు....మీకు, మీ ఇంట్లో అందరికీ...

    ReplyDelete