ఒప్పు ఒప్పు తప్పు తప్పు

                                                                                                                              వ్యాస రచన : శర్మ జీ ఎస్ 

పాఠకులందరికీ ,
66 వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .
శుభోదయం .

పాప పుణ్యాలు . 

ఇది అంతు తెలియని , అంతు చిక్కని అంశంగా అందరి మనసుల్లో ఆస్థానం ఏర్పరచుకొన్నాయి . 

అలాగే దేవుళ్ళు , దేవతలు కూడా  ఈ కోవ లోకే  .

పాపం చేస్తే ఈ మానవులు మరణించిన తర్వాత నరకలోకానికి తోసివేయబడి , తాము చేసిన ఘోర కృత్యాలన్నింటికీ , ఆ  ఘోర శిక్షలు అనుభవించవలసి వస్తుందని మన వేదాల ద్వారా  వారు  తెలుసుకొన్నవి మన ముందు యుగాల వారు తెలియ చేస్తూ వస్తూనే వున్నారు .

అలాగే పుణ్యం చేస్తే ఈ మానవులు మరణించిన తర్వాత  నరకలోకం నుంచి స్వర్గ లోకానికి తీసుకువెళ్ళబడ్తారని , వాళ్ళు మానవ జన్మలో చేసిన తమ సత్ప్రవర్తన తీరుకు , వాళ్ళకు అంతకు ముందెన్నడూ ఊహించని , అనుభవించని సుఖాలని అందిస్తారని చెబుతూ వున్నారు . 

ఇక దేవుళ్ళు , దేవతలు ఈ ప్రాణికోటి జీవన గమనాల్ని ఎప్పుడూ గమనిస్తూనే వుంటారని , మనమేమైనా సత్కార్యాలు చేస్తుంటే , వాళ్ళు చేయూత నిస్తారని ( పరోక్షంగా ) , మానవులు కోరుకున్న సత్కోరికలను తీర్చేటందుకు దోహద పడ్తారని మన ముందు యుగాల వాళ్ళు తెలియజేస్తూ వస్తూనే వున్నారు . ఈ ప్రాణికోటి  ఉనికికి మూలం గతం . ఆ గతాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రాణికోటి  జీవన గమనం సాగుతూ వచ్చింది .

విచిత్రమైన విషయం ఏమిటంటే , ఈ పాప పుణ్యాలు గాని , ఈ దేవుళ్ళు దేవతలు గాని ఈ ప్రాణికోటికి  కనపడనివే . 

అలా కనపడని వాటిని ఈ ప్రాణికోటి జీవన గమనానికి ముడి వేయటం జరిగింది . 

ఎవరి చేత ???????????????

ఆ నాటి మానవుని చేతనే .

ఎందుకు ????????????????

ఒకటి నుంచే అనేకం పుట్టుకొస్తున్నాయి . ఇదే కళ్ళ ముందు కనపడ్తున్ననగ్న సత్యం . 

దీనివల్ల ఆరంభంలో వున్న శక్తి లేకుండా పోతున్నది . మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడినట్లు . కనుక క్రమేపీ బలహీనుడైపోతున్నదీ ప్రాణికోటి . . కనుక సమస్యలెన్నో ఎదురౌతాయి సహజీవనంలో . 

మొక్కలోనే వంగనిది , మానైనాక వంగుతుందా ? అన్న సందేహంతో ,కొన్ని సృష్టించబడ్డాయి .

ఆ కోవలోకి చెందినవే ఈ పాప పుణ్యాలు , దేవుళ్ళు , దేవతలు .

ఎందుకంటే ఈ ప్రాణికోటిలోని ఓ కోవకు చెందిన 

మానవులకు భయమైనా వుండాలి , లేకుంటే భక్తి అయినా వుండాలి అన్న ధృఢ నిశ్చయానికి వచ్చిన ఆ నాటి మానవులు ,అప్పుడే ఈ సమాజంలో సహజీవనం సజావుగా సాగుతుందన్న సద్భావనతోనే ఆనాడే వీటిని సృష్టించారు .

పాప పుణ్యాల సంఖ్య వృధ్ధి అయింది రకరకాలుగా . కాని పేర్లు మాత్రం అలానే వుండిపోయాయి .

దేవతలు మాత్రం యుగ యుగాలుగా వృధ్ధి చెందుతూనే వచ్చారు . ఎందువల్లంటే , ఈ మానవులు తాము చేస్తున్న , చేయవలసి వచ్చిన తప్పుడు పనులకు భయపడ్తూ , అలా కొత్త కొత్త దేవుళ్ళని , దేవతల్ని సృష్టిస్తూనే వస్తున్నారు . 

