మా నవ జీవనం

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

బాల్యంలో నచ్చినవి ,
ప్రాయంలో నచ్చలేదు ,

ప్రాయంలో నచ్చినవి ,
యౌవనంలో నచ్చలేదు .

యౌవనంలో నచ్చినవి ,
కౌమారంలో నచ్చలేదు .

కౌమారంలో నచ్చినవి ,
వార్ధక్యంలో నచ్చలేదు .

వార్ధక్యంలో నచ్చినా , నచ్చకున్నా ,
వదులుకోక వెళ్ళక తప్పటంలేదు .

చివరగా ,
 ఏ వయసులో నచ్చాల్సినవి ,
ఆ వయసులో నచ్చక పోవటమే ప్రధాన కారణం ,
నచ్చిన వాటితో , నచ్చిన వారితో ,
ఆనందించలేకపోవటమే కదా 
ఈ మా(నవ )జీవనం

******

5 comments:

 1. నిజమే... అందుకే వేదాంతం పుట్టింది,
  జరిగేదంతా మంచికనీ....,
  ఇకపోతే...నచ్చినవి దొరికినా అవీ కొంత కాలానికి పాతబడి పెద్ద గొప్పగా అనిపించవు..ఇది మానవ నైజం కాదంటారా?

  ReplyDelete
  Replies
  1. వేదనకంతం వేదాంతమని అర్ధం చేసుకొనవచ్చు .

   మానవ నైజమే నానాటికీ మా నవ నైజంగా మారుతున్నది .

   Delete
 2. ఇలా నచ్చలేదు అనుకుంటే ఏదీ నచ్చదు నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్లు నటిస్తే పోతుంది కదా అని మా అవ్వ చెప్పేది చిన్నప్పుడు నేను ఏదీ నచ్చలేదు అని ఏడిస్తే.....అదే ఫాలో అయిపోతున్నాను ఇప్పటికీ :-)

  ReplyDelete
  Replies
  1. అవ్వ మాటే బువ్వంటారు కదా మన పెద్దలు . ఆ పెద్దలమాటే చద్దన్నము మూట కదా !
   అలా మంచిపని చేయటం వలననే చక్కగా మన్ననలు , ప్రశంసలు అందుకొంటున్నావు .

   Delete