ఇక నైనా

                                                                                                                                               శర్మ జీ ఎస్

                                                                                 
                                                                                 


ఫేస్ బుక్ లో స్వాతి ఎకౌంట్ ఓపెన్ చేసింది
తన ఫేస్ ని చూపిస్తూ కొత్త ఫేసులను చూడ్దామనుకున్నది 
కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయమౌతారని
ఆ ఒరవడిలో సూరజ్ సింగ్ తో పరిచయం 
ఒక్కరోజులోనే ప్రణయానికి దారి చూపింది 
ఫలితంగా అతనితో గుట్టుగా ప్రయాణించింది
ఆ పరిచయం తన ఫేటునే మార్చేస్తుందనుకున్నది
చివరికి తన ఫేస్ నే ఎవరూ గుర్తుపట్టనంతగా మార్చేసింది 
ప్రణయంగా మారుతుందనుకున్నది ప్రళయంగా మారింది .
చున్నీఈకి అర్ధం తెలుగులో పయ్యెద అని
పయ్యెద అంటే అసలు అర్ధం పై ఎద అని
ఎదపై వేసుకొనేది కనుక పై ఎద 
గుర్తుకొచ్చేటట్లుగా పేరు పొందింది .

*******

గమనిక : నూతనత్వం  మంచిదే . అయితే దానిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకొంటే అందువలన సత్ఫలితాలు వస్తాయి . ఓ వేళ రాకున్నా దుష్ఫలితాలు రావు .

దేనిని ఎలా వాడాలో అలా వాడకుండా వుంటే ఏదైనా దుష్ఫలితాలనే అందిస్తుంది .

ఉదా : సైకిలు మీద ఆడవాళ్ళు వెళ్ళదలుచుకున్నప్పుడు , చీరె , పరికిణీ , పావావడాల కంటే , పంజాబీ డ్రెస్స్ వేసుకొంటే చాలా మంచిది .
టూ వీలర్స్ మీద ప్రయాణించేటప్పుడు , ప్రYఅణానికి వీలుగా వుండేవి ధరిస్తేనే సుఖంగా వుంటుంది .అటువంటి చున్నీ మీద శ్రధ్ధ లేకుంటే పరిణామాలు యిలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా వుంటాయి .

దీనినే ఆంగ్లేయులు చాలా సింపుల్ గా చెప్పారు . డ్యాన్స్ అకార్దింగ్ టు ద ట్యూన్ అని .
దాన్నే ంసన వాళ్ళు : ఏ ఎండకా గొడుగు పట్టమన్నారు . సరిగా అర్ధం చేసుకొంటే అందరికీ మంచిదే .

గ్రహించుకొని మసులుకొంటే మనుగడకెంతో మంచిది .

*******


6 comments:

 1. చక్కగా సెలవిచ్చారు.
  చెప్పడమైతే చెప్పగలం శ్రధ్ధగా పాటించేవారుంటే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. చెప్పేవాళ్ళు కొందరు , ఆచరించే వాళ్ళు అందరు . అపుడే జన జీవనం వనం మాదిరి కాకుండా నవ జీవనంగా మారే అవకాశాలు అధికంగా వుంటాయి .

   Delete
 2. Replies
  1. నిజాలు ఎవరు చెప్పినా చాలా బాగుంటాయి . ఆ నిజాల్లో నుంచే గుణపాఠాలు మొదలయ్యాయి చాలామందికి వాళ్ళ జీవితాలకు .

   Delete
 3. విషాదం వింటుంటే నే ఎలాగో ఉంది.

  ReplyDelete
  Replies
  1. ఒక్కళ్ళకు కలిగిన విషాదంలోంచే కద! ఇంకొంతమందికి అనుభవం ఉదయించేది .
   ఆ అనుభవంలో నుంచే కదా యింకొంతమంది పాఠాలు నేర్చుకొనేది .
   ఎంతోమంది జీవితాల బాగు కొఱకు కొంతమంది యిలా బలి పశువులుగా మారి
   అశువులు పోగొట్టుకొంటుంటారు తెలిసి కాదు , తెలియకనే .

   Delete