అందుకే రక రకాల దేవుళ్ళు , దేవతలూనూ . ఆ దేవుళ్ళకి , దేవతలకి కొత్త కొత్త పేర్లని ఈ మానవులే నామకరణం చేస్తూ అలా వృధ్ధి చేసుకొంటూ వస్తున్నారు , వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్ట్లుగా .

వాస్తవానికి ఆనాటి మన ముందు యుగాల వారు ఆరంభదశలో ఈ దేవుళ్ళనీ , దేవతలని , పాప ,పుణ్యాలని సృష్టించినది సమాజం సజావుగా సాగాలన్న సదుద్దేశంతోనే .

ఈ దేవుళ్ళు , దేవతలు బాహాటంగా కనపడనివి . పాప ,పుణ్యాలు మాత్రం బాహాటంగా కనపడేవి . 
ఎలాగంటే వాళ్ళ వాళ్ళ నడవడితో .

కనపడుతున్న ఈ పాప పుణ్యాలని , కనపడని ఆ నరక ,స్వర్గ లోకాలకు ముడిపెట్టారు .

ఐతే ఒక్క విషయం మాత్రం నిజం . ఇన్ని రకాల భయ భక్తులుంటేనే సమాజం సజావుగా సాగటం లేదు . 

ఇవే లేకుంటే .................. అమ్మో ???????????????????????????????????????????????

వీటిని సృష్టించటంలోని ఆనాటి మానవుల అంతరార్ధం మెచ్చుకోదగ్గది . 

ఉన్నాయో , లేవో  అప్రస్తుతమే కదా ! ఉన్నారనుకొంటుంటేనే యిన్ని ఘోర కృత్యాలు నిత్యం జరుగుతూ , పెరుగుతూనే వున్నాయి . 

లేరంటే ? అమ్మో ??????????????????????????????????????????????????????


ఆ ప్రపంచాన్ని ఊహించుకోవటానికి కూడా వీల్లేదు .

కనుక దేవుళ్ళు , దేవతలు ఉన్నారనుకోవటంలో వున్న ఆనందం మరెందులోను లభించదు .

ఆ దేవుళ్ళని , దేవతలని మన మానవాకారంలోనే మనం పూజిస్తున్నాము . 

వాస్తవానికి , మన మానవులకు , ఆ దేవుళ్ళకు , దేవతలకు భేదమేమిటంటే , 
మనలో  వున్నది , వుండేది మితమైన శక్తి మాత్రమే , 
మఱి ఆ దేవుళ్ళకి , ఆ దేవతలకి అనంతమైన శక్తి వున్నది . ఆ శక్తి అనంత కోటి దేవుళ్ళ , దేవతల రూపాలలో వుండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది .

కనుక , దేవుళ్ళు , దేవతలు వున్నారనుకోవటమే ఒప్పు ఒప్పు . పాప , పుణ్యాలు లేవనటం తప్పు తప్పు .


                                                                                                    ************                         

6 comments:

 1. మానవుడు మానవుడిగా జీవించడానికి కొన్ని నమ్మాలి. నాకు దేని మీదా నమ్మకం లేదన్నవారిని"తెలిసియుదెలియని నరు దెలప బ్రహ్మదేవుని వశమే" అన్నట్టుగా ఉండి,మానవ ప్రకృతే నశిస్తుంది.

  పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.....

  ReplyDelete
  Replies
  1. దేవుళ్ళని వ్యాపారంగా చెయ్యకూడదు . దేవుళ్ళను అతీతమైన అనంత శక్తిగా చూడాలి . అప్పుడే ఆ ఫలితాలను అందుకోగలుగుతారు . లేకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదమున్నది .

   Delete
 2. నేను దేవుడిని దెయ్యాన్ని కూడా నమ్ముతానండి శర్మగారు.

  ReplyDelete
  Replies

  1. పద్మార్పిత గారు,

   దేవుడి ని నమ్మితే తా అత్ ! దయ్యాన్ని నమ్మితే ఠా మర్ !!!

   జేకే
   జిలేబి

   Delete
 3. 19, 20 బెళగావి
  30 బిఠూర్ గా అక్షరదోషాలు సరిదిద్దగలరు

  ReplyDelete
  Replies
  1. ఫణి దీప్ గారికి ,

   ముందుగా నా బ్లాగుకి స్వాగతం .

   మీరు మీ కమెంటు ని పొరపాటున " ఒప్పు ఒప్పు తప్పు తప్పు " లో ప్రచురించారు .

   ఇక సవరణలకు స్వాగతం .
   మీ సవరణలు ఉఛ్ఛారణననుసరించినవి .

   Delete