నాడు - నేడు


                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్
నాడు ,
అందరి సంపాదన యజమానిదే
ఆజమాయిషీ యజమానురాలిదే
అదే ఉమ్మడి కుటుంబం ,
అయినా ,
మదులు అంతా ఆ యజమాని ,
ఆ యజమానురాళ్ళవే ,
ఉమ్మడిగా కిచెన్ , డైనింగ్ & బాత్ రూములు మాత్రమే ,
డైనింగ్ మాత్రం మూకుమ్మడిగా ముగిస్తారు ,
ఎవరి గదులు మాత్రం వారివే ,
ఆ ఉమ్మడి కుటుంబమే ,
ఉన్నత కుటుంబం ,
కలసి వుంటే కలదు సుఖం అన్నారు 

నేడు ,
ఎవరి సంపాదన వారిదీ ,
ఆజమాయిషీ అందరిదీ ,
ఎవరికి వారే యమునా తీరే ,
ఎవరి కుటుంబం వారిదే,
ఎవరి గదులు , మదులు వారివే ,
పైకి కనబడేది స్వార్ధానికి ప్రతీకని , కానే కాదు ,
అవసరాలను బట్టి యిలా అడుగులేయవలసి రావటమే  ,
కూడా ఈ విఛ్ఛిన్నానికి ఓ కారణం అయి వుండవచ్చు .


         ******

6 comments:

 1. చాలా బాగా చెప్పారు

  ReplyDelete
  Replies
  1. మీకు ముందుగా నా బ్లాగుకి స్వాగతం .

   Delete
 2. Replies
  1. మీకు ముందుగా నా బ్లాగుకి స్వాగతం .

   Delete
 3. నాటి-నేటి జీవనవిధానం లో ఎంతటి మార్పు... నాడు అంతా ప్రేమమయం-నేడు అంతా యాంత్రికం. చక్కగా చెప్పారు.

  ReplyDelete
 4. నాడు - కుటుంబం లోనూ సమాజం లోనూ భద్రత ఉందేది, కానీ స్వేచ్చ లేని చట్రం వల్ల మనుషులు ఇరుకుగా ఫీలయ్యే వాళ్ళు.నేడు కావలసినంత స్వేచ్చ ఉంది, కానీ భద్రత లేదు - ఇంటి లోపలా బయటా కూడా. దీని కోసం దాన్ని ఒదులుకుని వచ్చినా అసలు ఈ రెంటి కన్నా ముఖ్యమయిన శాంతి లేదు.అంటే యేమిటన్న మాట - యేదో ఒకదాని కోసమే చూశాము కాబట్టి ఇలా జరిగిందని తెలుస్తుంది కదా. దాన్నీ దీన్నీ కలిపితే గానీ శాంతం రాదు. శాంతము లేక సౌఖ్యము లేదు.

  నేడు ఈ రెంటినీ కలపగలిగే దారి వెదికితే మనం రేపు సుఖంగా ఉండగలం.కానీ ఈ రెంటినీ కలపడ మెట్లా? చిన్న పిల్లలు కూడా సాటి వాళ్ళతో మాట్లాడ్డం మర్చి పోయి కిందా మీదా పడి ఆడుకోవడం అంటే యేంటో తెలీకుండా ఐపాడ్ ఒకటి చెవులకి తగిలించుకుని యాంత్రికంగా తయారయ్యారే?పక్క వూరిలో కాదు, పక్క వీదిలో కాదు ఒకే ఇంటో ఉన్న వాళ్ళే యెవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి?!

  ReplyDelete