చాతుర్యుగాల జీవన సారాంశం

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


కృతయుగంలో ,
ఆకాశం నుంచి వెలువడ్డ  
వేద శాస్త్రాల సారాంశం ,
 ఉపనిషత్తుల సారాంశమూ అదే ,
ఇందులో మరే వాదానికి అవకాశమే లేదు ,
ఇదే ఆ లోకనాధుల  అంతరార్ధం ,
మన జీవితాకిలా అన్వయించుకోవాలి .

త్రేతాయుగం లో ,
సీతా రామ లక్ష్మణ ఆంజనేయులు ,
మానవులుగానే , మనలాగే జన్మించారట ,
ఈతి బాధలు మనలాగే  అనుభవించారట ,
శ్రీరాముడు పితృ వాక్య పరిపాలకుడట ,
పర స్త్రీ వ్యామోహితుడు కాదట ,
ఏకపత్నీ వ్రతుడట , 

సీతా దేవికి  వనమైనా , జీవనమైనా ,
భర్త సన్నిధే సకల పెన్నిధట ,
పతియే సతికి ప్రత్యక్ష దైవమట ,

లక్శ్మణుడు అన్న మాట జవదాటడట ,
వదినె సీతాదేవి  అతనికి తల్లితో సమానమట ,

శ్రీ ఆంజనేయుడు , రామనామమే ,
వరనామంగా భావించాడట ,
అంతులేని శక్తిమంతుడయ్యాడట ,

రావణాసురుడు ఎంత శక్తిమంతుడైనా ,
శివుని ఆత్మ లింగాన్ని సంపాదించినవాడైనా ,
పరస్త్రీ వ్యామోహంతో నాశనమైపోయాడట ,
ఆనాటి రామాయణమే ,
మన జీవనగమనానికి మార్గదర్శకం .

ద్వాపరయుగం లో ,
శ్రీకృష్ణుడికి సమాజ శ్రేయస్సే ప్రధానమన్నాడు , 
లౌకికం తెలుసుకొని వ్యవహరించాలన్నాడు ,
తననెంతమంది కోరుకుంటున్నా ,
అందినట్లుగా కనిపిస్తూ,
అందకుండా వుండాలన్నాడు ,
తామరాకు మీద నీటి బొట్టులా .

గోపికలు కోరికలకు ప్రతిరూపాలన్నాడు  ,

పాండవులు ,
పంచేద్రియాలకు ప్రతిరూపాలట ,
కర్ణుడు ఆరోప్రాణమట ,

కౌరవులు ,
అంతులేని కోరికలకు తార్కాణమట ,
దుర్యోధనుడు ఎంత గొప్పవాడైనా ,
ఓ ఆడది అవమానించిందని ,
అవమాన భారంతో , 
దుష్ట చతుష్టయ సావాసంతో ,
మానాల్నే మంటగలిపేశాడట ,
ఇదే మహాభారతమట ,

కలియుగం లో ,
యుగాలు మారేకొద్దీ ,
జనాభా పెరుగుతోంది ,
దేవుళ్ళ సంఖ్యా ,
అధికమౌతోంది ,
అదే నిష్పత్తిలో ,
ఇదే  యుగ ధర్మమట ,
దైవం ఎక్కడ  ? అని ప్రశ్నిస్తే ,
ఎక్కడా లేడంటారు , 
ఆ పై , ఎక్కడో లేడు ,  
క్కడే  వున్నాడంటూనే ,
ఎక్కడ లేడంటారు ?

దైవానికి మారుపేరు విశ్వాసమేనట ,
ఆ విశ్వాసంతోనే ,
ఎందరో దేవుళ్ళట ,
ఎందరో దేవతలట ,
ఏ దేవుడు చెప్పినా , 
ఏ దేవత చెప్పినా , 
మంచిగా బ్రతకమన్నాట , 
పదిమందికి సాయం చేయమన్నాట ,

ఇలా ఎందరో మానవులు మహానుభావులై ,
అన్ని సద్గుణాలతో దేవుళ్ళు , దేవతలై ,
పిలువబడ్తున్నారట , కొలువబడ్తున్నారట .

ఏ యుగానికైనా , ఎప్పటికైనా ,
ఇవే అసలు సిసలు పునాదులట 

ఇదే వేద శాస్త్రాల ( ఉపనిషత్తుల ) , రామాయణ , 
మహాభారతాల , నడుస్తున్న చరిత్రల అంతః సారాంశం , 
ఎఱిగి మసులుకుంటే  మన మనుగడే ఆ స్వర్గసీమౌను కదా ! .

******

6 comments:

 1. సారాంశమంతా........కట్టే కొట్టే తెచ్చే టైపులో భలే చెప్పారు .

  ReplyDelete
  Replies
  1. నిజాలు , నీతులు ఎవ్వరు చెప్పినా బాగానే వుంటాయి కదా !

   కాకుంటే గమ్యం ఒక్కటైనా దారులు వేరు అన్నట్లు .

   Delete
 2. Replies
  1. మీకు ముందుగా నా బ్లాగుకి స్వాగతం .

   మంచి ఎవరైనా చెప్పవచ్చు గదా !

   Delete
 3. మీరు చూపిన దారి శుమార్గం,
  వివేకవంతమైన మీ టపాలు ఎప్పుడూ మంచివే.

  ReplyDelete
  Replies
  1. ఈ ప్రపంచంలో ఏదీ కొత్తగా పుట్టుకొని రాదు . ఎప్పటినుంచో వుంటున్నవే , కాకుంటే కొంతకాలం కనుమరుగవుతుంది . మఱచిపోతారు . ఆ తదుపరి బయటపడ్తుంది అప్పటివాళ్ళకు కొత్తగా వుంటుంది అంతే . కనుక నేను కొత్తగా చూపించటమేమీలేదు . ఇంతకుముందు వున్నవే .

   Delete