బాప్ రే

                                                                                                                           వ్యాస రచన : శర్మ జీ ఎస్                              

                                                            అందాలకు ,ఆనందాలకు మారుపేరు మన బాపు 
ప్రకృతి మొత్తాన్ని చూడలేము ,
కనుక బాపు బొమ్మల్ని చూస్తే ,
ఆ లోటు తీరిపోయినట్లే .
పిల్లల అల్లర్ని ఎపుడూ చూస్తూనే వుంటుంటాం , 
కానీ  ,
వాళ్ళ అల్లర్ని ఆనందంగా చూడటం 
బాపు గారి నుంచే నేర్చుకొన్నాం .
ఎంకి , నాయుడులు ఎనకటి మాలోకాలు ,
బాపు గారి ద్వారా ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు 
పక్కింటి పిన్ని గారంటే ,
బాపు గారు సృష్టించిన ఆ చిత్రం ,
హాస్యానికి మారుపేరైపోయింది .
వంటింట్లో అప్పడాల కఱ్ఱ చేత బట్టిన ,
ఆ పిన్ని గార్ని చూస్తే బుడుగులే కాదు , 
మొగుళ్ళు ( మగవాళ్ళు ) కూడా ఝడవాల్సిందే నన్న ,
నూతన ఒరవడికి ,
శ్రీకారం చుట్టిన బాపు గారి ,
ఆకారం ఎన్నటికీ , ఎవ్వరూ ,
మరచిపోలేనిది , మరువరానిది .
ఆనందం ఎక్కడో లేదు , 
అడుగడుగున మన నడవడిలోనే వున్నదని ,
చాటిచెప్పిన మేటి ఘనత బాపు గారి చిత్రాలదే .

ఇటువంటి బాపు గారిని విస్మరించకుండా ,
సదా స్మరించుకొంటూ , ఆయనను యిలా చూసుకొందాం . 

*********

8 comments:

 1. Replies
  1. శర్మ గారూ ,

   మీరన్నది అక్షరాల అందరికీ అనుభవమౌతున్నది .

   Delete
 2. పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
  త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
  పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
  తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
  డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

  ReplyDelete
  Replies
  1. డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారికి ,

   మునుముందుగా నా బ్లాగుకి స్వాగతం .

   పద పొందికతో మీరు వృఆసిన పద్యం బాగున్నది .

   వాస్తవానికి బాపూ గారు

   మరణ శయ్య పైకి చేరలేదు ,
   రమణ శయ్య పైకి చేరారు .

   Delete
 3. ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
  రాత గీత భువిని రాజ్యమేలె
  రాత నిన్న చనెను గీత నేడు చనెను
  రాత గీత దివిని రాజ్యమేలు

  ReplyDelete
  Replies
  1. చాలా చక్కగా సెలవిచ్చారు .

   Delete
 4. బాపు, ముళ్ళపూడి వెంకట రమణ ఇద్దరూ ఇద్దరే ...స్నేహానికి అర్థవంతమైన నిర్వచనాలు..ట్రూ లెజండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా...

  ReplyDelete