తెలుసుకొని మసులుకోవటమే మంచిదే

                                                                    వ్యాస రచన : శర్మ జి ఎస్

1  . మనం తఱచూ భజనలు చేసేవారిని , చేయించేవారిని చూస్తుంటాము , భజనలు వింటుంటాము .
భజనలు కీర్తనలతో ముడిపడి వుంటాయి . కీర్తనలు ఆధ్యాత్మికతకు అద్దం పడ్తుంటాయి , అందులోని అంతర్భావం తెలుసుకున్నప్పుడు . లేకుంటే ఆర్భాటానికే తావిస్తాయి .
ఉదా : హరే రామ , హరే రామ ,      రామ రామ హరే హరి .
          హరే కృష్ణ హరే కృష్ణ ,           కృష్ణ కృష్ణ హరే హరి .
ఇది నాకు తెలిసిన భజన కీర్తన .
దీని సారాంశమేమిటంటే ,
       హరియే రాముడు , హరియే రాముడు , రాముడే రాముడే హరియే హరి .  
       హరియే కృష్ణుడు , హరియే కృష్ణుడు ,      కృష్ణుడే , కృష్ణుడే , హరియే హరి  
అని నొక్కి నొక్కి చెప్పటం జరిగింది భజన కీర్తన ద్వారా .
కాని భజన చేసేవాళ్ళు , భుక్తి కొఱకు చేస్తున్నట్లు తప్ప అంతర్భావాన్ని వ్యక్తపరచలేక పోతున్నారన్నది కళ్ళకు కట్టినట్లు కనపడ్తున్న , వినపడ్తున్న సత్యం .
అసలు భజన ఎంతసేపు చేశామని గాని , చేయించామనిగాని కాదు ముఖ్యం . అంతర్భావాన్ని ఒక్క మారైనా వ్యక్తీకరించగలిగామా ? లేదా ? అవగాహన చేసుకొన్నామా ? లేదా ? అన్నదే అసలు ముఖ్యం .
పోటీలు పడి అలాంటి భజనలు చేయవలసిన అవసరం లేదు .
రోజుకొక్కమారైనా అంతర్భావాన్ని మది కెక్కించుకొంటే మనసు మఱి హాయిని పొందును కదా !
2  . చాలా మంది " శ్రీ రామకోటి " వ్రాస్తూ వుంటారు .
శ్రీ రామకోటి ఎన్ని పుస్తకాలు వ్రాశామన్నది కాదు  , ఎంతసేపు వ్రాశామన్నది కాదు , ఎలా వ్రాశామన్నదే అసలు విషయం . 
ఎందుకంటే చేసే పనియందు దృష్టి కేంద్రీకరణ కావాలి . అప్పుడే ఆ పనిలోని అంతర్భావం బోధపడ్తుంది . 
అదే కాకుండా   శ్రీ రామకోటి పుస్తకంలో గడులు దీర్ఘ చతురస్రాకారంలో వుండే గదుల రూపంలో వుంటాయి .
ఆ గడుల గదులలో 'శ్రీ రామ ' అని వ్రాయాలిట . ఇక వ్రాయటానికి మొదలు పెట్టిన క్షణం నుంచి మనసు పరి పరి విధాల పరుగులు తీస్తూ మనసుని లగ్నం కానీయక , హడావుడి చేసి , త్వరగా పేజి ముగిస్తే బాగుండు అన్న భావన స్థిరమై , అతి కష్టం మీద , అప్పుడో , లేక అంచెలంచెలుగానో పూర్తి చేసేవాళ్ళు అత్యధికంగా వుంటారు .
వాస్తవానికి వ్రాయకపోయినా శ్రీరాముడు వీళ్ళనేమీ అనడు , ఏమీ హాని కలిగించడు అన్నది వీళ్ళకు  తెలియదు అనుకోకూడదు .
భయంతో చేసే కార్యమైనా ఎన్నాళ్ళో నిలవక పోగా ఆ దురలవాటుని అన్ని పనులలో విస్తరింపజేస్తుంది . అదే భక్తితో చేసే కార్యమైనా క్రమశిక్షణ అలవరచి ,ఆ అలవాటుని అన్ని పనులలో విస్తరింపజేస్తూ కలకాలం నిలిచిపోతుంది
వ్రాయటం ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు , మన మనసు పరి పరి విధాల పరుగులు తీయకుండా , స్థిరంగా ఒక చోట లగ్నమయ్యేటందుకు మాత్రమే .అలా ఒక్కచోట అంటే ప్రశాంత చిత్తానికి మారు రూపాలైన మహాను భావుల మీద లగ్నమైనప్పుడు , మన మనుగడ మంచి రీతిన సాగుతుందని యిలాంటివి , వాళ్ళు అనుభవించి , స్వానుభవం లోకి తీసుకొని , ముందు తరాల వారు కూడా మార్గంలో నడచుకొంటే వాళ్ళ జన్మ సార్ధకత పొందు తుందని ఆశించి , వీటిని మనకు అందించారు .
మరొక ముఖ్య విషయమేమిటంటే శ్రీరామకోటి లో వున్న చిన్న చిన్న గడులు గదులలో మాత్రమే ' శ్రీరామ ' వ్రాయమన్నారు . అంటే మనకు యిచ్చినంత స్థలలోనే మనం వ్రాయాలన్నమాట . అలాగే మన జీవితాన్ని కూడా మనకు ఉన్నంతలో మనం సర్దుకుపోవాలన్నది అందులోని అంతరార్ధం . అలా సర్దుకు పోవటం అలవాటు చేసుకొంటే , రేపు ఎంతటి ఉన్నత స్థానం లభించినా గర్వానికి వశం కాము అని తెలుసుకోవాలి .
వ్రాయగా వ్రాయగా వ్రాత కుదుటపడి అందాన్ని సంతరించుకొంటుంది
నీకందుబాటులో వున్న నీ వ్రాతని , నీ చేత్తో బాగు చేసుకొమ్మన్నారు . పై భగవంతుడే చూస్తాడంటారు .

ఇవన్నీ నా ఆలోచనలు . ఎవరినీ బలవంతం చేయటం లేదు పాటించమని , అలవరచుకోమని . అర్ధమైందనుకుంటాను . వాదనలు నాకిష్టం లేదు .


                                                                                           **********

4 comments:

 1. స్థిర చిత్తం కలగదం కష్టం కదండీ, సాధనమున పనులు సమకూరు ధరలోన, అందుకు ఇలా చెయ్యమన్న్రు. ఎవరి అదృష్టం వారిది.
  చాలా కాలం తరవాత.

  ReplyDelete
 2. మీ స్పందనకు నా కృతఙ్నతలు .

  ReplyDelete
 3. మంచి అలవాట్లని ఆచరించడం కాస్త కష్టమే అయినా ఆచరిస్తే ఇష్టంగా అనిపిస్తాయి. మంచిపోస్ట్ తో చాలాకాలానికి విచ్చేసారు. ఎలా ఉన్నారు శర్మగారు.

  ReplyDelete
  Replies
  1. బాగానే వున్నాను పద్మా . కొన్ని ఆస్తుల విషయంలో కొంచెం బిజీగా వున్నాను .

   Delete