మాయాట


                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్

ఎక్కడనుంచి వచ్చారో
ఎటు వెళ్తున్నారో,
ఎంత కాలం ఉంటారో ,
ఆ పై ,
ఏమైపోతారో తెలియని  జనం ,
ఈ జీవుడు దేవుడయ్యేదెప్పుడా ? అని ,
ఆలోచిస్తుంటారు  , ఆయాసపడ్తుంటారు  .

వాస్తవానికి ఏ ,
ఎదుగూ బొదుగూ లేనిది ,
అంటే అన్నీ వున్న విస్తరే కదా ! 
ఆ దేవుని గమనం .

అడుగడుగున ఎదుగుతూ ,
అనుక్షణం ఒదుగుతూ ,
సాగేదే ఈ జీవుని పయనం .

వాస్తవానికి  ,
ఆ దేవుడినే ,
ఈ జీవుడు తన (అతి ) తెలివితో 
కొత్త కొత్తగ పుట్టిస్తుంటాడు ,
తనతో పెంచుకుంటుంటాడు ,

ఆ దేవుడు
ఎవరెలా పిలిచినా పలికి తీరతాడు ,
ఎందుకంటే ,

ఆ దేవుడు ఒక్కడే కాబట్టి 

అటువంటి  ,
 దేవుడికి ,
ఈ జీవుడికి పోలికేమిటి ?
 జీవుడు ఎన్నటికీ దేవుడు కాలేడు ?

ఎందుకంటే అసలు ఆ దేవుడంటేనే అనంత శక్తి
ఆ శక్తి  మాట్లాడనే మాట్లాడక పోవచ్చు , 
కాని ,
సత్తా చాటుతుంది .

మఱి అంతటి అతీత , అనంత శక్తి మంతుడు,
ఈ జీవుడు ఎప్పటికీ కాలేడు 
అలాగని  ,
ఆ ప్రయత్నం మానడు ,

మానకూడదు కూడా ! 
ఈ ప్రయత్నమే  ,
తనని తాను తెలుసుకోవటంలో 

ఆ దేవుడు చేసే మాయే యిది .

*****

No comments:

Post a Comment