సిగ్గు పడాల్సిందే , మారాల్సిందే , మార్చాల్సిందే


ఈ మధ్య రిపబ్లిక్ డే నాడు స్టూడియో ఎన్ న్యూస్ వారు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు .

ఎన్ని కష్టాలకోర్చి ఈ రిపబ్లిక్ డే ని సాధించుకొన్నామో సంవత్సరానికొకమారు ఆ ఘనతను మననం చేసుకొందామని పండుగ జరుపుకొంటున్నాము .

తెలుసా నీకు ?

తెలుసు .రిపబ్లిక్ డే .

రిపబ్లిక్ డే అంటే ఏమిటి ? అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

అవును . భారత రాజ్యాంగం అమలు జరిపిన రోజు ఇవ్వాళ కాబట్టి . ఈ రిపబ్లిక్ డేని చేసుకుంటారు .

సూపర్బ్ . ఇదే క్వొశ్చన్ని కొంతమంది పబ్లిక్ని అడిగి తెలుసుకొందాము . ఎవరు ఏం చెబుతారో చూద్దాం .


video

  Please see the video in the you tube as Republic comments .                                                  
నేటి యువత ఈ రిపబ్లిక్ డే అంటే ఏమిటో వివరణ యిచ్చిన వైనం మన పాఠ్యాంశాలుగాని , గడచిన చరిత్ర గాని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయినాయని సుష్పష్టంగా విశదమవుతున్నది .

చలన చిత్ర రంగం ఎంతగా ప్రభావితం చేస్తుందో కూడా బాగా అర్ధమవుతున్నది .

వీళ్ళు రేపటి భావి పౌరులు అని చెప్పుకొంటున్నాము .

ఇటువంటి కార్యక్రమాలు చూసిన్ తర్వాతైనా నేటి యువతకు ఏం నేర్పాలో మన ప్రభుత్వాలు , తల్లి తండ్రులు తెలుసుకొనటం ఎంతైనా మంచిది .

విద్యా బోధనలో తగు మార్పులు తప్పని సరి అని తెలుసుకొని తదనుగుణంగా నడచుకొంటే ముందు తరానికెంతో మంచిది . దేశానికి కూడ .

No comments:

Post a Comment